Balakrishna: కనిపించేది కాసేపే అయినా భారీ రెమ్యూనరేషన్... 'జైలర్ 2' కోసం బాలకృష్ణకు ఎన్ని కోట్లు ఆఫర్ చేశారంటే?
Balakrishna Remuneration: సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. అందుకు గాను ఆయనకు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.

'జైలర్ 2'లో గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ అతిథి పాత్రలో సందడి చేయడం కన్ఫర్మ్. సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), ఆయన కలిసి ఒకే సన్నివేశంలో కనిపిస్తారా? లేదా? ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? లేదా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే... ఈ సినిమా కోసం బాలకృష్ణకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట.
షూటింగ్ చేసేది 20 రోజులు...
చేతికి వచ్చేది 50 కోట్ల రూపాయలు!?
Balakrishna Remuneration For Jailer 2: 'జైలర్ 2' సినిమాలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ మరోసారి అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. ఆ ఇద్దరూ మొదటి పార్ట్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే. అయితే వాళ్ళిద్దరి స్క్రీన్ స్పేస్ తక్కువ. వాళ్లతో కంపేర్ చేస్తే బాలకృష్ణకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందట.
'జైలర్ 2' కోసం బాలకృష్ణ సుమారు 20 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని సమాచారం. ఆయనది అతిథి పాత్ర కాదు అని... కాస్త నిడివి ఉండే ప్రత్యేక పాత్ర అని చిత్ర బృందం సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న కథనం. ఆ 20 రోజులకు గాను సుమారు 50 కోట్ల రూపాయలు బాలకృష్ణకు రెమ్యూనరేషన్ కింద ఆఫర్ చేశారని టాలీవుడ్ టాక్. అంటే రోజుకు రెండున్నర కోట్ల రూపాయలు అన్నమాట.
'జైలర్' సినిమాలో బాలకృష్ణతో ఒక అతిథి పాత్ర చేయించాలని అనుకున్నా కుదరలేదని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అప్పట్లో చెప్పారు. ఇప్పుడు సీక్వెల్ వచ్చే సరికి బాలయ్య రోల్ కన్ఫర్మ్ అయింది. 'జైలర్ 2'లో బాలకృష్ణ సన్నివేశాలకు అనిరుద్ ఎటువంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కొడతాడోనని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఎటువంటి సన్నివేశాలు రాశారోననే ఆసక్తి కూడా ఉంది.
Also Read: '#సింగిల్' రివ్యూ: శ్రీవిష్ణు హిట్టు కొట్టాడా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ బావుందా? కామెడీ బావుందా?
'జైలర్ 2' సంగతి పక్కన పెడితే... లోకేష్ కనకరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న సినిమా 'కూలీ'. అందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అతిథి పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఆ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read: శుభం రివ్యూ: నిర్మాతగా సమంత మొదటి సినిమా - హారర్ కామెడీతో నవ్వించారా? భయపెట్టారా?





















