అన్వేషించండి

RETRO - Title Teaser : క్రిస్మస్ కానుకగా 'రెట్రో' టైటిల్ టీజర్... పూజా హెగ్డే ప్రేమ సూర్యను మారుస్తుందా?

RETRO - Title Teaser : క్రిస్మస్ కానుకగా సూర్య హీరోగా నటిస్తున్న 'రెట్రో' మూవీ టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అంచనాలు పెంచేస్తూ హైప్ ఇచ్చేసింది ఈ టీజర్.

Suriya 44 RETRO : కోలీవుడ్ సింగం సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రెట్రో'. సూర్య కెరియర్ లో 44వ సినిమాగా తెరక్కెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ని తాజాగా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్.

'రెట్రో' టైటిల్ టీజర్ 

సూర్య హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ 'రెట్రో'. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ ను ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసి, సూర్య ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇందులో సూర్య "నాది స్వచ్ఛమైన ప్రేమ, నన్ను పెళ్లి చేసుకుంటావా" అంటూ పూజ హెగ్డేతో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఇక మధ్యమధ్యలో వచ్చిన కొన్ని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, ప్రేక్షకులు సూర్యులో ఇష్టపడే యాంగర్ యాంగిల్ తో పాటు, గుడి మెట్లపై ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, చివరగా ముద్దు పెట్టి పూజా హెగ్డే సూర్యను పెళ్లి చేసుకుంటానని చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. 

ఈ సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇందులో జయరామ్, బోజూ జార్జ్, కరుణాకరన్, సుధీర్ శంకర్, కమీజ్, రామచంద్రన్ దురై రాజ్, ప్రేమ్ కుమార్, సందీప్ రాజ్, రమ్య సురేష్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. 'రెట్రో' సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి టైటిల్ టీజర్ లో వచ్చిన సూర్యరెట్రో లుక్ సినిమాపై ఇప్పుడే మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది.

'రెట్రో' మూవీలో పూజా హెగ్డే రోల్ కీలకం 

సూర్య రీసెంట్ గా 'కంగువ' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. దీంతో ఈ ఏడాది రిలీజ్ అయిన బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలలో ఈ మూవీ కూడా నిలిచిపోయింది.  ఇప్పుడు 'రెట్రో'తో ఆయన స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కథ కాస్త డీఫెరెంట్ గా ఉండేలా చూసుకున్నట్టు టైటిల్ టీజర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది. ఎప్పుడూ గొడవలు, తగువులతో తిరిగే హీరోకి, హీరోయిన్ పై ప్రేమ కలగడం, అదే ఆయనను మార్చేయడం వంటి లైన్ తో సినిమా తెరకెక్కుతోందని అర్థం అవుతోంది. ఇక ఇందులో పూజా హెగ్డే పాత్ర కీలకం అని అన్పిస్తోంది. కాగా 2025 సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్లు కూడా అప్పుడే మొదలుపెట్టారు. మరి ఈ మూవీతో సూర్య సాలిడ్ కం బ్యాక్ ఇస్తారా? అనేది చూడాలి.

Read Also : Nayanthara : క్రిస్మస్ వెకేషన్​లో నయనతార.. పారిస్​లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న హీరోయిన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Book A APSRTC Ticket In AP Whatsapp Governance: ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
AP WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
Bad luck Bhaskar: బ్యాంకు డైరక్టర్ - 77 కోట్లు కొట్టేసి అమెరికా జంప్ - 23 ఏళ్ల తర్వాత పట్టుకొచ్చిన సీబీఐ !
బ్యాంకు డైరక్టర్ - 77 కోట్లు కొట్టేసి అమెరికా జంప్ - 23 ఏళ్ల తర్వాత పట్టుకొచ్చిన సీబీఐ !
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan kalyan vs Peddireddy Ramachandra reddy | సీమలో పెద్దిరెడ్డిని పవన్ ఢీ కొడతారా.? | ABP DesamWashington Plane Helicoptor Crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం | ABP DesamISRO 100th Launch Journey | సైకిల్ మీద తిప్పలు, ఎడ్ల బండి మోతలు..అన్నీ దాటి ఈ రోజు సెంచరీ | ABP DesamMaha Kumbh 2025 Prayag Raj Drone Visuals

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Book A APSRTC Ticket In AP Whatsapp Governance: ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
ఏపీ ప్రభుత్వ వాట్సాప్‌ నెంబర్ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?
AP WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
Bad luck Bhaskar: బ్యాంకు డైరక్టర్ - 77 కోట్లు కొట్టేసి అమెరికా జంప్ - 23 ఏళ్ల తర్వాత పట్టుకొచ్చిన సీబీఐ !
బ్యాంకు డైరక్టర్ - 77 కోట్లు కొట్టేసి అమెరికా జంప్ - 23 ఏళ్ల తర్వాత పట్టుకొచ్చిన సీబీఐ !
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్
Washington Plane Helicoptor Crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం | ABP Desam
Washington Plane Helicoptor Crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం | ABP Desam
SSMB 29 TITLE: ఏంటీ NT NINE..?  మహేష్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ అదేనా..? ప్రియాంక చోప్రా ఫోటోలతో రచ్చ రచ్చ
ఏంటీ NT NINE..? మహేష్ బాబు- రాజమౌళి సినిమా టైటిల్ అదేనా..? ప్రియాంక చోప్రా ఫోటోలతో రచ్చ రచ్చ
Maha Kumbh: 27 ఏళ్ల కింద వదిలేసిపోయిన భర్తను కుంభమేళాలో చూసిన భార్య -  అఘోరిగా ఉన్న ఆ భర్త ఏం ఏం చేశాడో తెలుసా ?
27 ఏళ్ల కింద వదిలేసిపోయిన భర్తను కుంభమేళాలో చూసిన భార్య - అఘోరిగా ఉన్న ఆ భర్త ఏం ఏం చేశాడో తెలుసా ?
Monalisa News: సినిమాలో నటించేందుకు మోనాలిసా ఓకే- ముంబైలో యాక్టింగ్‌ ట్రైనింగ్ 
సినిమాలో నటించేందుకు మోనాలిసా ఓకే- ముంబైలో యాక్టింగ్‌ ట్రైనింగ్ 
Embed widget