Taapsee Pannu: మాథియాస్‌తో ఫస్ట్‌డేట్ - దుబాయ్‌లో అమ్మేస్తాడేమో అని భయపెట్టారు, తాప్సీ కామెంట్స్
Taapsee Pannu: హీరోయిన్ తాప్సీ పన్ను తన భర్త మాథియాస్ బోపై గురించి ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. మాథియాస్ బోతో ఫస్ట్ డేట్‌కి వెళ్లినప్పుడు రకరకాలు అపోహాలతో తన స్నేహితులు తనని భయపెట్టారని చెప్పింది.
![Taapsee Pannu: మాథియాస్‌తో ఫస్ట్‌డేట్ - దుబాయ్‌లో అమ్మేస్తాడేమో అని భయపెట్టారు, తాప్సీ కామెంట్స్ taapsee pannu said friends warned her before first date with Mathias Boe Taapsee Pannu: మాథియాస్‌తో ఫస్ట్‌డేట్ - దుబాయ్‌లో అమ్మేస్తాడేమో అని భయపెట్టారు, తాప్సీ కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/09/7b1cabf7cd7110c81ac0352a791fa5621723217964078929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Taapsee Pannu Open up Her First Date with mathias Boe: ప్రస్తుతం తాప్సీ పన్ను తన భర్త, బ్యాడ్మింటన్ కోచ్ మాథియాస్ బో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె నటించని లేటెస్ట్ మూవీ 'ఫిర్ ఆయూ హసీన్ దిల్‌రూబా' ప్రమోషన్స్‌ల భాగంగా ఆమె వరుస ఇంటర్య్వూలో బిజీ అయిపోయింది. బోల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ఓటీటీలోకి వచ్చింది. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల తాప్సీ ఓ ఛానల్‌కు ఇంటర్య్వూలో ఇచ్చింది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైప్, వైవాహక జీవితం గురించిన ఆసక్తిర విషయాలు బయటపట్టింది. తన భర్త మాథియాస్ బో తనకి ప్రపోజ్ చేసినప్పుడు తనలో చాలా సందేహాలు వచ్చాయని, అంత తెల్లగా ఉన్న అతను నన్నేందుకు ఇష్టపడ్డాడనే రకరకాల అపోహాలు వచ్చాయంది.
11 ఏళ్ల క్రితం మొదటిసారి కలుసుకున్నాం
అయితే ఫస్ట్ మాథియాస్‌తో డేట్‌కి వెళ్లినప్పుడ నా స్నేహితులు చాలా కంగారుపడ్డారు. లేనిపోని మాటలు చెప్పి నన్ను భయాందోళనకు గురిచేశారంటూ చెప్పుకొచ్చింది. "పదకొండేళ్ల క్రితం నేను మాథియాస్ మొదటిసారి కలుసుకున్నాం. మా పరిచయమైన ఏడాది తర్వాత మేం ప్రేమలో పడ్డాం. ఈ ఏడాది పాటు స్నేహితులుగా ఒకరినినోకరం అర్థం చేసుకున్నాం. ఏడాది తర్వాత మా ప్రేమ వ్యక్తం చేసుకున్నాం. అప్పుడే రిలేషన్‌లోకి అడుగుపెట్టాం. దాదాపు తొమ్మిదేళ్లు ఇద్దరం కలిసే ఉన్నాం. ఒకరిని అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటాం. ఒకరి నిర్ణయాలను మరోకు గౌరవిస్తాం. అంతేకానీ మా ఆలోచనలను మార్చుకుంటూ ఎక్కడ రాజీ పడలేదు.
ఫస్ట్ డేట్ దుబాయ్ లో..
అలా పూర్తిగా ఒకరినోకరం అర్థం చేసుకుని, కలిసి ఉండగలమనే నమ్మకం వచ్చిన తర్వాతే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాం. మాథియాస్‌తో ఈ జీవితం నాకు నచ్చింది. ఇప్పుడు ఇద్దరం మా వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాం. అయితే మాథియాస్‌తో మొదట నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను నమ్మలేదు. అతడు డెన్మార్క్ చెందని వ్యక్తి.. నన్ను ప్రేమించడమేంటని అనుకున్నా. అతడు తెల్లగా ఉంటాడు.. నన్నేందుకు ఇష్టపడ్డాడు అనుకున్నా. కానీ కొన్ని రోజులకు తన ప్రేమ నాకు అర్థమైంది. అయితే ఒకరోజు మేం ఫస్ట్‌డేట్‌కి వెళ్లాలని అనుకున్నాం. అప్పుడు మాథియాస్ దుబాయ్ వెళ్దాం అన్నాడు. అప్పుడు నా ఫ్రెండ్స్ నాతో చెప్పిన మాటలు గుర్తోస్తే నాకు చాలా నవ్వోస్తుంది. కానీ అప్పుడు మాత్రం వారి మాటలకు నేను చాలా కంగారు పడ్డాను. మాథియాస్‌కు డెన్మార్క్, దుబాయ్ మాత్రమే బాగా తెలుసు.
దుబాయ్ షేక్ లకు అమ్మేస్తాడేమో..!
అందుకే తను మా ఫస్ట్‌డేట్‌కి దుబాయ్ వెళ్దాం అన్నాడు. ఇదే విషయం నా ఫ్రెండ్స్‌కి చెప్పాను. అప్పుడు వాళ్లు. నువ్వు చాలా జాగ్రత్త ఉండని హెచ్చరించారు. అతను నిన్ను అక్కడ దుబాయ్ షేక్‌లకు అమ్మేస్తడేమో అంటూ నన్ను భయపెట్టారు. అంతేకాదు నా స్నేహితురాలు ఒకరు దుబాయ్ ఉంటున్న వాళ్ల అక్క ఫోన్ నెంబర్ ఇచ్చింది. అవసరం అయితే తనకి ఫోన్ చేయమంటూ నాకు జాగ్రత్తలు చెప్పారు" అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల అవుతున్నాయి. కాగా ఈ ఏడాది మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కేవలం కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో తాప్సీ, మాథియాస్‌ల పెళ్లి వేడుక జరిగింది. ఎలాంటి సమాచారం లేకుండ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత కూడా సైలెంట్‌గా ఉంది. కనీసం పెళ్లి ఫోటోలు కూడా రివీల్ చేయలేదు.
Also Read: మీద పడకండి, ఫొటోగ్రాఫర్లపై తాప్సీ ఆగ్రహం - అంత డ్రామా అవసరమా? అంటోన్న నెటిజన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)