Funky Box Office Collection: లక్షల్లోకి పడిన 'ఫంకీ'... కొత్త సినిమాలు వచ్చే వరకు పర్వాలేదు కానీ?
Funky Box Office Collection Day 5: విశ్వక్ సేన్ 'ఫంకీ' కలెక్షన్లు లక్షల్లోకి పడ్డాయి. కానీ కాస్త స్టడీగా ఉంది. థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేవరకు ఈ సినిమాకు కాస్త జనాలు వచ్చేటట్లు ఉన్నారు.

Funky Movie Five Days Box Office Collection: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త సినిమా 'ఫంకీ' డైలీ నెట్ కలెక్షన్ లక్షల్లోకి పడింది. అయితే సినిమా కాస్త స్టడీగా ఉంది. విడుదలైన నాలుగు రోజుల్లో పది కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా, ఐదు రోజు కూడా 50 లక్షలకు పైగా నెట్ రాబట్టింది. దాంతో థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చే వరకు ఈ చిత్రానికి ప్రేక్షకులు వచ్చేట్టు ఉన్నారు. ప్రజెంట్ ఫైవ్ డేస్ ఇండియా నెట్ కలెక్షన్ చూస్తే...
మంగళవారం నెట్ కలెక్షన్ 56 లక్షలు
Funky First Tuesday India Net Collection: బాక్స్ ఆఫీస్ బరిలో 'ఫంకీ' స్టార్ట్ బావుంది. మొదటి రోజు ఈ సినిమా 2.2 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. వీకెండ్ వరకు కలెక్షన్స్ బావున్నాయని చెప్పాలి. శని, ఆది వారాల్లో వరుసగా రూ. 1.90 కోట్లు, రూ. 1.65 కోట్లు రాబట్టింది. దాంతో ఫస్ట్ వీకెండ్ ఇండియా నెట్ కలెక్షన్ 5.75 కోట్లకు చేరుకుంది.
ఫస్ట్ వీకెండ్ తర్వాత 'ఫంకీ' ఇండియా నెట్ కలెక్షన్ లక్షల్లోకి పడింది. మొదటి సోమవారం 86 లక్షలు, మంగళవారం రూ. 56 లక్షలు కలెక్ట్ చేసింది. దాంతో ఐదు రోజుల ఇండియా నెట్ కలెక్షన్ రూ. 7.6 కోట్లకు చేరుకుంది. గ్రాస్ విషయానికి వస్తే... రూ. 7.8 కోట్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ నుంచి 3.2 కోట్లు రావడంతో ఐదు రోజుల టోటల్ గ్రాస్ కలెక్షన్ 11 కోట్లకు చేరుకుంది.
Also Read: Tollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా
ఈ శుక్రవారం థియేటర్లలోకి హే భగవాన్, నవాబ్ కేఫ్ సినిమాలు వస్తున్నాయ్. ఆ రెండు వచ్చేవరకు 'ఫంకీ'కి ఎటువంటి ఢోకా లేదు. వాటికి వచ్చే టాక్ బట్టి 'ఫంకీ' సెకండ్ వీక్ కలెక్షన్స్ డిపెండ్ అవుతాయి.
'ఫంకీ' చిత్రానికి 'జాతి రత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సితార నాగవంశీ నిర్మించారు. సాయి సౌజన్య మరో నిర్మాత. ఇందులో విశ్వక్ సేన్ సరసన కయాదు లోహర్ కథానాయికగా నటించింది. ఈశ్వరి రావు, సీనియర్ నరేష్, సంపత్ రాజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ మ్యూజిక్ అందించారు.























