Teja Sajja : 'హనుమాన్' కోసం 75 సినిమాలను వదులుకున్నా - సంచలన విషయాలు వెల్లడించిన తేజా సజ్జా
Teja Sajja : 'హనుమన్' సినిమా కోసం ఏకంగా 70 నుంచి 75 సినిమాలను వదులుకున్నట్లు హీరో తేజ సజ్జా తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Teja Sajja Latest Interview : తేజ సజ్జా హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' ఈ సంక్రాంతికి జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా స్వామి రంగ వంటి సినిమాలు విడుదలైనా వాటన్నిటిలో 'హనుమాన్' యునానిమస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సౌత్, నార్త్, ఓవర్సీస్.. అనే తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్ల రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది.
సినిమా విడుదలై సుమారు 23 రోజులు అవుతున్నా ఇంకా బాక్సాఫీస్ దగ్గర హనుమాన్ ర్యాంపేజ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.290 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఎన్నో రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ వర్మకి.. హీరోగా తేజా సజ్జాకి.. దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ వచ్చింది. హనుమాన్ సక్సెస్ తో తేజా టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ప్రస్తుతం ఈ హీరోకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తేజ సజ్జ తాజా ఇంటర్వ్యూలో 'హనుమాన్' సినిమా కోసం తను చేసిన త్యాగాలను బయటపెట్టాడు.
'హనుమాన్' కోసం 70 నుంచి 75 సినిమాలు వదులుకున్నా..
'హనుమాన్' సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డ తేజ సజ్జా ఆ సమయంలో ఏకంగా 70 నుంచి 75 సినిమాలను వదులుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. "హనుమాన్ కోసం నేను సుమారు 25 లుక్ టెస్టులు ఇచ్చాను. సాధారణంగా ఓ సినిమా కోసం ఏ నటుడైనా రెండు, మూడు టెస్టులు మాత్రమే ఇస్తారు. ఈ మూవీలో స్టంట్స్ అన్నీ నేనే చేశాను. బాడీ డబుల్ లేదా వీఎఫ్ఎక్స్ ఉపయోగించలేదు. స్కూబా డైవింగ్ నేర్చుకొని మరీ నీటి లోపల సీక్వెన్స్ షూట్ చేశాను. హనుమాన్ మూవీ బాక్సాఫీస్ నంబర్లను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ సినిమా ఆడియెన్స్ కు నచ్చిందా లేదా అన్నదే చూశాను" అంటూ చెప్పుకొచ్చాడు. హనుమాన్ ఓవర్సీస్ లో భారీ సక్సెస్ అందుకోవడంతో ప్రస్తుతం తేజ సజ్జాతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఫిమేల్ లీడ్ అమృతా అయ్యర్ అమెరికాలో ఈ మూవీ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.
ఓవర్సీస్ లో 5 మిలియన్ల మార్క్ అందుకున్న 'హనుమాన్'
హనుమాన్ సినిమాకి ఓవర్సీస్ ఆడియన్స్ రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అక్కడ ఈ సినిమా మిలియన్ల కొద్ది డాలర్స్ ని కొల్లగొడుతుంది. ఓవర్సీస్ మార్కెట్ వద్ద స్టార్ హీరోల రికార్డ్స్ అన్నిటినీ పటాపంచలు చేసింది. 'హనుమాన్' ఓవర్సీస్ మార్కెట్ వద్ద ఏకంగా 5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.
ఎలాంటి స్టార్ కాస్ట్ లేని ఓ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా ఓవర్సీస్ లో 5 మిలియన్ డాలర్స్ మార్క్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. దీన్నిబట్టి అక్కడ హనుమాన్ ర్యాంపేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది. ఇక ఈ ఫీట్ తోహనుమాన్ ఓవర్సీస్ లో ఆల్ టైం టాప్ 5 హైయెస్ట్ గ్రాఫర్స్ లో ఒకటిగా నిలిచింది.
'హనుమాన్' ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే
'హనుమాన్' ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5 హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ కి నెల రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుతం థియేటర్స్ వద్ద హనుమాన్ దూకుడు ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ పూర్తయిన 55 రోజుల తర్వాతే హనుమాన్ ని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారట. ఇందుకు ZEE5 సంస్థ కూడా ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. దాని ప్రకారం మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావచ్చని అంటున్నారు.
Also Read : 'విశ్వంభర'లో హీరోయిన్‌గా త్రిష - సెట్స్‌లోకి ఆహ్వానించిన మూవీ టీం