అన్వేషించండి

Keedaa Cola Trailer: ఫన్ అండ్ థ్రిల్లింగ్, ఆకట్టుకుంటున్న ‘కీడా కోలా’ ట్రైలర్‌!

తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. సుమారు 3 నిమిషాలున్న ఈ ట్రైలర్ ఫుల్ ఫన్ తో అందరినీ అలరిస్తోంది.

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆయన తెరకెక్కించిన 'పెళ్లిచూపులు', 'ఈ నగరానికి ఏమైంది'  అనే సినిమాలు ఏ రేంజిలో సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'కీడా కోలా'.  వివేక్ సుధాన్షు, శ్రీకృష్ణ నిర్మించిన ఈ సినిమా  నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతన్య రావు,  రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ చిత్రంలో, తరుణ్ భాస్కర్ కీలక పాత్రను పోషించాడు. క్రైమ్, కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్యపాత్రను చేస్తున్నారు.  వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, రానా సమర్పిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఆకట్టుకుంటున్న ‘కీడా కోలా’ ట్రైలర్‌

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్‌ ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే, టీజర్ లో సినిమా స్టోరీ మాత్రం రివీల్ చేయలేదు. ‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత సుమారు 5 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న ఈ సినిమా, అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఓ బొద్దింకను, కోలా క్యాప్‌ను చూపించి కీడా కోలా అంటూ  అలరించే టైటిల్ పెట్టి అందరినీ తెగ ఆకట్టుకున్నాడు తరుణ్ భాస్కర్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ ట్రైలర్ అంతా ఫుల్ ఫన్నీ అండ్ థ్రిల్లర్ గా రూపొందింది.

బొమ్మ చుట్టూ తిరుగుతున్న ‘కీడా కోలా’ కథ

ఓవైపు టురెట్ సిండ్రోమ్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడే ఓ వ్యక్తి కోట్లు విలువ చేసే బొమ్మను నాశనం చేస్తాడు. ఈ అంశం కోర్టు మెట్లు ఎక్కుతుంది. కోర్టులో ఈ కేసుపై వాదన జరుగుతుంది. మరోవైపు తనవల్లే రాజన్న కార్పోరేటర్ అయ్యాడని భావించే జీవన్‌ పొగరు దింపడానికి కార్పోరేటర్‌ ఓ వింత ఫ్లెక్సీ పెట్టిస్తాడు. అది చూసి కోపంతో ఊగిపోయిన  జీవన్‌,  నాయుడు అలీయాస్‌ తరుణ్‌ భాస్కర్‌తో కలిసి రాజన్నను చంపి చేసి కార్పోరేటర్ కావాలని ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో మరో గ్యాంగ్‌ కోట్ల రూపాయల విలువ చేసే బొమ్మను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగా ఈ బొమ్మ చుట్టూ తిరిగే ఫన్నీ కథను ఈ ట్రైలర్ లో చూపించారు.

కోలాలో పడిన బొద్దింక కథేంటి?   

ఈ ట్రైలర్ లోనూ సినిమాపై ఓ క్లారిటీ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు  తరుణ్ భాస్కర్. అసలు ఆ బొమ్మ వెనుకున్న కథ ఏంటి? ఆ బొమ్మలో ఏం ఉంది? ఆ బొమ్మ కోసం ఎందుకు కొట్లాడుతున్నారు? అనే ప్రశ్నలకు సినిమాలోనే సమాధానం చెప్పనున్నారు. కోలాలో పడిన బొద్దికం కథ ఏంటి అనే విషయాన్ని కూడా మూవీ చూస్తేనే తెలిసే అవకాశం ఉంది. ఇక వీటన్నిపై క్లారిటీ రావాలంటే మరో రెండు వారాలు వేచి చూడక తప్పదు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్ అందుకుంటుందని తరుణ్ భాస్కర్ భావిస్తున్నారు.

Read Also: సెకెండ్ మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే?- అసలు విషయం చెప్పిన రేణు దేశాయ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Save The Tigers Series season 3 : సేవ్ ది టైగర్స్ సిరీస్ సీజన్ 3 రెడీ - ఈసారి స్పెషల్ సర్ప్రైజ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సేవ్ ది టైగర్స్ సిరీస్ సీజన్ 3 రెడీ - ఈసారి స్పెషల్ సర్ప్రైజ్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ram Charan: పేర్లతో రామ్ చరణ్ కన్‌ఫ్యూజన్... ఫుల్ ట్రోల్స్‌, చివరకు బుమ్రాకు సారీ చెప్పిన మెగా పవర్ స్టార్
పేర్లతో రామ్ చరణ్ కన్‌ఫ్యూజన్... ఫుల్ ట్రోల్స్‌, చివరకు బుమ్రాకు సారీ చెప్పిన మెగా పవర్ స్టార్
Peddi: 'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
'రంగస్థలం'తో రాలేదు... 'పెద్ది'కి నేషనల్ అవార్డు పక్కా... బీజేపీ ఎంపీ హింట్?
Peddi Hallallallo Song : పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు
పెద్ది హల్లల్లల్లో... ఫుల్ సాంగ్ - ఇద్దరు బ్యూటీస్‌తో చరణ్ స్టెప్పులు

వీడియోలు

CSK vs GT IPL 2026 Highlights | గుజరాత్ చేతిలో చెన్నై ఘోర పరాజయం
Ruturaj Comments on Dhoni Retirement | ధోని రిటైర్మెంట్‌పై రుతురాజ్ కామెంట్స్
Ram Charan at Uppal Stadium IPL 2026 | ఐపీఎల్ మ్యాచ్‌లో పెద్ది టీమ్ ప్రమోషన్స్
Hardik Pandya Match Fee Fined IPL 2026 | గ్రౌండ్ లో సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా
Sai Sudharsan Creates History in IPL 2026 | సాయి సుదర్శన్ హిస్టారికల్ రికార్డ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sachin About Arjun Tendulkar: చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
చివరి మ్యాచులో ఛాన్స్.. అర్జున్ టెండూల్కర్‌ డెడికేషన్‌పై సచిన్ ప్రశంసలు, పుత్రోత్సాహం
White House Gun Fire: వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. సీక్రెట్ సర్వీస్ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతం, ట్రంప్ సేఫ్
IPL 2026 Playoff Race: రేసు రసవత్తరం...Playoff మహత్తరం
రేసు రసవత్తరం... Playoff మహత్తరం
Ram Charan : పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
పెద్ది నా కెరీర్‌లోనే నెం.1 మూవీ - హార్ట్ టచింగ్ ఎమోషనల్ స్టోరీ... స్పెషల్ సాంగ్ ఈవెంట్‌లో రామ్ చరణ్
Telangana Cabinet Decisions: పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
పేదవారికి గుడ్‌న్యూస్.. 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Prakash Raj: ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు నటుడు ప్రకాష్ రాజ్ మద్దతు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై తీవ్ర విమర్శలు
Telangana Heatwave: వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
వ‌డ‌గాల్పుల‌తో 16 మంది మృతి.. రూ.4 ల‌క్షల ఆర్ధిక సాయం.. 3 రోజులు మరింత తీవ్రంగా హీట్ వేవ్
Talliki Vandanam Eligibility Status: ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనా.. ఇలా చెక్ చేసుకోండి
ప్రతి విద్యార్థికి రూ.15 వేలు.. తల్లికి వందనం స్కీమ్ కు మీరు అర్హులేనా.. ఇలా చెక్ చేసుకోండి
Embed widget