Animal Deleted Scene: మందు తాగుతూ విమానాన్ని నడిపిన రణబీర్ కపూర్ - ‘యానిమల్’ డిలీటెడ్ సీన్ చూశారా?
Animal Movie: రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుండి ఒక డిలీటెడ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Animal Movie Deleted Scene: గతేడాది విడుదలయ్యి సోషల్ మీడియాలో, థియేటర్లలో ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో ‘యానిమల్’ ఒకటి. ఈ సినిమాను తన స్టైల్‌లో యూత్‌కు బాగా దగ్గరయ్యేలా తెరకెక్కించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఇందులోని పలు సీన్స్ వల్ల, డైలాగ్స్ వల్ల సందీప్ రెడ్డి వంగాపై నెగిటివిటీ, ట్రోల్స్ వచ్చాయి. అయినా అవేవి తను పట్టించుకోలేదు. ‘యానిమల్’పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా వాటన్నింటిని ఎదిరించి ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఇక మూవీ విడుదలయిన దాదాపు 8 నెలల తర్వాత ‘యానిమల్’ నుండి ఒక డిలీటెడ్ సీన్ బయటికొచ్చింది.
డిలీడెట్ సీన్..
రణబీర్ కపూర్, రష్మిక మందనా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ దాదాపు మూడున్నర గంటల నిడివితో విడుదలయ్యింది. ఈ నిడివిని తగ్గించమని దర్శకుడికి ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా తాను వినలేదు. అంతే కాకుండా పలు సీన్స్ డిలీట్ చేసిన తర్వాతే సినిమా మూడున్నర గంటల నిడివికి చేరుకుందని కూడా పలు ఇంటర్వ్యూల్లో బయటపెట్టాడు సందీప్ రెడ్డి వంగా. అందులోని ఒక డిలీటెడ్ సీన్ మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సీన్ బయటికి రావడంతో మరోసారి సోషల్ మీడియాలో ‘యానిమల్’ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. దీన్ని చూస్తుంటే ఇది క్లైమాక్స్‌లో వచ్చే సీన్ అని అర్థమవుతోంది.
ఒక్క డైలాగ్ లేకుండా..
‘యానిమల్’ డిలీటెడ్ సీన్‌లో రణబీర్ కపూర్.. తన గ్యాంగ్‌తో కలిసి విమానంలో వెళ్తుంటాడు. ఒంటి మీద గాయాలతో ఉంటాడు. అప్పటికే ఫుల్‌గా తాగేసి ఉన్నా కూడా తనకోసం మరొక డ్రింక్ పోసుకొని విమానంలోని కాక్‌పిట్‌లోకి వెళ్తాడు. అక్కడ ఉన్న పైలెట్‌ను లేపి తను కూర్చుంటాడు. చేతిలో మందు, నోట్లో సిగరెట్‌తో ప్లెయిన్ నడుపుతాడు రణబీర్ కపూర్. ఇక ఈ డిలీటెడ్ సీన్‌లో ఎలాంటి డైలాగ్స్ లేవు. సినిమాలోని ‘పాపా మేరీ జాన్’ పాట మాత్రమే బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఇలాంటి ఒక హైలెట్ సీన్‌ను అసలు సందీప్ రెడ్డి వంగా ఎందుకు డిలీట్ చేశాడా అని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు.
not gonna forgive @imvangasandeep anna for removing this scene in the movie, it's a pure display of Ranbir showing his silence and agony after k*lling his brother, especially that lifting off at the end 🙏#RanbirKapoor pic.twitter.com/XDl0TMjjgL
— 𝙑 ♪ (@RKs_Tilllast) August 7, 2024
తండ్రీకొడుకుల కథ..
2023 డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలయ్యింది ‘యానిమల్’. ఇందులో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ తండ్రీకొడుకులుగా నటించారు. తండ్రి మీద పిచ్చి ప్రేమ ఉన్న కొడుకు తనకోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు అనే పాయింట్‌పై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ కథను రాసుకున్నాడు. ఈ కథ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఎన్నో ఏళ్లుగా రణబీర్ కపూర్ యాక్టింగ్ గురించి బాలీవుడ్ ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ ‘యానిమల్’ వాటన్నికంటే భిన్నమని ప్రశంసలు కూడా అందుకున్నాడు ఈ హీరో.
Also Read: పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన దూత హీరోయిన్- పదేళ్లుగా రాజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వెల్లడి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

