Parasakthi Review Telugu: శివకార్తికేయన్ 'పరాశక్తి' ట్విట్టర్ రివ్యూ: బోరింగ్ పీరియడ్ డ్రామా... టాక్ ఏమిటంటే?
Sivakarthikeyan Parasakthi Review: శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వం వహించిన 'పరాశక్తి' తమిళనాడులో విడుదలైంది. అమెరికాలో ప్రీమియర్లు పడ్డాయి. ఈ చిత్రానికి ఎటువంటి రివ్యూలు వస్తున్నాయంటే?

Sivakarthikeyan Parasakthi Movie Review In Telugu: సంక్రాంతికి టాలీవుడ్ స్టార్స్ నటించిన సినిమాలు ఐదు ఉండటంతో తెలుగులో శివకార్తికేయన్ 'పరాశక్తి' రిలీజ్ వాయిదా వేశారు. అయితే తమిళనాడులో విడుదలైంది. అమెరికాలోనూ ప్రీమియర్లు పడ్డాయి. అక్కడ నుంచి సినిమాకు వచ్చిన రివ్యూలు ఏమంత గొప్పగా లేవు. ఇదొక బోరింగ్ పీరియడ్ డ్రామా అంటున్నారు.
అసలు పరాశక్తి కథ ఏమిటి?
Parasakthi Movie Story: తమిళనాడు నేపథ్యంలో 'పరాశక్తి' సినిమా సాగుతుంది. హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దడానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఓ ఉద్యమం ప్రారంభిస్తారు. ఆ ఉద్యమానికి వ్యతిరేకంగా పని చేసింది ఎవరు? తమిళనాడు కేంద్రంగా జరిగిన ఆ ఉద్యమ నేపథ్యమే 'పరాశక్తి' సినిమా.
ఈ 'పరాశక్తి' ఎలా ఉందట?
అమెరికాలో ప్రీమియర్ షోలకు ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఇండియన్ టైమింగ్ చూస్తే... ఇవాళ ఉదయం పడ్డాయి. ఇండియాలో మాత్రం ఉదయం ఏడు గంటలకు మొదలు కావాల్సిన షోలు తొమ్మిది గంటలకు మొదలు అయ్యాయి.
అమెరికా నుంచి 'పరాశక్తి'కి పూర్ రివ్యూస్ వచ్చాయి. శివకార్తికేయన్ క్యారెక్టరైజేషన్ చాలా వీక్‌గా ఉందని తమిళ్ క్రిటిక్స్ సైతం అంగీకరిస్తున్నారు. సినిమా మొదలైన పది నిమిషాలు, ఆ తర్వాత ఇంటర్వెల్ ముందు మరొక పది నిమిషాలు మాత్రమే బావుందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా సినిమా సాగిందట.
దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దడానికి ప్రయత్నించిన దర్శకురాలు సుధా కొంగర గట్స్ మెచ్చుకుంటున్నారు చాలా మంది. ఆవిడ ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ బావున్నా... రైటింగ్ బాలేదని క్రిటిసైజ్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత కూడా సాగదీత ఎక్కువ ఉండటంతో బోరింగ్ డ్రామాగా మారిందట.
Also Read: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?
శివ కార్తికేయన్ మాత్రం బాగా నటించాడని చెబుతున్నారు. రవి మోహన్ (జయం రవి) పాత్రకు సరైన బ్యాక్ స్టోరీ లేదన్నారు. అయితే పీరియడ్ ఫీల్ తీసుకు రావడంలో వందకు రెండొందల శాతం కృషి చేసిన ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైనర్ మీద ప్రశంసలు వస్తున్నాయి. సినిమాకు అదొక్కటే పాజిటివ్ అట. ఇదొక బోరింగ్ డ్రామా అని ఎన్నారై క్రిటిక్స్ తేల్చేశారు. ఇందులో తెలుగు అమ్మాయి శ్రీలీల కథానాయికగా నటించారు. పరాశక్తి ట్విట్టర్ రివ్యూలను కింద ట్వీట్లలో చూడండి.
#Parasakthi A Boring Period Drama with Honest Intentions but a Tedious, Lengthy Narration that Tests Your Patience!
— Venky Reviews (@venkyreviews) January 10, 2026
The film initially grabs attention with an authentic period setup. However, a slow narration and dull love track dominate most of the first half. Post-interval,…
#Parasakthi first public review
— Sangeetha (@Sangeeta_cbe) January 10, 2026
First half very boring unable to sit in seats
Interval block adharva death scene to predictable by child also
Music below average very flat no hype scenes
Climax very worst by director carrer sudha kongra #Sivakarthikeyan average acting ,… pic.twitter.com/PlTNhiwuqs
#Parasakthi - Film based on Anti-Hindi imposition.
— Troll Captain (@trollcaptain_) January 10, 2026
Reviews - Paid tweets from Hindi accounts.
That is @Siva_Kartikeyan for you 🫡🔥 pic.twitter.com/cF0T8Xf1WU





















