Ram Charan: క్లీంకారతో తొలిసారి విదేశాలకు బయల్దేరిన చెర్రీ దంపతులు, ఫోటోలు వైరల్
రాం చరణ్ దంపతులు కూతురు క్లీన్ కారతో కలిసి తొలిసారి ఫారిన్ వెకేషన్ కు వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మీడియాకు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ వీలైనంత ఎక్కువగా ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతారు. సమయం దొరికితే చాలు కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. తాజాగా రామ్ చరణ్ మరోసారి ఫారిన్ వెకేషన్ కు వెళ్లారు. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఉన్పప్పటికీ ఆయన ఇటలీకి వెళ్లారు. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి హాలీడేకు వెళ్లారు. కూతురుతో కలిసి తొలిసారి విదేశాలకు వెళ్లడం విశేషం.
వైరల్ అవుతున్న చెర్రీ దంపతుల ఫోటోలు
ఇక ఫారిన్ వెకేషన్ కు వెళ్తూ, హైదరాబాద్ విమానాశ్రయంలో చెర్రీ దంపతులు మీడియాకు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ చేతిలో వారి పెట్ డాగ్ రైమ్ కనిపించింది. అటు ఉపాసన ఒడిలో క్లీంకార ఉంది. చరణ్, ఉపాసన ఇద్దరూ క్యాజువల్ లుక్ లో కనిపించారు. అయితే, తన పాప క్లీంకార ముఖం ఫోటోలకు కనిపించకుండా ఉపాసన చేతిని అడ్డుగా పెట్టింది.
‘గేమ్ ఛేంజర్’ మూవీతో ఫుల్ బిజీ
ఇక ‘RRR’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. అయితే, పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే, విజయ దశమి కానుకగా మెగా అభిమానుల కోసం ఈ సినిమా యూనిట్ ఓ గిఫ్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. 'గేమ్ ఛేంజర్'లో తొలి పాటను దసరాకు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు ఆ విషయాన్ని టీమ్ అనౌన్స్ చేయలేదు. విజయ దశమికి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ఆల్రెడీ సాంగ్ వర్క్ ఫినిష్ చేశారని తెలిసింది.
‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు
మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. మరో నాయికగా తెలుగమ్మాయి అంజలి కనిపించబోతోంది. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో చరణ్ భార్యగా కనిపించనుంది. శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా, సునీల్, 'వెన్నెల' కిషోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ‘RRR’ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్.. హాలీవుడ్ డైరెక్టర్లు స్పిల్ బర్గ్, జేమ్స్ కామరాన్ లాంటిస్టార్స్ ప్రశంసలు పోందారు. ‘RRR’ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈసినిమా చరణ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.
Read Also: అది శృంగారం కాదు, అత్యాచారం- ట్రోలర్స్ కు చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పిన మెహ్రీన్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial