అన్వేషించండి

Ranbir Kapoor: రణబీర్ కపూర్‌పై కేసు నమోదు - ‘క్రిస్మస్’ రోజు అలా అనడంపై అభ్యంతరాలు

రణబీర్ కపూర్.. తన ఫ్యామిలీతో కలిసి చేసుకున్న క్రిస్ట్మస్ సెలబ్రేషన్స్.. పెద్ద సమస్యకు దారితీసింది. ఆఖరికి తనపై కేసు ఫైల్ అయ్యేలాగా చేసింది.

Ranbir Kapoor: సినీ సెలబ్రిటీలు చేసే ప్రతీ పనిని ప్రేక్షకులు ప్రత్యేకంగా గమనిస్తారు. అందుకే వారు ఆలోచించకుండా చేసే సరదా పనులు కూడా ఒక్కొక్కసారి వారిని పెద్ద సమస్యల్లో పడేస్తాయి. తాజాగా రణబీర్ కపూర్ కూడా అదే పరిస్థితిలో చిక్కుకున్నాడు. క్రిస్ట్మస్ వేడుకల్లో రణబీర్ కపూర్ సరదాగా చేసిన పని.. తనపై, తన కుటుంబంపై కేసు ఫైల్ అయ్యేలా చేసింది. రణబీర్.. తన కుటుంబంతో కలిసి క్రిస్ట్మస్ సెలబ్రేట్ చేసుకున్న వీడియోను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాసేపట్లోనే అది చాలా వైరల్ అయ్యింది. ఆ వైరల్ వీడియోనే ఇప్పుడు రణబీర్‌కు సమస్యలు తెచ్చిపెట్టింది. 

రణబీర్‌పై కేసు..

వైరల్ అయిన వీడియోలో రణబీర్ కపూర్.. తన కుటుంబంతో కలిసి క్రిస్ట్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. కేక్ కట్ చేసే సమయంలో రణబీర్ ‘జై మాతా దీ’ అని అన్నాడు. అయితే అది మతపైన సెంటిమెంట్స్‌ను దెబ్బతీసేలా ఉందని ముంబాయ్‌కు చెందిన ఒక వ్యక్తి.. రణబీర్‌పై కేసు ఫైల్ చేశాడు. సంజయ్ తివారీ అనే వ్యక్తి ముంబాయ్‌లోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో రణబీర్‌పై ఫిర్యాదు చేశాడు. ‘‘కేక్‌పై మద్యం పోస్తూ.. దానిని ఫైర్ చేస్తూ.. జై మాతా దీ అనడం కరెక్ట్ కాదు’’ అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు సంజయ్. తన లాయర్లు ఆశిష్ రాయ్, పంకజ్ మిష్రాతో కలిసి కంప్లయింట్ దాఖలు చేశారు. కానీ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ ఇంకా ఫైల్ అవ్వలేదని సమాచారం.

హిందూ మతాన్ని కించపరిచాడు

‘‘హిందూ మతంలో ఇతర దేవుళ్లను పూజించడానికి ముందే అగ్ని దేవుడిని వెలిగిస్తారు. కానీ రణబీర్ కపూర్, తన కుటుంబ సభ్యులు ఇతర మతానికి సంబంధించిన పండగను సెలబ్రేట్ చేసుకుంటూ.. మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తూ జై మాతా దీ అనే పదాన్ని ఉపయోగించాడు’’ అని సంజయ్ తెలిపాడు. క్రిస్ట్మస్ రోజు కునాల్ కపూర్ ఏర్పాటు చేసిన లంచ్‌కు రణబీర్ కపూర్, ఆలియా భట్, రాహా కూడా వచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలను ఆలియా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కూడా చేసింది. ‘చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మెర్రీ క్రిస్ట్మస్’ అంటూ తన భర్తతో పాటు పార్టీలో ఇతరులతో కలిసి దిగిన ఫోటోలను ఆలియా షేర్ చేసింది.

‘యానిమల్’ కాంట్రవర్సీ మరవకముందే..

ఒక ఫ్యామిలీ పార్టీలో రణబీర్ చేసిన సరదా పని తనను చిక్కుల్లో పడేసిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కానీ మరికొందరు మాత్రం ఫిర్యాదు చేసిన సంజయ్‌ను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ‘యానిమల్’ సినిమా క్రియేట్ చేసిన కాంట్రవర్సీ నుండి రణబీర్ బయటికి రాలేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ‘యానిమల్’ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అంతే కాకుండా ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాక్ కూడా అందుకుంది. కానీ సినిమాలో పలు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, రణబీర్ క్యారెక్టర్ మరీ శృతిమించిపోయి ఉందని, మహిళలపై గౌరవం లేకుండా ఉందని పలువురు విమర్శించారు. ఇంతలోనే క్రిస్ట్మస్ వైరల్ వీడియోతో మరోసారి వార్తల్లోకెక్కాడు రణబీర్ కపూర్.

Also Read: అల్లు అర్జున్ ఇంటి కన్‌స్ట్రక్షన్‌లో పనిచేశాను, పెద్ద దెబ్బలే తగిలాయి - ‘మంగళవారం’ నటుడు లక్ష్మణ్ మీసాల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget