రియాలిటీ షో 'లాక్ అప్'లో ఆకాంక్షా చౌదరి అందాల పోటీల్లో జరిగే చీకటి కోణాలను, తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించారు. ఈ సంఘటనను చెబుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
Casting Couch: డబ్బులు అడిగితే లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Akanksha Choudhary On Casting Couch: 'లాక్ అప్: సచ్ యా సజా' రియాలిటీ షోలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు కంటెస్టెంట్, మోడల్ ఆకాంక్షా చౌదరి.

- ఆకాంక్షా చౌదరి రియాలిటీ షోలో కాస్టింగ్ కౌచ్ అనుభవాలను వెల్లడించింది.
- ఆర్థిక సహాయం కోసం జడ్జి లైంగిక కోరికలు కోరాడు.
- తిరస్కరించగా, ఆయన పరిశ్రమలో విజయం అసాధ్యమని అవమానించాడు.
- ఆకాంక్ష ప్రలోభాలకు లొంగకుండా కష్టార్జితంతో విజయం సాధించింది.
హిందీ రియాలిటీ షో 'లాక్ అప్: సచ్ యా సజా' (Lock Upp: Sach Ya Sazaa)లో అందాల పోటీల్లో జరిగే చీకటి కోణాలను, తనకు ఎదురైన బ్యాడ్ కాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్‌ను బయట పెట్టారు ఆ షోలో కంటెస్టెంట్, మోడల్ ఆకాంక్షా చౌదరి (Akanksha Chaudhary). తన జీవితంలోని దిగ్భ్రాంతికరమైన విషయాన్ని చెబుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
ఇంటికి పిలిచి లైంగిక కోర్కెలు తీర్చమని...
ఆకాంక్షా చౌదరి అందాల పోటీలో పాల్గొన్నారు. ఓసారి బ్యూటీ పెజెంట్ కోసం ప్రిపేర్ కావడానికి అవసరమైన ట్రైనింగ్, కాస్ట్యూమ్స్ కోసం లక్ష నుంచి రెండు లక్షల వరకు అవసరం అయ్యాయి. అప్పట్లో ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి చూస్తే... అంత డబ్బులు ఇచ్చేట్టు కనిపించలేదు. అంతకు ముందు ఓ అందాల పోటీలో జడ్జిగా వ్యవహరించిన పెద్ద మనిషిని సాయం కోరితే... తన లైంగిక కోరికలు తీర్చమని అడిగినట్లు 24 ఏళ్ల ఆకాంక్షా చౌదరి ఆరోపించారు. 'లాక్ అప్' షో నుండి ఎలిమినేట్ కావడానికి ముందు కాస్టింగ్ కౌచ్ ఎక్స్‌పీరియన్స్ పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read: Nandamuri Deepika JanakiRam - నా నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
తాను ఇంజనీరింగ్ పూర్తి చేశానని, ఒకట్రెండు లక్షలు అప్పుగా ఇస్తే తీర్చడానికి ఆయన దగ్గర ఏదైనా ఉద్యోగం చేస్తానని చెబితే... సదరు పెద్ద మనిషి డబ్బులు తీసుకోవడానికి ఇంటికి పిలిచాడట. తీరా ఇంటికి వెళ్ళాక... ''ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను అసభ్యంగా తాకాడు. తనతో శృంగారంలో పాల్గొంటే ఆర్థిక సహాయం చేస్తానని డైరెక్టుగా చెప్పాడు. అంతే కాదు... నెలకు ఐదారు సార్లు తనతో గడపాలని అతను ఓ ప్లాన్ ప్రిపేర్ చేశాడు. నేను నో చెబితే... 'ఇండస్ట్రీలో ఈ టైపు పనులు చేయకుండా ఎవరూ సక్సెస్ కాలేరు' అని నన్ను అవమానించాడు. అతని మాటలకు నేను లొంగలేదు'' అని ఆకాంక్షా చౌదరి చెప్పారు.
కాస్టింగ్ కౌచ్ వంటి వాటికీ లొంగకుండా తన కష్టార్జితంతో ఆరు నెలల తర్వాత మరో పెద్ద షోలో అవకాశం దక్కించుకున్నానని, ఇవాళ ఇంత పెద్ద వేదికపై నిలబడ్డానని ఆకాంక్షా చౌదరి గర్వంతో చెప్పారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా నిలబడిన ఆమెను షో హోస్ట్‌లు ఫరా ఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ ప్రశంసించారు. ఆమె మాటలు ఇతర అమ్మాయిలకు ధైర్యాన్ని ఇస్తాయని పేర్కొన్నారు.
Also Read: Samantha Baby Bump Photoshoot Latest - బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Frequently Asked Questions
ఆకాంక్షా చౌదరి ఏ విషయాన్ని బయటపెట్టారు?
ఆకాంక్షా చౌదరి ఆర్థిక సహాయం ఎందుకు కోరారు?
బ్యూటీ పెజెంట్ కోసం ట్రైనింగ్, కాస్ట్యూమ్స్ కోసం ఆమెకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు అవసరమయ్యాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఆమె సాయం కోరారు.
ఆకాంక్షా చౌదరిని అసభ్యంగా కోరిన వ్యక్తి ఎవరు?
గతంలో ఒక అందాల పోటీలో న్యాయమూర్తిగా వ్యవహరించిన ఒక పెద్ద మనిషి ఆమెను ఆర్థిక సహాయం పేరుతో లైంగికంగా వేధించారు. అతను ఆమెను ఇంటికి పిలిచి తన కోరికలు తీర్చమని అడిగాడు.
కాస్టింగ్ కౌచ్ డిమాండ్‌పై ఆకాంక్షా చౌదరి ఎలా స్పందించారు?
ఆకాంక్షా చౌదరి ఆ వ్యక్తి లైంగిక కోరికలను తిరస్కరించారు. అతని ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా నిలబడ్డారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















