అన్వేషించండి

Mufasa OTT Release Date: ఓటీటీలోకి 'ముఫాసా: ది లయన్ కింగ్' - ఆ ప్లాట్ ఫామ్‌లో చూసి ఎంజాయ్ చేయండి, ఎప్పటి నుంచంటే?

Mufasa OTT Platform: బాక్సాఫీస్ వద్ద హిట్ బొమ్మ 'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటించారు.

Mufasa The Lion King OTT Release Date: హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ది లయన్ కింగ్ (2019)' సినిమాకు ఫ్రీక్వెల్‌గా 'ముఫాసా: ది లయన్ కింగ్' (Mufasa: The Lion King) చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ బ్యానర్‌పై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించగా.. బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు. ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాన్ని అందుకుంది. 'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమాకు తెలుగులో టైటిల్ రోల్‌కు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) వాయిస్ ఓవర్  అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతేడాది విడుదలైన ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రం పిల్లల దగ్గర నుంచీ పెద్దల వరకూ అందరినీ ఆకట్టుకుంది. సుమారు రూ.1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.3,200 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతోంది.

అప్పటి నుంచే ఓటీటీలోకి..

'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమా ఫిబ్రవరి 18వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో (Disney Plus Hotstar) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. అదనంగా డబ్బు చెల్లించి ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఫ్రీగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. ఆపై ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో ఆన్ డిమాండ్ ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ సినిమా తెలుగులో టైటిల్ రోల్‌కు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అందించగా.. హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. అలాగే, ఈ సినిమాలో సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.

Also Read: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్

బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు

రాజ్యంలో సింహాసనం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేసే కథలో సింహాల్ని ముందుపెట్టి తీసుకెళ్లడాన్ని 'ముఫాసా: ది లయన్ కింగ్' సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు వెర్షన్‌కు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణ. ముఫాసా అసలు రాజుగా ఎలా మారాడు.?. ఆయన గత చరిత్ర ఏంటి.? అనే అంశాల్ని ఈ సినిమాలో చూపించారు. పలు భాషల్లో గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. దేశవ్యాప్తంగా తొలి వారంలోనే రూ.74 కోట్లు వసూలు చేసింది. అటు, ఈ సినిమాకు వాయిస్ అందించడంపై మహేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్లాసిక్‌కు తాను విపరీతమైన అభిమానిని అని ఇది తనకెంతో ప్రత్యేకమని చెప్పారు.

Also Read: చిరంజీవి ‘బిగ్ బాస్’, పవన్ ‘సుస్వాగతం’ to కార్తీ ‘సత్యం సుందరం’, అనుష్క ‘వేదం’ వరకు - ఈ ఆదివారం (ఫిబ్రవరి 9) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget