అన్వేషించండి

Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?

Vijay Varma On Casting Couch: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మకు కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదురు అయ్యాయి. స్వయంగా ఆయన ఆ విషయాన్ని బయట పెట్టారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు విజయ్ వర్మ కెరీర్ తొలినాళ్లలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు.
  • హైదరాబాద్‌లో మోడలింగ్ సమయంలో ఓ కో-ఆర్డినేటర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
  • ఆ వేధింపులు ఎదురైనా, విజయ్ నటనను విడిచిపెట్టకుండా ముందుకెళ్లారు.
  • FTIIలో శిక్షణ పొంది, ప్రస్తుతం పలు విజయవంతమైన చిత్రాలు చేస్తున్నారు.

నటుడు విజయ్ వర్మ (Vijay Varma) తెలుసుగా... నేచురల్ స్టార్ నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి - ఎంసీఏ'లో విలన్ రోల్ చేశారు. హిందీలో 'గల్లీ బాయ్స్', 'డార్లింగ్స్' వంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన నటనకు అభిమానులు ఉన్నారు. హిట్ సినిమాలతో పాటు తమన్నా భాటియాతో కొన్నాళ్ళు రిలేషన్షిప్‌లో ఉండటం వల్ల హెడ్ లైన్స్‌లో నిలిచారు. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ మీద ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లైంగిక వేధింపుల బారిన పడిన నటీనటుల్లో తాను కూడా ఉన్న విషయాన్ని విజయ్ వర్మ బయట పెట్టారు.

మోడల్ కో ఆర్డినేటర్ ఏం చేశాడంటే?
నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు, మరీ ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ వర్మ సంచలన విషయాలను బయట పెట్టారు. తన ప్రయాణం ఏమీ అంత సులభంగా సాగలేదని, ఎన్నో అవమానాలు - తిరస్కరణలను ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన వివరించారు.

హైదరాబాద్‌లో మోడలింగ్ రంగంలో ప్రవేశించడానికి ప్రయత్నించిన సమయంలో ఓ మోడల్ కో ఆర్డినేటర్ తనతో వింతగా ప్రవర్తించాడని విజయ్ వర్మ పేర్కొన్నారు. ఆ వ్యక్తి తనను అసభ్యంగా తాకడానికి ప్రయత్నించడంతో పాటు అన్ కంఫర్టబుల్ అయ్యేలా చేశాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ మోడల్ కో ఆర్డినేటర్ ప్రవర్తన పట్ల విసుగు చెంది 'బ్రో... ఏంటిది? ఏం చేస్తున్నావు?' అని నిలదీసినట్లు చెప్పారు. అదీ సంగతి. 

Also Read: Akanksha Choudhary On Casting Couch - డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం

కెరీర్ ప్రారంభంలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ వేధింపులు నిరాశకు గురి చేశాయని, తాను నిరుత్సాహపడ్డానని విజయ్ వర్మ తెలిపారు. అటువంటి అడ్డంకులు కొన్ని ఎదురైనప్పటికీ... నటనపై ఇష్టాన్ని వదులుకోకుండా, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగినట్టు పేర్కొన్నారు. తన దృష్టి అంతటినీ పూర్తిగా నటనపై మళ్ళించినట్టు చెప్పారు.

Also ReadNandamuri Deepika JanakiRam - నా నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు

హైదరాబాద్‌లోని సూత్రధార్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ తనకు సీటు ఇవ్వలేదని విజయ్ వర్మ తెలిపారు. ఆ తర్వాత పుణేలోని 'ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా'కు అప్లై చేశానని... అక్కడ మొదటి ప్రయత్నంలో సీటు రాలేదని, రెండో ప్రయత్నంలో అడ్మిషన్ వచ్చిందని వివరించారు. రాజ్‌ కుమార్ రావు, జైదీప్ అహ్లావత్ తదితరులతో కలిసి ఆయన నటనలో శిక్షణ పొందారు విజయ్. ఇటీవల నసీరుద్దీన్ షా, ఫాతిమా సనా షేక్‌తో కలిసి 'గుస్తాఖ్ ఇష్క్'లో నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన 'మట్కా కింగ్' సిరీస్‌లో గ్యాంబ్లింగ్ డాన్ పాత్రలో కనిపించారు.

Also ReadSorry Hrithik Trend - Kangana Ranaut Reaction: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?

Frequently Asked Questions

నటుడు విజయ్ వర్మ కాస్టింగ్ కౌచ్ గురించి ఏమి వెల్లడించారు?

నటుడిగా కెరీర్ ప్రారంభంలో లైంగిక వేధింపులకు గురయ్యానని విజయ్ వర్మ తెలిపారు. హైదరాబాద్‌లోని ఓ మోడల్ కోఆర్డినేటర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవాలు నిరాశపరిచినా, నటనపై దృష్టి సారించి ముందుకు సాగారు.

విజయ్ వర్మ నటన పాఠశాలలో చేరడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

హైదరాబాద్‌లోని సూత్రధార్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్ తనకు సీటు ఇవ్వలేదని విజయ్ వర్మ తెలిపారు. ఆ తర్వాత పుణేలోని FTIIలో మొదటి ప్రయత్నంలో సీటు రాలేదని, రెండో ప్రయత్నంలో అడ్మిషన్ వచ్చిందని వివరించారు.

విజయ్ వర్మ నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు లేదా సిరీస్‌లు ఏవి?

విజయ్ వర్మ నాని 'మిడిల్ క్లాస్ అబ్బాయి - ఎంసీఏ'లో విలన్‌గా నటించారు. హిందీలో 'గల్లీ బాయ్స్', 'డార్లింగ్స్' ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇటీవల 'గుస్తాఖ్ ఇష్క్' మరియు 'మట్కా కింగ్' సిరీస్‌లో కనిపించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
Yellamma Update : యంగ్ రెట్రో లుక్‌లో మన పర్సి - దేవిశ్రీకి ఎల్లమ్మ టీం స్పెషల్ గిఫ్ట్
యంగ్ రెట్రో లుక్‌లో మన పర్సి - దేవిశ్రీకి ఎల్లమ్మ టీం స్పెషల్ గిఫ్ట్
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Embed widget