అన్వేషించండి

Sai Durgha Tej : సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్

Sambarala Yetigattu : సంబరాల ఏటిగట్టు మూవీ రిలీజ్ ఆలస్యం కావడంపై సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ రియాక్ట్ అయ్యారు. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా కావాలంటే కాస్త టైం పడుతుందని అన్నారు.

Sai Durgha Tej Reaction On Sambarala Yetigattu Delay : విరూపాక్ష తర్వాత సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ చాలా గ్యాప్ తీసుకున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో 'సంబరాల ఏటిగట్టు'తో సరికొత్తగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ గ్లింప్స్ తర్వాత సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. సినిమా రిలీజ్ ఆలస్యం కావడంపై సోషల్ మీడియాలో రూమర్స్ నడుస్తుండగా... తాజాగా వాటికి సాయి తేజ్ చెక్ పెట్టారు. ఎందుకు డిలే అవుతుందో వివరించారు.

అదే రీజన్

ప్రస్తుతం ఆడియన్స్ ఓటీటీల్లో మూవీస్, వెబ్ సిరీస్‌లు చూసిన నాలెడ్జ్ పెంచేసుకున్నారని అన్నారు సాయి తేజ్. 'అన్నీ జానర్లలోనూ కంటెంట్ గురించి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నా. ఆడియన్స్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. అందుకే నా సినిమాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నా. ప్రేక్షకులను మెప్పించాలంటే కథల ఎంపికలో అత్యంత అలర్ట్‌గా వ్యవహరించక తప్పదు. అందుకే కాస్త టైం పడుతుంది. సంబరాల ఏటిగట్టు కోసం నా సర్వస్వం ధారపోస్తూ శాయశక్తులా శ్రమిస్తున్నాం.' అని అన్నారు. హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. సంబరాల ఏటిగట్టు మూవీకి రోహిత్ కెపి దర్శకత్వం వహించారు. 

Also Read : Maa Inti Bangaram Collecions Day 3 : మా ఇంటి బంగారం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - నార్త్ అమెరికాలో సమంత అరుదైన రికార్డ్

లాస్ట్ 20 మినిట్స్..

హనుమాన్ 3D మూవీ గురించి సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ... 'కొత్త టెక్నాలజీతో మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని హనుమాన్ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 25న అందరూ థియేటర్లకు వచ్చి చూడండి. ఈ మూవీ లాస్ట్ 20 మినిట్స్ నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆయన్ను మళ్లీ ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ ఈ మూవీ ఇస్తుంది. అందరికీ ఆల్ ది బెస్ట్.' అని అన్నారు.

అది నా అదృష్టం

ప్రొడ్యూసర్స్ నిరంజన్, చైతన్య ఎంతో కష్టపడి హనుమాన్ 3D మూవీని సిద్ధం చేశారని హీరో తేజ సజ్జ తెలిపారు. 'నేను కూడా థియేటర్లో మూవీ చూసేందుకు ఆసక్తిగా ఉన్నా. ఈ టీమ్‌ను మళ్లీ కలవడం ఓ రీయూనియన్‌లా అనిపించింది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి సినిమా దొరకదు. అలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం, హీరోగా ఆడియన్స్ ప్రేమాభిమానాలు పొందడం నా అదృష్టం. ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. అందరూ తప్పకుండా థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేయండి.' అని అన్నారు. దాదాపు 600 మంది టెక్నీషియన్స్ 3 నెలలు శ్రమించి, 3D వెర్షన్‌ను అద్భుతంగా రెడీ చేశారని ప్రొడ్యూసర్స్ తెలిపారు.

Also Read : OG Sequel Update : OG సీక్వెల్ బిగ్ అప్డేట్ - పవన్ కల్యాణ్ సార్... స్టోరీ ఎలా ఉంటుందంటే?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mr Perfect Case: 'దిల్' రాజుకు ఊరట... 'మిస్టర్ పర్ఫెక్ట్' కాపీరైట్ కేసు అప్డేట్ ఏమిటంటే?
'దిల్' రాజుకు ఊరట... 'మిస్టర్ పర్ఫెక్ట్' కాపీరైట్ కేసు అప్డేట్ ఏమిటంటే?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం - ఆస్తులు వేలం వేసి చెల్లింపులు - ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలరా?
Karthika Deepam 2 Serial Today August 13th: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ ఎవరిది? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్ కోసం బిగ్ ఫైట్? మాలిని 5 లక్షలు ఆఫర్! జ్యోత్స్న నిర్ణయమేంటి?
Embed widget