Mrunal Thakur: మృణాల్ ఠాకూర్‌తో పెళ్లి పుకార్లకు క్లారిటీ ఇచ్చిన అక్కినేని హీరో... తెలుగింటి కోడలు కాదా?
Mrunal Thakur Wedding: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అది కూడా టాలీవుడ్ హీరోతో? ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొట్టింది. దానికి హీరో క్లారిటీ ఇచ్చారు.

'సీతారామం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మరాఠీ అమ్మాయి, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత 'ది ఫ్యామిలీ స్టార్', 'హాయ్ నాన్న' సినిమాలు చేశారు. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాలో ఒక అతిథి పాత్రలో సందడి చేశారు. ప్రస్తుతం ఆవిడ చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాలు చేయడం మాత్రమే కాదు... తెలుగింటి కోడలు కాబోతున్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది. దానికి అక్కినేని ఫ్యామిలీ హీరో క్లారిటీ ఇచ్చారు.
అక్కినేని ఫ్యామిలీ హీరోతో మృణాల్ పెళ్లి?
ఆ ఫోటోకు, పెళ్లి పుకార్లకు క్లారిటీ ఇచ్చిన హీరో!
Sumanth On Wedding Rumours With Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ మొదటి సినిమా 'సీతారామం'లో అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు, హీరో సుమంత్ ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాలలో సుమంత్, మృణాల్ కలిసి దిగిన ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: కనిపించేది కాసేపే అయినా భారీ రెమ్యూనరేషన్... 'జైలర్ 2' కోసం బాలకృష్ణకు ఎన్ని కోట్లు ఆఫర్ చేశారంటే?
Mrunal Sumanth dating chesthunara?
— AbhiLeaks (@wishvasam) May 4, 2025
Mrunal Sumanth ni pelli cheskuntundha?
Sam ni director tho link chese EP Telugu media & Nepo nakudu Lks cheppali #Justasking #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/SjHZhLppkX
సుమంత్, మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారని... వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం మొదలైంది. ఈటీవీ విన్ ఓటీటీ కోసం రూపొందిన ఒరిజినల్ సినిమా 'అనగనగా' త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన సుమంత్ దృష్టికి ఈ ప్రచారం వెళ్ళింది.
తనకు, మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur wedding)కు పెళ్లి అని వచ్చిన వార్తలు గానీ, అటువంటి ప్రచారం జరిగినట్లు కూడా తెలియదని సుమంత్ చెప్పారు. అదంతా మీడియా మహిమ అని ఆయన కొట్టిపారేశారు. ఆ ఫోటో ఐదేళ్ల క్రితం సీతారామం ప్రమోషన్స్‌లో దిగినది అని ఆయన తెలిపారు. తాను సింగిల్ అని, అలా ఉండడం తనకు చాలా ఇష్టం అని తెలిపారు. సో... సుమంత్, మృణాల్ పెళ్లి గురించి వచ్చిన వార్తలన్నీ పుకార్లు మాత్రమే.
Also Read: '#సింగిల్' రివ్యూ: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ బావుందా? కామెడీ బావుందా?
Mrunal Thakur upcoming movies: ప్రస్తుతం అడివి శేష్ హీరోగా రూపొందుతున్న 'డెకాయిట్' సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. తెలుగులో ఆవిడ చేస్తున్న సినిమా అది ఒక్కటే. హిందీలో అజయ్ దేవగన్ 'సన్నాఫ్ సర్దార్ 2', 'పూజా మేరీ జాన్', 'హై జవానీ తో ఇష్క్ హోనా', 'హై తుం హోతో' సినిమాలు చేస్తున్నారు.





















