అది శృంగారం కాదంటూ మెహ్రీన్ ఆవేదన, కష్టాల్లో పావలా శ్యామలా, నవ్విస్తోన్న కీడాకోలా - ఈ రోజు సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
ఆత్మహత్యే శరణ్యం, తిండిలేక మూడు రోజులుగా పస్తులు - కష్టాల్లో నటి పావలా శ్యామల
పావలా శ్యామల. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఎన్నో సినిమాల్లో తన చక్కటి నటనతో అలరించింది. విలక్షణమైన హాస్య నటనతో అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఆమెను చూడగానే అందరి ముఖాలపై నవ్వులు విరబూస్తాయి. తెలుగు కళామతల్లి బిడ్డగా వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అందరినీ ఆనందంలో ముంచిన పావలా శ్యామల బతుకు మాత్రం దయనీయంగా మారిపోయింది. ఓవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. అత్యంత దయనీయ జీవితం గడుపుతోంది. నిస్సహయ స్థితిలో ఉన్న ఈ సీనియర్ నటి ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది. తనతో పాటు తన కూతురు కూడా అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో పావలా శ్యామల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయింది. గతంలో ఆమెకు కొంత మంది నుంచి ఆర్థిక సాయం అందినా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రేసు నుంచి శుభశ్రీ, దామిని ఔట్, రతిక రి-ఎంట్రీకి సర్వం సిద్ధం? ‘తక్కువ ఓట్లు’ వెనుక పెద్ద ప్లానే ఉంది!
బిగ్ బాస్ సీజన్-7 రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత సీజన్ ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ఈసారి సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అంటూ సరికొత్త టాస్కులు, ట్విస్టులు, సర్ప్రైజ్ లతో షో ను రక్తి కట్టిస్తున్నారు. దానికి తోడు నాగార్జున హోస్టింగ్ లో చాలా మార్పులు కనిపించాయి. దాంతో ఈ సీజన్ కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటూ బిగ్ బాస్ రీసెంట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఏకంగా ఐదు మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. ఇక ఇప్పుడు మరో కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపించబోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్లీంకారతో తొలిసారి విదేశాలకు బయల్దేరిన చెర్రీ దంపతులు, ఫోటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ వీలైనంత ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతారు. సమయం దొరికితే చాలు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. తాజాగా రామ్ చరణ్ మరోసారి ఫారిన్ వెకేషన్ కు వెళ్లారు. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఉన్పప్పటికీ ఆయన ఇటలీకి వెళ్లారు. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి హాలీడేకు వెళ్లారు. కూతురుతో కలిసి తొలిసారి విదేశాలకు వెళ్లడం విశేషం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఫన్ అండ్ థ్రిల్లింగ్, ఆకట్టుకుంటున్న ‘కీడా కోలా’ ట్రైలర్!
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన తెరకెక్కించిన 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమాలు ఏ రేంజిలో సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'కీడా కోలా'. వివేక్ సుధాన్షు, శ్రీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతన్య రావు, రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ చిత్రంలో, తరుణ్ భాస్కర్ కీలక పాత్రను పోషించాడు. క్రైమ్, కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్యపాత్రను చేస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, రానా సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
అది శృంగారం కాదు, అత్యాచారం- ట్రోలర్స్ కు చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పిన మెహ్రీన్
గత కొంతకాలంగా హీరోయిన్లు ఓటీటీ బాట పట్టారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు సైతం డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టారు. తాజాగా ఈ కోవలోకి చేరింది హనీ బ్యూటీ మెహ్రీన్. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ', 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'రాజా ది గ్రేట్', 'మహానుభావుడు' లాంటి చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. తాజాగా మెహ్రీన్ 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో పలు శృంగార సన్నివేశాల్లోనూ నటించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)