Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kattalan OTT Platform : మలయాళ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ కాటాలన్ ఓటీటీలోకి వచ్సేస్తోంది. మే 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

Antony Varghese's Kattalan OTT Release Date Locked : మలయాళ యాక్షన్ థ్రిల్లర్స్‌కు తెలుగులోనూ సూపర్ క్రేజ్ ఉంది. రీసెంట్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన పాన్ ఇండియా మూవీ కాటాలన్ (Kattalan). మే 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూసిన సినీ అభిమానుల వెయిటింగ్‌కు చెక్ పడింది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'కాటాలన్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'మనోరమ మ్యాక్స్' (Manorama Max) సొంతం చేసుకోగా ఆగస్ట్ 4 (మంగళవారం) మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మలయాళ స్టార్ ఆంటోని వర్గీస్ హీరోగా నటించగా... టాలీవుడ్ హీరో సునీల్ కీలకపాత్ర పోషించారు.
ఈ మూవీతో పాల్ జార్జ్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వగా... దుషారా విజయన్, సిద్ధిఖీ, కబీర్ దుషాన్ సింగ్, అన్సోస్ పాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 'మార్కో' ఫేం షరీఫ్ ముహమ్మద్ ఈ మూవీని నిర్మించగా... కేజీఎఫ్, సలార్, డ్రాగన్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు.
స్టోరీ ఏంటంటే?
కేరళ అడవుల్లో ఏనుగులను చంపి దంతాల స్మగ్లింగ్‌తో ఓ అండర్ వరల్డ్ మాఫియానే సృష్టిస్తాడు మారి (సునీల్). అక్కడే అటవీ ప్రాంతంలో నివసించే కొన్ని కుటుంబాలను బానిసలుగా చేసుకుని వాళ్లతోనే ఏనుగులను వేటాడి దంతాలను స్మగ్లింగ్ చేయిస్తుంటాడు. అటు, మారిని తప్పించి అతని స్థానంలోకి రావాలని ప్రయత్నాలు సాగిస్తుంటాడు ఎడ్డీ (కబీర్ దుషాన్ సింగ్). రూ.25 కోట్లు విలువైన ఏనుగు దంతాలను మారి అడవి దాటిస్తున్నాడని తెలుసుకుని, తన సోదరుడు ఎస్పీ హరి శంకర్ నారాయణన్ (నెల్సన్ నాడర్)తో కలిసి దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుంటాడు ఎడ్డీ.
ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన మారి తిరిగి తన సరుకును దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇందు కోసం సమర్థుడైన ఆంటోని (ఆంటోని వర్గీస్)ను రంగంలోకి దింపుతాడు. మరి అంత విలువైన సరుకును ఆంటోని ఎలా తిరిగి తెచ్చాడు? మారి గ్యాంగ్‌లో చేరిన తర్వాత ఎడ్డీ గ్యాంగ్ నుంచి ఆంటోని కుటుంబానికి ఎదురైన సవాళ్లేంటి? ఆంటోని మారికే ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























