Pushpa 2 Thanks Meet: 'అల్లు అర్జున్ SVR లాంటి వారు' - మీరు ట్రోల్ చేసినా ఇది నిజం అంటూ సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Sukumar: దర్శకుడు సుకుమార్ పుష్ప 2 థ్యాంక్స్ మీట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించారు. బన్నీని ఎస్వీఆర్‌తో పోలుస్తూ సుక్కూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Sukumar Compared Allu Arjun With SVR In Pushpa 2 Thanks Meet: ఈ ప్రపంచంలో తనను ఓ అద్భుతంలా చూసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అని దర్శకుడు సుకుమార్ (Sukumar) అన్నారు. పుష్ప 2 థ్యాంక్స్ మీట్‌లో మాట్లాడిన ఆయన.. బన్నీపై ప్రశంసలు కురిపించారు. 'పుష్ప' టైంకు తన వద్ద కథ లేకపోయినా.. ఏదో ఓ చిన్న పాయింట్ చెప్పగానే.. తనను ఓ అద్భుతంలా గుడ్డిగా నమ్మి బన్నీ ముందుంచి నడిపించారని కొనియాడారు. అలా ఈ కథ మొదలైందంటూ సుకుమార్ ఎమోషనల్ కాగా.. అల్లు అర్జున్ సైతం ఆయన మాటలకు భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికీ 'పుష్ప' పూర్తి కథ చెప్పలేదని, ఇది సెకండ్ ఇంటర్వెల్ అని పేర్కొన్నారు. పుష్ప 3, 4 ఇలా ఎన్ని భాగాలు అవుతుందో చెప్పలేనని అన్నారు. ఈ సందర్భంగా సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
'అల్లు అర్జున్ SVR లాంటి వారు'
అల్లు అర్జున్ SVR లాంటి వారని సుకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప సినిమా క్రెడిట్ అంతా బన్నీదే. టీం అంతటికీ అల్లు అర్జునే స్ఫూర్తి. మా కాలనీలో బయటకు వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి నాతో మాట్లాడారు. పుష్ప 2 చాలా బాగుందని.. బన్నీ నటన అద్భుతమని చెప్పారు. వారిలో ఒకరు బన్నీ SVR అని అంటే పక్కనున్న మరో వ్యక్తి ఎస్వీఆర్ ఫైట్స్, డ్యాన్స్ చేయరు కదా అన్నారు. మీరు ట్రోల్ చేసినా ఇది నిజం. అల్లు అర్జున్ డ్యాన్స్, ఫైట్స్, నటన అన్నీ అద్భుతంగా చేయగలరు. షూటింగ్ సమయంలో నేను హ్యాపీ అయ్యే వరకూ బన్నీ అలా చేస్తూనే ఉంటారు. పుష్ప 1, 2 సినిమాల్లో ఏ సీన్ ఎలా ఉండాలనుకున్నానో అలా వచ్చేంత వరకూ బన్నీ అచీవ్ చేశారు.' అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
Also Read: విజయ్ దేవరకొండ కోసం జూనియర్ ఎన్టీఆర్ - 'VD 12' టీజర్‌కు వాయిస్ ఓవర్, ఆ భాషల్లో అగ్రహీరోలు కూడా..
ఏ ఒక్కరినీ మర్చిపోని సుకుమార్
కాగా, పుష్ప 2 థ్యాంక్స్ మీట్‌లో సుకుమార్ తన స్పీచ్‌లో ఏ ఒక్కరినీ మర్చిపోలేదు. మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. లైట్ బాయ్స్ దగ్గరి నుంచీ కెమెరామెన్, కొరియో గ్రాఫర్, మైత్రీ మూవీ మేకర్స్ వరకూ అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఇక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను ఆకాశానికెత్తేశారు. 'దేవీ లేకుండా నేను సినిమాలు చేయలేదు. ఇకపై చేయనేమో.. నా పేరు సుకుమార్ కాదు. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్.' అంటూ పొగిడేశారు.
అంతకు ముందు మాట్లాడిన బన్నీ.. సుకుమార్‌పై ప్రశంసలు కురిపించారు. 'పుష్ప 3' ఓ అద్భుతమైన ఎనర్జీలా ఉంటుందని.. అదెప్పుడూ కార్యరూపం దాలుస్తుందో చూడాలని చెప్పారు. సుకుమార్ వల్లే 'పుష్ప' కోసం పనిచేసిన అందరి జీవితాలు అర్థవంతమయ్యాయని అన్నారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: ఓటీటీలోకి 'ముఫాసా: ది లయన్ కింగ్' - ఆ ప్లాట్ ఫామ్‌లో చూసి ఎంజాయ్ చేయండి, ఎప్పటి నుంచంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

