అన్వేషించండి

Allu Arjun: 'ఆయన అఛీవర్‌, నేను అఛీవ్‌మెంట్‌ మాత్రమే'.. బన్నీ ఎమోషనల్‌ స్పీచ్‌!

నేషనల్ ఫిలిం అవార్డులు అందుకున్న టాలీవుడ్ ప్రముఖులను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సన్మానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

నేషనల్ ఫిలిం అవార్డ్స్ అందుకున్న టాలీవుడ్ ప్రముఖులకు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి హైదరాబాద్ గండిపేటలో నిర్వహించిన ఈ పార్టీలో జాతీయ అవార్డు గ్రహీతలను మైత్రీ ప్రొడ్యూసర్స్ సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో పాటుగా పలువురు సినీ సెలబ్రిటీలు, దర్శక నిర్మాతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 'పుష్ప: ది రైజ్' సినిమానికి గానూ ఉత్తమ నటుడిగా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకోవడంపై బన్నీ సంతోషం వ్యక్తం చేసారు. దేవిశ్రీతో కలిసి అవార్డు తీసుకోవడం తనకు ఎంతో స్పెషల్ అని అన్నారు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ ''నేను మాట్లాడాలని అనుకోలేదు. కానీ దేవీని చూసిన తర్వాత మాట్లాడాలని అనిపించింది. అందరితో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది. దేవిశ్రీ ప్రసాద్‌ తో కలిసి అవార్డు తీసుకోవడం నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే 'ఆర్య' సినిమా అప్పటి నుంచి హిందీ ఇండస్ట్రీలోకి వెళ్లమని దేవిశ్రీకి చెప్తూ వచ్చాను. హీరోగా నేను హిందీ సినిమాల్లోకి వెళ్లడం కష్టం. అదే హీరోయిన్లు, టెక్నిషియన్లు వెళ్లడం ఈజీ. అప్పటికి బాలీవుడ్ అనేది మనకు చాలా దూరం. నేను అది ఎప్పుడు అచీవ్ చేస్తానో లేదో నాకు తెలియదు.. నువ్వు వెళ్లి ఒక హిందీ సినిమా చేయమని దేవికి చెప్పేవాడిని. గత 20 ఏళ్లలో ఎన్నోసార్లు చెప్పాను. అలా చెప్పిన ప్రతీసారి ఎప్పటికప్పుడు ‘ముందు నువ్వు వెళ్లు అబ్బా.. నీతో పాటు నేనూ వచ్చేస్తా’ అనేవాడు. అది మనకెక్కడ సాధ్యమవుతుందిలే అనుకునేవాడిని. అలాంటిది అనుకోకుండా ‘పుష్ప’ సినిమా హిందీలో అంత బాగా వర్క్ అవుట్ అవడం, మేమిద్దరం ఒకేసారి హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాం'' అని అన్నారు. 

''20 ఏళ్ల నుంచి దేవి అన్న మాటను నేను ఒక్కసారి కూడా సీరియస్ గా తీసుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఆ మాట నిజమైనందుకు, తనతో కలిసి నేషనల్ అవార్డు తీసుకోవడం అనే ఫీలింగ్ ని నేను మాటల్లో చెప్పలేను. దేవికి అవార్డు వచ్చినందుకు అభినందనలు. జాతీయ అవార్డులకు మా ఇద్దరి పేర్లు ప్రకటించినప్పుడు మా నాన్న ఎంతో సంతోషించారు. నా ఇద్దరు కొడుకులకు నేషనల్ అవార్డ్స్ వచ్చినట్టు అనిపిస్తుందని ఆయన అన్నారు. దేవి తండ్రి సత్యమూర్తి గారు లేకపోవచ్చు.. కానీ దేవి అవార్డు తీసుకోవడం నేను చూడాలి. అందుకే ఢిల్లీ వస్తానన్నారు. ఆయన నాకు అవార్డు వచ్చినందుకు ఎంత ఆనందించాడో, దేవికి వచ్చినందుకు కూడా అంతే ఆనందించారు. 'చెన్నైలో చదువుకుంటున్నప్పుడు ప్రిన్సిపల్‌ దగ్గర మినిమమ్ సెర్టిఫికెట్ తీసుకోని మేము.. ఇప్పుడు ప్రెసిడెంట్‌ దగ్గర మెడల్స్‌ తీసుకుంటామని అనుకున్నావా?’ అని ఆయన్ని అడిగా'' అని నవ్వుతూ చెప్పారు బన్నీ. 

''నా లైఫ్ లో ప్రతి దశలో నేను ఏదో ఒక విషయం నేర్చుకుంటూ ఉంటాను. అది అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను. మనం ఏదైనా గట్టిగా కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుందని అనుకుంటాం. ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే.. మనం కోరుకుంటే వచ్చేది 50 శాతం మాత్రమే, మిగతా 50 శాతం మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటేనే ఏదైనా సరే వస్తుంది. మనం ఎంతగా కోరుకున్నా మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా కోరుకోవాలి. నాకు నేషనల్ అవార్డు అందుకోవాలనే కోరిక ఉంది. కానీ నాకు ఈ అవార్డు రావాలని నాకంటే సుకుమార్‌ గారు ఎక్కువగా కోరుకున్నారు. అందుకే నాకు ఈ అవార్డు వచ్చింది. ఆయన అఛీవర్‌.. నేను అఛీవ్‌మెంట్‌ మాత్రమే. అవార్డు నా ద్వారా వచ్చింది కానీ, నా వల్ల కాదు అనేది నాకు తెలుసు. థాంక్యూ సుక్కూ డార్లింగ్’’ అంటూ అల్లు అర్జున్‌ ఎమోషనల్ అయ్యారు.

కాగా, ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం ద్వారా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి తెలుగు యాక్టర్ గా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో బన్నీ తండ్రి అల్లు అరవింద్ తన ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులకు పార్టీ ఇవ్వగా.. మామ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసారు. 'పుష్ప 2' సెట్స్ లో కేక్ కట్ చేయించి సెలెబ్రేట్ చేసుకున్న మైత్రీ మేకర్స్.. ఇప్పుడు నేషనల్ అవార్డు సాధించిన టాలీవుడ్ ప్రముఖలను సత్కరించారు. 

ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప: ది రూల్' సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2024 ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Also Read: National Award Winners of TFI: టాలీవుడ్ నేషనల్ అవార్డ్ విన్నర్స్​కు 'మైత్రీ' గ్రాండ్ పార్టీ!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget