అన్వేషించండి

Tollywood Heroes Upcoming Movies : తీరిక లేకుండా గడుపుతున్న టాలీవుడ్ స్టార్స్ - ఈ సినిమాలు పూర్తయ్యే వరకు విశ్రాంతి కష్టమే!

Tollywood stars: టాలీవుడ్ స్టార్ హీరోలంతా బిజీ బిజీగా ఉన్నారు. ఓవైపు సినిమాలను విడుదల చేస్తూనే, మరోవైపు కొత్త ప్రాజెక్ట్స్ ను సెట్స్ మీదకు తీసుకెళ్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. 

Tollywood Star Heroes: టాలీవుడ్ స్టార్స్ అందరూ ప్రస్తుతం వరుస సినిమాలతో ఏడాది పొడవునా బిజీగా ఉంటున్నారు. ఒక మూవీ సెట్స్ మీద వుండగానే, మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. గతేడాది బిగ్ స్క్రీన్ మీద కనిపించని హీరోలంతా, ఈ ఏడాదిలో ఒక్కరొక్కరుగా అలరించేందుకు రెడీ అయ్యారు. 2024 ప్రథమార్థంలో మాత్రం మహేశ్ బాబు ఒక్కరే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెకండాఫ్ లో ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్నారు. అలానే తమ కొత్త సినిమాల షూటింగులతో బిజీ బిజీగా గడిపేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 
 
⦿ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే 'కల్కి 2898 AD' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ మూవీ జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో 'రాజా సాబ్' సినిమాలో నటిస్తున్న డార్లింగ్.. ఈ నెలలోనే ప్రశాంత్ నీల్ తో 'సలార్ 2' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ప్రభాస్ మాత్రం జూలైలో టీమ్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబ‌ర్ లేదా న‌వంబ‌ర్ నాటికి చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేయాల‌ని నీల్ ప్లాన్ చేస్తున్నారని టాక్. 

⦿ 'గుంటూరు కారం' విడుదలైనప్పటి నుంచీ దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి సినిమా కోసమే సన్నద్ధం అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన జక్కన్న టీమ్.. శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభం అవుతుందని నిర్మాత కేఎల్ నారాయణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

⦿ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్నారు. మొదటి భాగాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చెయ్యాలని భావిస్తున్నారు. అయితే మధ్య మధ్యలో తన బాలీవుడ్ డెబ్యూ 'వార్ 2' మూవీ షూటింగ్ లో పాల్గొనున్నారు. హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ స్పై థ్రిల్లర్ కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 'దేవర 1' రిలీజైన వెంటనే అక్టోబర్ లేదా నవంబర్ లో ప్రశాంత్ నీల్ సినిమాని పట్టాలెక్కించాలని అనుకుంటున్నారట. అందుకే ఆలోపు 'సలార్ 2' పూర్తి చెయ్యాల్సి నీల్ భావిస్తున్నారట.

⦿ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే బుచ్చిబాబుతో 'RC 16' సినిమా మొదలుపెట్టనున్నారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్' చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఆగస్టు 15న రిలీజ్ చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దీని తర్వాత సుక్కూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'RC 17' కోసం చెర్రీతో చేతులు కలపబోతున్నారు. 

⦿ నటసింహ నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయిన వెంటనే, బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న 'NBK 109' సినిమా సెట్స్ లో తిరిగి అడుగుపెట్టనున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఎలక్షన్స్ తర్వాత తన సినిమా పనులను ప్రారంభించనున్నారు. సుజీత్ తో చేస్తున్న OG చిత్రాన్ని సెప్టెంబర్ 27వ తేదీన.. క్రిష్ & జ్యోతికృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాని ఈ ఏడాదే విడుదల చేస్తారని మేకర్స్ ప్రకటించారు. ఇది జరగాలంటే పవన్ కచ్చితంగా కాల్షీట్స్ ఇవ్వాల్సిన అవసరముంది. 

⦿ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తమిళ హీరో ధనుష్ తో 'కుబేర' అనే మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు. అలానే రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కనున్న 'కూలీ' సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇదే క్రమంలో త్వరలోనే తన కొత్త చిత్రాన్ని ప్రకటించి, ఆగస్టులో తన బర్త్ డే నాటికి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వదులుతారని టాక్ నడుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి టార్గెట్ గా 'విశ్వంభర' సినిమాతో బిజీగా గడపనున్నారు. అదే సీజన్ ను లక్ష్యంగా పెట్టుకున్న విక్టరీ వెంకటేష్.. సైలెంట్ గా అనిల్ రావిపూడి సినిమా పనులు కానిచ్చేస్తున్నారు.

Also Read: లిల్లీ కెరీర్‌ను గాడిలో పెట్టిన టిల్లు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Embed widget