అన్వేషించండి

Priya Bhavani Shankar: పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన దూత హీరోయిన్‌- ప‌దేళ్లుగా రాజ్‌తో రిలేష‌న్‌లో ఉన్నట్టు వెల్లడి

Priya Bhavani Shankar: నాగ చైత‌న్య స‌ర‌స‌న ధూత వెబ్ సిరీస్ లో న‌టించిన హీరోయిన్ ప్రియ భ‌వానీ శంక‌ర్. ఆమె త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె తెలియ‌జేశారు.

Priya Bhavani Shankar: 'ధూత' వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం అయిన ప్రియ భ‌వానీ శంక‌ర్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నార‌ట‌. ఈ విష‌యాన్నిస్వ‌యంగా ఆమె వెల్ల‌డించారు. 2025లో తాను పెళ్లి చేసుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప‌దేళ్లుగా త‌ను ప్రేమ‌లో ఉన్నాన‌ని, స‌రైన స‌మ‌యంలో పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నామ‌ని, వ‌చ్చే ఏడాది పెళ్లి చేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

ప‌దేళ్ల ప్రేమ‌.. 

త‌ను ప‌దేళ్ల నుంచి రాజ్ అనే వ్య‌క్తిని ప్రేమిస్తున్న‌ట్లు చెప్పారు ప్రియ‌. సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌క‌ముందే తాను రిలేష‌న్ లో ఉన్నాన‌ని అన్నారు. నిజానికి ఎంతోమందితో త‌న‌కు అఫైర్ ఉన్న‌ట్లు, ప్రేమ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రిగింద‌ని, కానీ అలాంటిది ఏమీ లేద‌ని ఈసంద‌ర్భంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. "నేను రాజ్ ప‌దేళ్లుగా రిలేష‌న్ లో ఉన్నాం. నేను అత‌ను విడిపోయామ‌ని చాలాసార్లు ప్ర‌చారం చేశారు. నేను ఎవ‌రినైనా విష్ చేస్తూ ఫొటో పెట్టినా చాలా వాళ్ల‌తో నాకు ప్రేమ అంట‌గ‌ట్టేస్తారు. అదృష్టం ఏంటంటే ఆ స్టార్ హీరో లంద‌రికీ పెళ్లి అయిపోయింది" అని న‌వ్వుతూ త‌న ప్రేమ గురించి చెప్పారు ప్రియ‌. రాజ్‌ తన జీవితంలోకి రావడం అదృష్టం అని, తను లేకపోతే ఇప్పటికీ ఒక మధ్య తరగతి కుటుంబ యువతిగా మిగిలిపోయేదానిని అని ఎమోష‌న‌ల్ అయ్యారు. రాజ్‌ అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్టేజ్‌కు తీసుకొచ్చిందని ప్రియా భవానీ శంకర్‌ చెప్పారు. 

వ‌రుస ఫ్లాపులు.. 

ఇక సినిమా కెరీర్ విష‌యానికొస్తే.. త‌మిళ‌నాడుకు చెందిన ప్రియ భ‌వాని 'మేయాద్ మాన్' సినిమాతో సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత 2023లో 'క‌ల్యాణం క‌మ‌నీయం' సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అయితే, అది అంత‌గా ఆడ‌లేదు. గోపీచంద్ తో కలిసి చేసిన 'భీమా' సినిమా కూడా హిట్ అవ్వ‌లేదు. ఆ త‌ర్వాత విశాల్ తో క‌లిసి న‌టించిన 'ర‌త్నం' సినిమాకి కూడా మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఇక ఆ త‌ర్వాత నాగ చైత‌న్యతో క‌లిసి 'ధూత' వెబ్ సిరీస్ లో న‌టించారు ప్రియ. ఆ సినిమాలో  నాగ‌చైత‌న్య భార్య పాత్ర‌లో న‌టించిన ఆమెకు మంచి పేరు వ‌చ్చింది. ఆమె న‌ట‌న‌కు ఫిదా అయ్యారు అంద‌రూ. ఇక ప్ర‌స్తుతం 'డెమోంటే కాల‌నీ - 2' సినిమాలో చేశారు. ఆగష్టు 15న ఆ సినిమా విడుద‌ల కానుంది. క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన 'భార‌తీయుడు - 2'లో ప్రియ న‌టించ‌గా.. అది కూడా అంత‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోని విష‌యం తెలిసిందే. 

ఐర‌న్ లెగ్ అంటూ ట్రోలింగ్.. 

ప్రియాపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ జ‌రుగుతుంది. ఆమె న‌టించిన సినిమాల‌న్నీ ఫ్లాప్ అవ్వ‌డం, ఇటీవ‌ల విడుద‌లైన 'భార‌తీయుడు - 2'కి కూడా మిశ్ర‌మ స్పంద‌న రావ‌డంతో ఆమెను ఐర‌న్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు చాలామంది. దానిపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప్రియ‌. 'భార‌తీయుడు - 2' సినిమా చేసినందుకు ఎంత ఆనందంగా ఉందో.. ఇప్పుడు ట్రోలింగ్ చూస్తుంటే అంత బాధ‌గా ఉంది అని అన్నారు ప్రియ‌.

Also Read: చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత వైరల్ అవుతున్న శోభితా ధూళిపాళ కండోమ్ యాడ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget