అన్వేషించండి

Renu Desai: సెకెండ్ మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే?- అసలు విషయం చెప్పిన రేణు దేశాయ్

Renu Desai: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. పిల్లల కోసం సెకెండ్ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నా, పెళ్లి ఆలోచన మాత్రం అలాగే ఉందని వెల్లడించింది.

Pawan Kalyan - Renu Desai: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ తో విడాకులు తర్వాత పిల్లలనే ప్రాణంగా భావిస్తూ బతికేస్తోంది. కొడుకు అకీరా నందన్, కూతురు ఆధ్యను అపురూపంగా పెంచుకుంటూ కాలం గడిపేస్తోంది. గత కొద్ది నెలల క్రితం ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంది. నిశ్చితార్థం కూడా జరుపుకుంది. కానీ, చివరి నిమిషంలో ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకు ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందో తాజాగా రేణు దేశాయ్ వెల్లడించింది.  

రెండో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే?- రేణు

ప్రస్తుతం రేణు దేశాయ్, మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజా ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి చాలా విషయాలను వెల్లడించింది. “ పవన్ కల్యాణ్ తో విడిపోయే సమయంలో అకీరా, ఆధ్య చాలా చిన్న పిల్లలు. ఆ సమయంలో ఇద్దరిని ఎంతో ప్రేమగా పెంచుకున్నాను. కుటుంబ సభ్యులు, మిత్రులు తనను మళ్లీ పెళ్లి చేసుకోవాలని చెప్పారు. కానీ, మొదట్లో తనకు పెళ్లి చేసుకోవాలి అనిపించలేదు. కొంత కాలం తర్వాత తనకూ ఓ తోడు ఉంటే మంచిది అనిపించింది. వారి మాట ప్రకారం, రెండో పెళ్లికి ఓకే చెప్పాను. నిశ్చితార్థం కూడా జరిగింది. అప్పుడు పాప వయసు 7 సంవత్సరాలు. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే పాపకు సరిగా సమయం కేటాయిస్తానో? లేదో? అనే అనుమానం కలిగింది. అందుకే, రెండో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాను” అని రేణు దేశాయ్ తెలిపింది.

పిల్లల ఆలోచనలు చూస్తుంటే ముచ్చటేస్తుంది- రేణు

తన ఇద్దరు పిల్లలు ఎంతో చక్కటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారని చెప్పింది రేణు దేశాయ్. వారి ఆలోచన విధానం చూసి ఒక్కోసారి ముచ్చటేస్తుందని వెల్లడించింది. ఇంత చిన్నవయసులో పెద్ద ఆలోచనలు చేయడం గర్వంగా ఉంటుందని రేణు దేశాయ్ వివరించింది. “ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే, తనతో సుఖసంతోషాలతో ఉంటావు అనిపిస్తే పెళ్లి చేసుకోమని బాబు అకీరా తనకు తరచుగా చెప్తుంటాడు. మరో రెండు మూడు ఏండ్లలో పిల్లలు సెటిల్ అవుతారు. అప్పుడు పెళ్లి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను” అని రేణు దేశాయ్ వెల్లడించింది.

హేమలత లవణంగా రేణు దేశాయ్

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది.  ఈ మూవీలో రేణు దేశాయ్  హేమలత లవణం అనే స్ఫూర్తిదాయకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ పసిబిడ్డని పట్టుకున్నట్లు ఈ పోస్టర్ లో తను కనిపించింది. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

Read Also: అది శృంగారం కాదు, అత్యాచారం- ట్రోలర్స్ కు చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పిన మెహ్రీన్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Indraja: స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
స్టేజిపై నిర్మాత ఎమోషనల్... నిర్మాతను కంటతడి పెట్టించిన ఇంద్రజ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా ప్రయత్నం అంబికను పట్టిస్తుందా! క్రిష్ పోలికలు కరెక్ట్‌గా చెప్పగలడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా ప్రయత్నం అంబికను పట్టిస్తుందా! క్రిష్ పోలికలు కరెక్ట్‌గా చెప్పగలడా!
Fauzi Vs Spirit: 'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
'ఫౌజీ' కంటే ముందు స్పిరిట్... ప్లాన్ సెట్ చేసిన ప్రభాస్!
Mandaadi Collections: 'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు
'మందాడి' @ 150 కోట్లు... బాక్సాఫీస్‌లో సుహాస్, సూరి సినిమా రికార్డు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget