అన్వేషించండి

రేసు నుంచి శుభశ్రీ, దామిని ఔట్, రతిక రి-ఎంట్రీకి సర్వం సిద్ధం? ‘తక్కువ ఓట్లు’ వెనుక పెద్ద ప్లానే ఉంది!

బిగ్ బాస్ సెవెన్ లో ఎలిమినేట్ అయిన దామిని, రతికా, శుభశ్రీ లలో ఒక కంటెస్టెంట్ రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం రతికా రోజ్ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ సీజన్-7 రసవత్తరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత సీజన్ ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో ఈసారి సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అంటూ సరికొత్త టాస్కులు, ట్విస్టులు, సర్ప్రైజ్ లతో షో ను రక్తి కట్టిస్తున్నారు. దానికి తోడు నాగార్జున హోస్టింగ్ లో చాలా మార్పులు కనిపించాయి. దాంతో ఈ సీజన్ కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటూ బిగ్ బాస్ రీసెంట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఏకంగా ఐదు మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించారు. ఇక ఇప్పుడు మరో కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపించబోతున్నారు.

గత వీకెండ్ ఎపిసోడ్లో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన దానిని, రతిక, శుభశ్రీ లను మళ్లీ పిలిపించి వీళ్ళ ముగ్గురిలో ఒకరిని హౌస్ లోకి పంపించబోతున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం దామిని, రతికా, శుభశ్రీ లలో ఓ కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఆట ఒక్కటే కాదు. ఇక్కడ వాళ్ళ ప్రవర్తనను బట్టి కూడా ప్రేక్షకులు ఆయా కంటెస్టెంట్లకు ఓట్లు వేస్తుంటారు. అలా తక్కువ ఓట్లు వచ్చినవారు షో నుంచి ఎలిమినేట్ అవుతుంటారు. ఈ సీజన్లో ఇప్పటివరకు వరుసగా ఆరుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.

కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా, శుభశ్రీ, నైని పావని వరుసగా ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వీళ్ళలో మూడు, నాలుగు, ఐదు వారల్లో ఎలిమినేట్ అయిన దామిని, రతిక, శుభశ్రీలలో ఒకరిని హౌస్ లోకి పంపించేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేశారు. ఈ మేరకు గతవారం ఎపిసోడ్లో ఓటింగ్ కూడా పెట్టాడు. కానీ అక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో ఆ కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే మొదట శుభశ్రీ హౌస్ లోకి వెళుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఎవరూ ఊహించను విధంగా చివరి క్షణంలో రతికా రోజ్ హౌస్ లో అడుగుపెడుతోంది. బిగ్ బాస్ ఈ నిర్ణయం వెనుక పెద్ద ప్లానే ఉంది. ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్‌‌ను లోనికి పంపితే.. ఆమె హౌస్‌మేట్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటుంది. అదే హౌస్ మేట్స్ నుంచి తక్కువ ఓట్లు పొందిన కంటెస్టెంట్‌ను పంపిస్తే.. అంటీముట్టన్నట్లు ఉంటూ.. తన గేమ్ తాను ఆడుతుందనేది బిగ్ బాస్ ప్లాన్.

వైల్డ్ కార్డు ద్వారా రతికా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ వారంలోనే రతికను హౌస్ లోకి పంపించనున్నారట బిగ్ బాస్. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ షాక్ ఇచ్చేలా రతిక రీఎంట్రీ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి కొందరు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మరికొందరు మాత్రం నిరాశ చెందుతున్నారు. దానికి కారణం బిగ్ బాస్ హౌస్ లో రతిక చేసిన పొరపాట్లే. మొదటి రెండు వారాలు హౌస్ లో అందరితో కలివిడిగా ఉన్న రతికా ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, శివాజీ లను టార్గెట్ చేసింది.

ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ - రతికల మధ్య వివాదం ఏ రేంజ్ లో హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. అక్కడి నుంచి రతికపై జనాల్లో పూర్తిగా నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. చాలామంది సోషల్ మీడియాలో రతికా ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా? అని కామెంట్స్ కూడా చేశారు. అలాంటి రతిక మరోసారి బిగ్ బాస్ హౌస్ కి రీ ఎంట్రీ ఇవ్వడం సర్వత్ర ఆసక్తికరంగా మారింది. మరి ఈ రీ ఎంట్రీ లోనైనా తన తప్పులను సరిదిద్దుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.

Also Read : ఫన్ అండ్ థ్రిల్లింగ్, ఆకట్టుకుంటున్న ‘కీడా కోలా’ ట్రైలర్‌!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Embed widget