బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన రణబీర్ కపూర్‌కు వ్యాపారాలు కూడా ఎన్నో ఉన్నాయి.

సావన్ అనే మ్యూజిక్ కంపెనీలో 2014 నుంచి షేర్ హోల్డర్‌గా ఉన్నాడు రణబీర్.

ఇండియన్ సూపర్ లీగ్ అనే ఫుట్‌బాల్ లీగ్‌లో కూడా రణబీర్‌కు 35 శాతం వాటా ఉంది.

పూణెకు చెందిన ‘డ్రోనేచార్య’ అనే డ్రోన్ స్టార్టప్ కంపెనీలో కూడా రణబీర్ కపూర్ పెట్టుబడులు పెట్టాడు.

హోమ్ ప్రొడక్ట్స్‌ను తయారు చేసే ‘బేకో’ అనే కంపెనీలో కూడా ఈ హీరోకు వాటాలు ఉన్నట్టు తెలుస్తోంది.

పుణెలో తనకు ఉన్న రెండు అపార్ట్‌మెంట్స్‌ను రెంట్‌కు ఇచ్చాడు రణబీర్.

‘పిక్చర్ షురు ప్రొడక్షన్స్’ పేరుతో దర్శకుడు అనురాగ్ బసుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.

ఒక్క బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి రణబీర్ రూ.6 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.

రణబీర్ ప్రతి సినిమాకు రూ.50 కోట్లు రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటాడట. (All Images Credit: Twitter)