నాగచైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలో ఒక్కటవ్వనున్నారు. అలా టాలీవుడ్ లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం. అలనాటి నటులు కృష్ణ, విజయ నిర్మల 1969లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కృష్ణకి అప్పటికే ఇందిర దేవితో పెళ్లైంది. అమల, అక్కినేని నాగార్జున ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 1992, జూన్ 11న వారి వివాహం జరిగింది. 'ఆమె' సినిమా సమయంలో ఊహ, శ్రీకాంత్ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1997లో పెళ్లి చేసుకున్నారు. జీవిత రాజశేఖర్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. 1991 జులై 10న వీరి వివాహం జరిగింది. నమ్రత, మహేశ్ బాబు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 'వంశీ' సినిమా సమయంలో ప్రేమలో పడ్డ వీరు 2005లో పెళ్లి చేసుకున్నారు. వరుణ్ సందేశ్, వితిక ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2015లో వీరి వివాహం జరిగింది. మధుమిత, శివబాలాజీ కలిసి సినిమాలో నటించారు. ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు.