అన్వేషించండి

మరోసారి మంచి మనసు చాటుకున్న మెగాస్టార్.. అనారోగ్యం బారినపడిన బాల్య మిత్రుడి కోసం ఏం చేశారంటే?

చిరంజీవి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యం బారినపడిన తన చిన్ననాటి స్నేహితుడికి అండగా నిలిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మెగాస్టార్ చిరంజీవి సేవాగుణం గురించి, దాతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే నేనున్నానంటూ ఆపద్భాంధవుడుగా నిలిచే చిరు.. గత కొన్నేళ్లుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బ్ల‌డ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించి ఎందరి ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారు. కేవలం తన అభిమానులకే కాకుండా తోటి కళాకారులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులు, స్నేహితులకు కూడా ఆయన అండగా నిలుస్తూ ఉంటారు. అయితే ఎంత చేసినా చిరు ఎప్పుడూ తన సహాయం గురించి చెప్పుకోరు. సాయం పొందిన వ్యక్తులు బయటకు చెప్పినప్పుడు మాత్రమే అందరికీ తెలుస్తుంటాయి. తాజాగా మెగాస్టార్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. అనారోగ్యం బారిన పడిన చిన్ననాటి మిత్రుడికి మర్చిపోలేని సాయం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 

చిరంజీవి బాల్యం అంతా మొగల్తూరులో గడిచిందనే సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు పువ్వాడ రాజా అనే చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. అయితే ఆ మధ్య అతని ఆరోగ్యం దెబ్బ తినింది. ఈ విషయం తెలుసుకున్న చిరు స్వయంగా రాజాకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆ కుటుంబానికి క‌ష్ట కాలంలో అండ‌గా నిలుస్తాన‌ని భ‌రోసానిచ్చారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన్ను హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేయించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా చిరు హాస్పిటల్ కు వెళ్లి మిత్రుడిని పలకరించి, వైద్యుల నుంచి రాజా ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

Also Read: విక్రమ్‌ సింగ్ రాథోడ్‌ తర్వాత నాకు సంతృప్తినిచ్చిన పాత్ర ఇదే: రవితేజ

స్నేహితులకు బాగోకపోతే ఎక్కడ డబ్బు సాయం చేయాల్సి వస్తుందని తప్పించుకొని తిరిగే ఈరోజుల్లో.. ఎప్పుడో చిన్నప్పుడు తనతో కలిసి తిరిగిన మిత్రుడిని హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్న చిరంజీవి ఎందరికో ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల చిరు మోకాలికి చిన్న సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అందుకే ఈ మధ్య పెద్దగా బయటకు రావడం లేదు. అయితే ఇప్పడిప్పుడే కోలుకుంటున్న ఆయన తన ఫ్రెండ్ బాగోగులు తెలుసుకోడానికి స్వయంగా హాస్పిటల్ కు వెళ్లి పలకరించడం గొప్ప విషయమని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. బండ్ల గణేష్ సైతం చిరుని ట్యాగ్ చేస్తూ 'మీరు గ్రేట్‌ సర్‌' అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు చిరంజీవి. అయితే మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన ‘భోళా శంకర్‌’ చిత్రంతీవ్ర నిరాశ పరిచింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చూసింది. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు వహిస్తున్న చిరు.. ప్రస్తుతం రెండు సినిమాలను లైన్ లో పెట్టారు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి రెడీ అయ్యారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఈరోజు దసరా సందర్భంగా ప్రారంభం కానుందని సమాచారం. మరోవైపు కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాణంలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు మెగాస్టార్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.

Also Read: 'ఆదిత్య - 999 మ్యాక్స్' స్టోరీని ఒక్క రాత్రిలో రెడీ చేసేశా, మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడే: బాలకృష్ణ 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Embed widget