అన్వేషించండి

Maname Trailer: పిల్లలను పెంచడమంటే యూట్యూబ్‌లో‌ చూసినంత ఈజీ కాదు - ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్న 'మనమే' ట్రైలర్‌

Maname Trailer: శర్వానంద్‌ 35వ సినిమా వస్తున్న చిత్రం మనమే. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా మనమే ఆద్యాంతం ఆకట్టుకుంటుంది.

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ - కృతి శెట్టి హీరోహీరోయిన్లు తెరకెక్కుతున్న సినిమా 'మనమే' (Manamey Movie). శ్రీరామ్ ఆదిత్య (Sriram Adittya) దర్శకత్వంలో లవ్‌ అండ్‌ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమా జూన్‌ 7న ప్రపంచవ్యాప్తంగ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇప్పటికే విడుదలైన 'మనమే' ప్రచార పోస్టర్స్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌, టీజర్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌ రావడంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి.‌ ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ మూవీపై మరింత ఆసక్తి పెంచుతుంది. 

కాగా ఇందులో శర్వానంద్‌, కృతి శెట్టి భార్యభర్తలుగా అలరించబోతున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమైపోతుంది. ఇందులో ప్రతి విషయాన్ని ఎమోషనల్‌గా చూసే భార్యగా కృతి, ప్యాక్టికల్‌గా ఆలోచించే భర్త శర్వానంద్‌ కనిపించబోతున్నారు. విభిన్న అభిప్రాయాలు ఉన్న వీరిద్దరు ఓ బిడ్డకు తల్లిదండ్రులుగా నటించారు. ఈ క్రమంలో పిల్లాడి విషయంలో వారిమధ్య చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో శ్రీరామ్ ఆదిత్య మనమే సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నాడు. 

ట్రైలర్‌ ఎలా ఉందంటే..

శర్వానంద్‌, కృతి శెట్టి కలిసి ఫారెన్‌ వెళ్లే సీన్‌తో ట్రైలర్‌ను మొదలైంది. విమానంలో ఎయిర్‌ హోస్ట్‌తో శర్వానంద్‌ కాస్తా క్లోజ్‌గా మాట్లాడుతుండటంతో పక్కనే పిల్లాడితో ఉన్న కృతి అతడిని సీరియస్‌గా చూస్తుంది. ట్రైలర్‌ ప్రారంభంలోనే ఇది ఎమోషన్‌ ఫ్యామిలీ అండ్‌ కామెడీ డ్రామా అని స్పష్టం చేశాడు డైరెక్టర్‌. శర్వానంద్‌ చేసే ప్రతి విషయంలో కృతి తప్పులు వెతకడం..  అతడితో గొడవపడుతూ ఉంటుంది. పిల్లాడిని చూసుకునే విషయంలోనే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వస్తుంటాయి. "ఒకసారి మా నాన్న ఒక మాట ఇస్తే ఆ మాటకు ఎంత రెస్పెక్ట్‌ ఇస్తారో తెలుసా?" అని అరవడం.. "నాకో మాటిస్తావా? ఈ మాట కాన్సెప్ట్‌ మళ్లీ మాట్లాడనని మాటిస్తావా?" అనే డైలాగ్‌ ఆసక్తిగా ఉంది. అన్ని విషయాలను ప్రాక్టికల్‌గా చూసే శర్వానంద్‌.. పిల్లాడి పెంపకం విషయంలో కూడా అలాగే ఉంటాడు, ఆలోచిస్తాడు. ఈ క్రమంలో తరచూ తన కృతి చేతిలో చీవాట్లు తింటాడు. 

ఇది కాస్తా పెద్దదై ఇద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో "నేను ప్రాక్టికల్‌గా మాట్లాడుతున్నాను.. నువ్వు ఎమోషనల్‌గా మాట్లాడుతున్నావ్‌" అంటూ శర్వానంద్‌ అనడం దానికి "ఎమోషనల్‌గా ఉండకుండ ఇంకేలా మాట్లాడతారు?" అంటూ కృతి ఎమోషనల్‌ అవుతుంది. ఇక ట్రైలర్‌ చివరిలో "ఎంత ప్రేమ పెంచుకున్న దగ్గర అవ్వగలం కానీ, సొంతం అవ్వలేం కదా" అని కృతి చెప్పే డైలాగ్‌ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటుంది. ఇక మధ్య మధ్యలో శర్వానంద్‌ ప్రాక్టికల్‌ డైలాగ్స్‌ నవ్విస్తున్నాయి. పిల్లాడికి మందులు వేయాలని చెప్పడం.. 10 ఎమ్‌ఎల్‌ ఉంది.. నీకు సరిపోతుందా అని పిల్లాడితో సరదాగా శర్వానంద్‌ మాట్లాడే డైలాగ్‌తో ట్రైలర్‌ ముగుస్తుంది. మొత్తానికి రెండు నిమిషాల పదిహేను సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌ లవ్‌ అండ్ ఎమోషనల్‌గా సాగుతూ అద్యాంతం ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం ట్రైలర్‌ మూవీపై మరింత ఆసక్తి పెంచుతుంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget