Shanmukh Jaswanth Marriage : సైలెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్ వివాహం - తిరుమల సన్నిధిలో కొత్త జంట
Shanmukh Jaswanth Wedding : ఫేమస్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. రాజమండ్రికి చెందిన వైష్ణవిని ఆయన వివాహం చేసుకున్నారు.

Shanmukh Jaswanth Wedding With Vaishnavi In Tirumala : ఫేమస్ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం, యంగ్ హీరో షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజమండ్రికి చెందిన వైష్ణవి చోడిశెట్టితో తిరుమలలో ఆయన వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య వీరి వివాహ వేడుక వైభవంగా సాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట... ఇప్పుడు సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కారు.
అయితే, కొద్ది రోజుల క్రితం వైష్ణవితో కలిసి గృహ ప్రవేశం చేయడంతో ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం సాగింది. కానీ, తాజాగా తిరుమలలో పెళ్లి చేసుకున్న ఫోటోస్, వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, పలువురు సెలబ్రిటీలు కొత్త జంటకు విషెష్ చెబుతున్నారు. కొత్త జంట చూడ ముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Happy Married Life Shannu❤️❤️
— Swaasthi (@swaasthi_) June 22, 2026
అప్పట్లో మనోడికి lady fan following మామూలుగా ఉండేది కాదు ..
Finally married
Happy for him pic.twitter.com/7tBtwIdxxJ
Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 21 మూవీస్ - తెలుగులో మూవీస్ డోంట్ మిస్
విశాఖకు చెందిన షణ్ముఖ్ జస్వంత్ తొలుత యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ ఫేమ్‌తో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లో హీరోగా కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. వైవా షార్ట్ ఫిల్మ్‌తో పాటు సాఫ్ట్‌వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్‌లతో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ షోలో రన్నరప్‌గా నిలిచాడు. హౌస్‌లోకి వెళ్లే ముందే దీప్తి సునయనతో ప్రేమలో పడ్డాడు.
హౌస్‌లోకి వెళ్లిన తర్వాత ఆయన వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత దీప్తితో బ్రేకప్ అయ్యింది. నిజానికి ఈ షో తర్వాత తాను ఎంతో మానసిక వేదన అనుభవించినట్లు గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. షణ్ముఖ్ లీలా వినోదం మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైంది. ప్రస్తుత ప్రేమకు నమస్కారం అనే మూవీలో హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాలో ఉల్కా గుప్తా హీరోయిన్‌గా చేస్తుండగా... శివాజీ, భూమిక చావ్లా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వి. భీమశంకర్ దర్శకత్వం వహిస్తుండగా... ఏబీ సినిమాస్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై సినిమా నిర్మిస్తున్నారు.
Also Read : Sai Durgha Tej : సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు























