Siva Karthikeyan: ఆ సినిమా కోసం రెమ్యునరేషన్ త్యాగం చేసిన శివ కార్తికేయన్, సిద్ధార్థ్
Siva Karthikeyan, Siddharth: సినిమా కంటెంట్‌పై నమ్మకం ఉంటే హీరోలు తమ రెమ్యునరేషన్‌ను కట్ చేసుకొని, అది కూడా బడ్జెట్‌లో యాడ్ చేసేస్తారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి శివకార్తికేయన్, సిద్ధార్థ్ కూడా చేరారు.
Ayalaan Movie: కొన్ని సినిమాలకు మేకర్స్ ఎంత కష్టపడినా.. అవి ప్రేక్షకుల ముందుకు రావడానికి మాత్రం ఏదో ఒకటి అడ్డుపడుతుంది. అలా ఎన్నో సమస్యల వల్ల ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎన్నో ఏళ్లు సమయం తీసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అయాలన్’ కూడా అదే లిస్ట్‌కు చెందినదే. ఈ మూవీ గురించి మేకర్స్ అనౌన్స్ చేసి రెండేళ్లుపైనే అయ్యింది. అయినా ఇంకా ‘అయాలన్’ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదలయినా కూడా మూవీ రిలీజ్‌పై క్లారిటీ లేదు. ఇంతలోనే స్టార్ హీరోలు ఇద్దరు ఈ సినిమా కోసం తమ రెమ్యునరేషన్ త్యాగం చేశారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మనిషికి, ఏలియన్‌కు ఫ్రెండ్‌షిప్
2024లో జనవరి 12న ‘అయాలన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. ఒక మనిషి, ఏలియన్‌కు మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించిందని ఇప్పటివరకు విడుదలయిన పోస్టర్స్, టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తుండగా.. ఏలియన్ పాత్రకు మరో హీరో సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం శివకార్తికేయన్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుండగా.. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయం బయటపెట్టాడు. ఈ సినిమా కోసం తనతో పాటు సిద్ధార్థ్ కూడా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని అన్నాడు.
బడ్జెట్‌ను పెంచేసిన గ్రాఫిక్స్
‘అయాలన్’కు తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని, టీమ్ విజన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డామని చెప్పుకొచ్చాడు శివకార్తికేయన్. ఇక ఏలియన్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన సిద్ధార్థ్ కూడా దానికోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. అంతే కాకుండా ఇలాంటి ఒక కొత్త డబ్బింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు సంతోషంగా ఉందని అన్నాడట. దీంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. సిద్ధార్థ్‌ను, శివకార్తికేయన్‌ను తెగ పొగిడేస్తున్నారు. ‘అయాలన్’ చిత్రాన్ని చాలా భారీ రేంజ్‌లో తెరకెక్కించారు మేకర్స్. గ్రాఫిక్స్ పని కూడా ఎక్కువగా ఉండడంతో ఇన్నేళ్లుగా ఈ మూవీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే నిలిచిపోయింది. ఆ గ్రాఫిక్స్ కోసం అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుండడంతో శివకార్తికేయన్.. తన రెమ్యునరేషన్‌ను త్యాగం చేయడానికి కూడా వెనకాడలేదు. శివకార్తికేయన్ డెడికేషన్ చూసి సిద్ధార్థ్ కూడా అదే పనిచేశాడు.
‘బాహుబలి’తో పోలిక
తాజాగా ‘అయాలన్’ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అందులో కూడా టీమ్ అంతా తమ మూవీ సక్సెస్‌పై చాలా నమ్మకంతో ఉన్నారు. ‘బాహుబలి’ అనే సినిమా టాలీవుడ్‌ను ఎలా మార్చిందో.. ‘అయాలన్’ అనే సినిమా కోలీవుడ్‌ను కూడా అలాగే మారుస్తుందని నిర్మాత ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్ అయ్యింది. గ్రాఫిక్స్, విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని మేకర్స్ అంటున్నారు. ఈ మూవీ తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా విడుదల కానుంది. షరద్ కెల్కార్, ఇషా కొప్పికార్, భానుప్రియ, యోగి బాబు.. ఇందులో ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 24 ఏఎమ్ స్టూడియోస్, ఫాంటమ్‌ఎఫ్ఎక్స్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కోటపాడి జే రాజేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్.. ‘అయాలన్’కు సంగీతాన్ని అందించాడు.
Also Read: రణబీర్ కపూర్‌పై కేసు నమోదు - ‘క్రిస్మస్’ రోజు అలా అనడంపై అభ్యంతరాలు