నాగార్జున 100వ సినిమా 'కింగ్ 100'కు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం వెల్లడించారు.
Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
King 100 Music Director: నాగార్జునకు 'మాస్', 'మన్మథుడు', 'కింగ్' వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది.

- నాగార్జున 100వ చిత్రం 'కింగ్ 100'కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం.
- డీఎస్పీ పుట్టినరోజున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ విషయాన్ని ప్రకటించింది.
- మాస్, మన్మథుడు వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ఈ కలయిక.
- టబు నటిస్తుండగా, రా కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం.
కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వాళ్ళిద్దరి కలయికలో 'మాస్', 'మన్మథుడు', 'కింగ్' వంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి వాళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. తన కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీకి దేవి శ్రీని ఎంపిక చేసుకున్నారు నాగార్జున.
'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్!
Nagarjuna 100th Movie Music Director: ప్రస్తుతం తన 100వ సినిమా 'కింగ్ 100' చేస్తున్నారు నాగార్జున. ఆ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇవాళ డీఎస్పీ పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాన్ని వెల్లడించారు. దేవికి బర్త్ డే విషెస్ చెబుతూ అన్నపూర్ణ స్టూడియోస్ ఓ పోస్టర్ విడుదల చేసింది.
ఇటీవల నటుడిగా నాగార్జునకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి ఎంతో గౌరవం తీసుకు వచ్చిన 'కుబేర'కు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేశారు. మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుండటం, అందులోనూ నాగార్జున వందో సినిమా 'కింగ్ 100' కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.
View this post on Instagram
'కింగ్ 100' చిత్రానికి సంబంధించిన విషయాలను చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారు. ఈ సినిమాలో టబు కూడా నటిస్తున్నారు. నాగార్జునతో ఆమెది హిట్ పెయిర్ అని చెప్పాలి. అంతే కాకుండా వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. రా కార్తీక్ దర్శకత్వంలో 'కింగ్ 100' తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మిస్తున్నారు.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Frequently Asked Questions
నాగార్జున 100వ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు?
'కింగ్ 100' చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరు?
'కింగ్ 100' చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్నారు.
'కింగ్ 100' సినిమాలో టబు నటిస్తుందా?
అవును, 'కింగ్ 100' సినిమాలో టబు నటిస్తున్నారు. ఆమె నాగార్జునతో హిట్ పెయిర్, అలాగే వారిద్దరూ మంచి స్నేహితులు.
నాగార్జున, దేవి శ్రీ ప్రసాద్ గతంలో కలిసి చేసిన కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు ఏమిటి?
నాగార్జున, దేవి శ్రీ ప్రసాద్ గతంలో 'మాస్', 'మన్మథుడు', 'కింగ్' వంటి విజయవంతమైన చిత్రాలకు కలిసి పనిచేశారు. 'కుబేర'కు కూడా డీఎస్పీ మ్యూజిక్ అందించారు.
ట్రెండింగ్ వార్తలు






















