అన్వేషించండి

Suhas : హీరో సుహాస్‌కు ఘోర అవమానం - ఆ హీరోయిన్ పక్కన అతను ఎందుకు అన్నారు?... కట్ చేస్తే...

Suhas Reaction : కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన ఘోర అవమానాన్ని హీరో సుహాస్ 'హే బల్వంత్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత తన సక్సెస్ జర్నీ గురించి చెప్పారు.

Suhas About His Bad Experience In Tollywood Industry : షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆ తర్వాత హీరోగా టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు యంగ్ హీరో సుహాస్. అప్పుడప్పుడూ మూవీస్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా కామెడీ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన ఘోర అవమానం గురించి చెప్పారు.

'అప్పుడు ఘోర అవమానం'

షార్ట్ ఫిల్మ్స్‌లో సక్సెస్ అయిన తర్వాత 'మజిలీ' సినిమాతో తనకు పెద్ద బ్రేక్ వచ్చిందని తెలిపారు సుహాస్. 'మజిలీ తర్వాత వరుస ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి. ఓ సినిమాలో హీరోయిన్ పక్కన పెద్ద క్యారెక్టర్ అని పిలిచారు. అక్కడికి వెళ్తే 'ఇతన్ని ఎందుకు పిలిచారు?' అంటూ నా ముందే అన్నారు. ఆమె పక్కన నిలబడే అర్హతే లేదన్నారు. ఆయనకు చాలా థాంక్స్. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత హీరోయిన్ కీర్తి సురేశ్‌తో 'ఉప్పు కప్పురంబు' సినిమా చేశా.

కీర్తి గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆమెకు మా ఇంటి భోజనం పెట్టే అదృష్టం కలిగింది. నా విషయంలో ఇది సక్సెస్. ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా అంటే నవ్వి వదిలేసేయండి. మీరు సక్సెస్ అయినా కూడా నవ్వే వదిలేయాలి.' అని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Also Read : బాక్సాఫీస్‌లో మంగళవారం ఢమాల్... 'సీతా పయనం' నాలుగు రోజుల కలెక్షన్ ఎంతంటే?

అందుకే గ్యాప్

వరుస పరాజయాల తర్వాత కాస్త ఆలోచించి సినిమా చేయాలన్న సలహాలతో గ్యాప్ తీసుకుని మంచి సినిమా చేయాలనే లక్ష్యంతో 'హే బల్వంత్'ను ఓకే చేసినట్లు చెప్పారు సుహాస్. 'ఈ స్టోరీ వినగానే కామెడీ, ఎమోషన్‌కు బాగా కనెక్ట్ అయిపోయా. చిన్నప్పటి నుంచి మంచి బిజినెస్ చేయాలన్న ఓ యువకుడి స్టోరీనే హే బల్వంత్. తన తండ్రి బిజినెస్ టేకప్ చేయాలనుకున్నప్పుడు అతనికి ఎదురైన అనుభవాలేంటి?, అసలు వాళ్ల నాన్న చేస్తున్న బిజినెస్ ఏంటి? అనేదే స్టోరీ.

ఈ మూవీలో నా రోల్ చాలా ఫన్నీగా ఉంటుంది. నా పాత్ర చూశాక ఇలాంటి రోల్స్ చేయాలని నా వైఫ్ కోరింది. నటుడిగా వంద శాతం కష్టపడతా. ఫలితం ఏదైనా వెంటనే నెక్స్ట్ మూవీకి రెడీ అయిపోతా. ఈ సినిమాపై మా అందరికీ వంద శాతం నమ్మకముంది. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణం పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నా.' అంటూ చెప్పారు.

టైటిల్ ఛేంజ్

'హే భగవాన్'గా ఉన్న టైటిల్‌ను సెన్సార్ బోర్డు సూచనలతో 'హే బల్వంత్'గా మార్చారు. ఈ నెల 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. మూవీకి గోపీ అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్ సరసన శివానీ నాగారం హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ హీరో నరేష్, హర్షవర్దన్, యాంకర్ స్రవంతి, అజయ్ ఘోష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి.నరేంద్రరెడ్డి నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి మూవీని రిలీజ్ చేస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget