శోభిత ధూళిపాళ.. నాగచైతన్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆగస్టు 8న వీళ్ల నిశ్చితార్థం కొద్దిమంది సమక్షంలో నిర్వహించారు. శోభిత ఎవరు? ఆమె ప్రొఫషన్ ఏంటి అని ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్లు. శోభిత మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. మరోవైపు మోడలింగ్ కూడా చేస్తున్నారు. శోభిత ఆస్తుల వివరాలు చూస్తే.. ఆమెకు దాదాపు రూ.10కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. శోభిత ఒక్కో ప్రాజెక్ట్ కి రూ.70లక్షల నుంచి కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తుంది. దీంతో శోభిత, చై ఆస్తులు కలిపితే దాదాపు రూ.160 కోట్లు ఉంటాయని అంచనా. ఆమె స్కిన్ కలర్ కారణంగా చాలా సినిమాల్లో తీసుకోవడానికి నిరాకరించారు. పట్టువదలకుండా తన నటనతో మెప్పించి అవమానాలను తట్టుకొని నిలబడి విజయవంతమైన నటిగా రాణిస్తున్నారు.