ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ఆవైటేడ్ చిత్రం 'పుష్ప-2 : ది రూల్' ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మూవీ టీం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ బర్త్‌డే సందర్భంగా ఆయన కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీం ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కాకీ డ్రెస్‌లో కనిపించాల్సిన ఆయన మాస్ లుక్‌లో కనిపించారు అచ్చం పుష్పలాగే లుంగి కట్టి, కోట్ వేసి తుపాకితో కనిపించాడు ఆయన కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ మూవీ టీం బర్త్‌డే విషెష్ తెలిపింది ప్రస్తుతం ఈ పోస్టర్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది ఇందులోని భన్వర్ సింగ్ లుక్ మూవీపై మరింత ఆసక్తి పెంచుతోంది కాగా పుష్ప సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు