Taapsee Pannu: మీద పడకండి, ఫొటోగ్రాఫర్లపై తాప్సీ ఆగ్రహం - అంత డ్రామా అవసరమా? అంటోన్న నెటిజన్స్
Taapsee Pannu: బాలీవుడ్ హీరోయిన్ తాప్సీకి, అక్కడి ఫోటోగ్రాఫర్లకు మధ్య లెక్కపెట్టలేనన్ని గొడవలు జరిగాయి. తాజాగా మరోసారి ఫోటోగ్రాఫర్లతో తాప్సీకి చేదు అనుభవం ఎదురయ్యింది.
Taapsee Pannu: బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా ఫోటోగ్రాఫర్లు వారిని ఫాలో అవుతూనే ఉంటారు. హోటర్స్, ఎయిర్‌పోర్ట్స్, థియేటర్స్.. ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లారని తెలిసినా.. ఫోటోగ్రాఫర్లు అక్కడ వాలిపోతారు. అయితే ఫోటోగ్రాఫర్ల ప్రవర్తన అందరు సెలబ్రిటీలకు నచ్చదు. ముఖ్యంగా తాప్సీతో వారికి చాలాసార్లు గొడవ అయ్యింది. వారంతా హీరోహీరోయిన్లను ఆగమని చెప్పి మరీ ఫోటోలు తీసుకుంటారు. కానీ వారు అలా చేయడం తాప్సీకి నచ్చదు. ఈ విషయంపై పలుమార్లు ఫోటోగ్రాఫర్లపై సీరియస్ అయ్యింది తాప్సీ. కానీ తాజాగా మాత్రం సీరియస్ అవ్వకుండా భయపడుతూ వెళ్లిపోయింది.
భయపెట్టారు..
తాజాగా తాప్సీ.. ‘ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా’ సినిమాలో నటించింది. ఈ సినిమా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన కూడా కొందరు సెలబ్రిటీల కోసం ముంబాయ్‌లో స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ స్క్రీనింగ్‌కు తాప్సీ కూడా వెళ్లింది. సినిమా అయిపోయి థియేటర్ నుంచి బయటికి రాగానే తన ఫోటోల కోసం ఫోటోగ్రాఫర్లు ముందుకొచ్చారు. వారంతా తన దగ్గరకు వచ్చేయడంతో ‘‘నా మీద పడకండి’’ అంటూ భయపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయి ప్రయత్నం చేసింది తాప్సీ. ఇది గమనించిన ఇతర ఫోటోగ్రాఫర్లు తనకు సారీ చెప్పారు. దానికి తను కారు ఎక్కిన తర్వాత బై చెప్పి థాంక్యూ అంటూ వెళ్లిపోయింది.
View this post on Instagram
వారిని బుజ్జగించను..
ఇక ఫోటోగ్రాఫర్లతో మరోసారి తాప్సీకి చేదు అనుభవం అంటూ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా తాప్సీకి, ఈ ఫోటోగ్రాఫర్లకు మధ్య ఉన్న అనుబంధం అలాంటిది అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమె జయా బచ్చన్‌తో పోల్చుతున్నారు. డ్రామాలు ఆడుతోందని ట్రోల్ చేస్తున్నారు. అంత ఓవర్ యాక్షన్ అవసరమా అంటున్నారు. తాజాగా ఫోటోగ్రాఫర్ల గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది తాప్సీ. ‘‘ఇలాంటివి నాకు సినిమా అవకాశాలు ఏమీ తెచ్చిపెట్టడం లేదు. నా గురించి నా సినిమాలే మాట్లాడతాయి. అందుకే నేను మీడియాలోని ఒక సెక్షన్‌ను బుజ్జగించాల్సిన అవసరం లేదు. నేను వాళ్లను మీడియా అని కూడా అనను ఎందుకంటే వారికి క్లిక్స్ వస్తే చాలు’’ అంటూ వ్యాఖ్యలు చేసింది.
వరుసగా సినిమాలు..
ప్రస్తుతం తాప్సీ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో చాలా బిజీ అయిపోయింది. ఇటీవల సీక్రెట్‌గా సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత వెంటనే తన అప్‌కమింగ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తు విక్రాంత్ మాస్సేతో కలిసి నటించిన ‘ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘హసీన్ దిల్‌రుబా’ మూవీకి ఇది సీక్వెల్. ఇందులో విక్కీ కౌశల్ తమ్ముడు సన్నీ కౌశల్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. దీంతో పాటు తను నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ మూవీ ఆగస్ట్ 15న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.
Also Read: మందు తాగుతూ విమానాన్ని నడిపిన రణబీర్ కపూర్ - ‘యానిమల్’ డిలీటెడ్ సీన్ చూశారా?