అన్వేషించండి

Balakrishna: 'ఆదిత్య - 999 మ్యాక్స్' స్టోరీని ఒక్క రాత్రిలో రెడీ చేసేశా, మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడే: నందమూరి బాలకృష్ణ 

తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ వచ్చే ఏడాది ఉంటుందని నందమూరి బాలకృష్ణ తాజాగా స్పష్టం చేసారు. 'ఆదిత్య - 999 మ్యాక్స్' స్టోరీని ఒక్క రాత్రిలో రెడీ చేసినట్లుగా తెలిపారు. 

నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు అంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంత వరకూ వెండి తెర మీదకు రాలేదు. తనయుడి తెరంగేట్రాన్ని రెండేళ్ల క్రితమే కన్ఫర్మ్ చేసిన బాలయ్య.. డెబ్యూ మూవీని మాత్రం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తాజాగా మరోసారి మోక్షు ఎంట్రీ గురించి మాట్లాడారు. 

బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'భగవంత్‌ కేసరి' ఇటీవలే విడుదలైంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని బాలకృష్ణ, శ్రీలీల స్పెషల్ ఇంటర్వ్యూని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే మోక్షజ్ఞ తెరగేట్రంపై స్పందించారు బాలయ్య. వచ్చే ఏడాది డెబ్యూ ఇస్తాడని, అతని కెరీర్ పై తనకు ఎలాంటి టెన్షన్ లేదని అన్నారు.

'మీ అబ్బాయి డెబ్యూ ఎప్పుడు ఉంటుంది?' అని శ్రీలీల ప్రశ్నించగా.. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది బాలయ్య బదులిచ్చారు. "మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరితో అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడూ మెంటల్ గా ఏదీ ప్రిపేర్ అవ్వను. ఇదని అదని నేను ఏవీ ప్లాన్ చేయను. రేపు షూటింగ్ అంటే, ఈరోజు కథ రెడీ అయిపోతుంది. నేను ఆ స్పీడ్ లో వెళ్తుంటాను. నా స్పీడ్ ఎవ్వరూ తట్టుకోలేరు. మోక్షు భవిష్యత్ గురించి నాకు అస్సలు దిగులే లేదు. ఎందుకంటే, నా దగ్గరే బోలెడన్ని సబ్జెక్టులు ఉన్నాయి" అని బాలకృష్ణ తెలిపారు.

Also Read: 'ఆయన అఛీవర్‌, నేను అఛీవ్‌మెంట్‌ మాత్రమే'.. బన్నీ ఎమోషనల్‌ స్పీచ్‌!

"మోక్షజ్ఞ మొదటి సినిమా ఏదవుతుందో నాకు తెలియదు. ఫస్ట్ సినిమా నాదే కావొచ్చు, లేదా రెండో సినిమా అవ్వొచ్చు. నా 'ఆదిత్య 999 మ్యాక్స్' సబ్జెక్ట్ సిద్ధంగా ఉంది. ఆ స్టోరీ ఒక్క రాత్రిలో రెడీ చేశాను. అది కూడా ఆ నైట్ నేను పడుకున్నా, ఆసువుగా కథ వచ్చేసింది. ఆ కథ ప్రిపేర్ అయింది కాబట్టి గొడవ లేదు. ఇంకో కథ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. మరో నాలుగైదు రకాల కథలు కూడా ఉన్నాయి. అందుకే మోక్షు ఫ్యూచర్ గురించి నాకు దిగులే లేదు. నా దగ్గర ఫెంటాస్టిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది చూడాలి" అని బాలయ్య అన్నారు.

"రామరావు మనవడు అనో, బాలకృష్ణ కొడుకు అనో కాదు.. నేను సబ్జెక్ట్ కి ప్రాధాన్యత ఇస్తాను. లెగసీని ముందుకి తీసుకెళ్లాలనే భారం అతని మీద వుంది. దానికి తగ్గట్టుగా నాకు సినిమాల మీదున్న అవగాహనతో ఒత్తిడి లేకుండా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి తీసుకొస్తాను. ఆ తర్వాత అతనే దాన్ని ముందుకు తీసుకెళ్తాడు" అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

కాగా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నటించిన క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు బాలకృష్ణ. స్వయంగా 'ఆదిత్య 999 మ్యాక్స్' కథ రెడీ చేసినట్లుగా వెల్లడించారు. మరి నందమూరి మోక్షజ్ఞ ఈ స్టోరీతో ఎంట్రీ ఇస్తాడా, లేదా మరేదైనా సినిమాతో ఆరంగేట్రం చేస్తాడా అనేది వేచి చూడాలి.

Also Read: విక్రమ్‌ సింగ్ రాథోడ్‌ తర్వాత నాకు సంతృప్తినిచ్చిన పాత్ర ఇదే: రవితేజ

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
New Maruti Dzire: ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
ఈ బడ్జెట్ కారు ఫుల్ సేఫ్ - క్రాష్ టెస్టు పాస్ అయిన మొదటి మారుతి కారు - త్వరలోనే లాంచ్!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget