అన్వేషించండి

Sekhar Kammula: ‘కుబేర’లో ఆ నటుడు ఆశ్చర్యపరిచాడు... ‘లీడర్ 2’ ఉంటుంది... దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన ఆసక్తికర విషయాలివే

Sekhar Kammula: ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా కాకుండా ‘కుబేర’ సినిమాలో నటించిన ఓ నటుడు నన్నెంతో ఆశ్చర్యపరిచాడని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆ నటుడు ఎవరు? ఎలా ఆశ్చర్యపరిచాడో.. ఆయన మాటల్లోనే..

Sekhar Kammula Interview: ‘‘ఈ మధ్యకాలంలో చాలా కథలు సినిమాలుగా వస్తున్నాయి కానీ, ‘కుబేర’ వంటి ఒక కథ నేను చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కథ డెఫినెట్‌గా చెప్పబడాలి. ఈ కథ అందరిలో అవేర్నెస్‌ని తీసుకొస్తుంది’’ అని అన్నారు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన తారాగణంగా నటించిన పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLP బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. 

‘‘ ఈ ‘కుబేర’ తీయడానికి మోటివేషన్ అంటూ ఏం లేదు. కానీ, కథ సిద్ధం చేసే ముందు ఒక ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది. సూపర్ రిచ్ ప్రపంచం, అట్టడుగున ఉండే ప్రపంచం.. బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. ఇదే నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. నిజానికి ఇది కథగా చెప్పడం, తెరపై చూపించడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్, సున్నితమైన పాయింట్ కూడా. ఒక చిన్న కథగా రాయడం మొదలు పెడితే.. అది చాలా పెద్దగా, ఫైనల్‌గా ఒక ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంది. ‘నాకేమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్.. ప్రపంచంలో అన్ని కావాలనుకునే ఒక బిలినియర్.. వారి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎలా ఉంటుందనేదే ‘కుబేర’లో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇలాంటి ఒక కథ నేను చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది.

ఈ సినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనే షూట్ చేశాం. కథపరంగా ఎలాంటి మార్పు ఉండదు కానీ లెంత్‌లో మాత్రం ఒక నిమిషం తేడా వుంటుంది. లిప్ సింక్ పరంగా ప్రతీది విడివిడిగా తీశాం. టెక్నికల్‌గా చెప్పాలంటే రెండు సినిమాలు తీసినట్లే. అందుకే చిత్రీకరణకు చాలా సమయం పట్టింది. నిజానికి నా మీద ఒక మార్క్ పడింది. కానీ ఆ మార్కు కోసం నేనెప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అది మాత్రమే చేశాను. ‘కుబేర’ ఒక డిఫరెంట్ సినిమా. నేను ఏ సినిమా తీసినా హానెస్ట్‌గానే చేస్తాను. అది ఈ సినిమాలో పదింతలు కనిపిస్తుంది. ఇది ఐడియాలాజికల్ బ్యాటిల్ ఉండే సినిమా కాదు. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి ఒక రెండు ప్రపంచాలు ఉన్నాయనే అవేర్నెస్ మాత్రం వస్తుంది. ‘కుబేర’కు పార్ట్ 2 ఉండదు.

‘లీడర్’ సినిమా చాలా నిజాయితీగా చెప్పిన కథ. అందులో లవ్ స్టోరీ పెట్టాలి, మంచి పాటలు పెట్టాలని అనుకోలేదు. ‘హ్యాపీ డేస్’లో కూడా అంతే. కాలేజ్ స్టోరీ అంటే కాల్ స్టోరీ లాగే ఉండాలని తీశాను. అందుకే అందరికీ నచ్చింది. కుబేర కూడా అంతే. ఈ కథకు కావలసింది చేశాను. మార్క్ అనేది కథ ప్రకారం, ఆ కథను చెప్పే విధానంతో ముడిపడి ఉంటుంది. ‘కుబేర’ చూసినప్పుడు ఇలాంటి కథని ఇలా చేశారా అనే వావ్ ఫ్యాక్టర్ ఆడియన్స్‌లో ఉంటుంది. అందుకే ముందుగానే ఈ కంటెంట్ ఏంటనేది ట్రైలర్, టీజర్‌లో క్లియర్‌గా చెప్పాను. రిచ్, పూర్ మధ్య జరిగే కథని ముందుగానే చెప్పేశాం. ఇంత పెద్ద స్టార్ కాస్ట్, పెద్ద బడ్జెట్ నిర్మాతల వల్లే సాధ్యమైంది. నేను ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చి, అద్భుతంగా సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో ఛాలెంజింగ్ అనిపించింది ముంబై షూట్. చాలా డిఫికల్ట్.. అక్కడ అనుమతులు రావు, అన్నీ షరతులే. ముంబై వాళ్లే వేరే ప్రదేశాల్లో షూట్ చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ షూట్ చేయడం అనేది నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. కానీ కథ పరంగా ముంబైలో తప్పనిసరిగా షూట్ చేయాల్సి వచ్చింది.

Also Readపవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?

కొన్ని షేడ్స్ ఉన్న పాత్రలు నాగార్జున సార్ చేస్తే బాగుంటుంది. ఈ పాత్రకి ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. ఇందులో చాలా వైవిధ్యమైన పాత్రలో ఆయనని చూపించడం జరిగింది. ఆయన్ని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ‘మనం, ఊపిరి’ ఇలా చాలా చిత్రాల్లో ఆయన డిఫరెంట్ వేరియేషన్ ఉన్న పాత్రలు చేస్తున్నారు. రష్మిక గురించి చెప్పాలంటే, తనకి మంచి అవకాశం వస్తే నెక్స్ట్ లెవెల్‌లో నటించే హీరోయిన్ తను. ధనుష్ చేసిన పాత్రని ఆయన తప్పితే ఎవరూ చేయలేరు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ఇదే చెబుతారు. ధనుష్ అద్భుతమైన నటుడు. ఇంకా చెప్పాలంటే, అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ అనేది చిన్న మాట అవుతుంది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. జిమ్ షర్బ్ నన్ను సర్‌ప్రైజ్ చేశారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా నేర్చుకుని చెప్పేవారు. ఒక్క లైన్ మిస్ కాకుండా, చాలా పర్ఫెక్ట్‌గా చెప్పేవారు. ఈ సినిమా తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వస్తాయి. దేవిశ్రీ ప్రసాద్‌తో జర్నీ సూపర్‌గా ఉంది. కమర్షియల్‌గా ఆయన కింగ్. ‘కుబేర’కి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది. హై ఇచ్చే చాలా మూమెంట్స్ వున్నాయి. ఈ సినిమాకు ఆయనొక పిల్లర్‌గా నిలబడ్డారు.

‘లీడర్’కి సీక్వల్ చేయండని అందరూ అడుగుతున్నారు. నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను. కథ విషయంలో నాకో క్లారిటీ ఉంది, కానీ ‘లీడర్’ తీసినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులన్నీ మారిపోయాయి. దేశం, అలాగే ప్రజల్లో చాలా మార్పులు వచ్చేశాయి. థింకింగ్ కూడా మారిపోయింది. దాన్ని సరిగ్గా పట్టుకుని కథపై కూర్చోవాలి. ‘కుబేర’ తర్వాత పాన్ ఇండియా సినిమానే చేయాలనేం లేదు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా చేయాలని చేసింది కాదు. కథలోనే ఒరిజినల్‌గా ట్రూ పాన్ ఇండియా ఎక్స్పీరియన్స్ ఉంది. దేశం మొత్తానికి రిలేట్ అయ్యే కథ. నిజానికి పాన్ ఇండియా సినిమా చేయడం చాలా కష్టం. పాటలు డబ్బింగ్, లిరిక్స్ ఇవన్నీ చూసుకోవడం సామాన్యమైన విషయం కాదు. నెక్స్ట్ నానితో ఓ సినిమా అనుకున్నాం కానీ, అంత సాలిడ్‌గా అనుకోలేదు. కొంచెం టైమ పడుతుంది.

నా 25 ఇయర్స్ సినీ జర్నీ చూసుకుంటే చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఫస్ట్ సినిమా తీశాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేశాను. ఈ జర్నీలో ప్రేక్షకులు ఎంతో ప్రేమని ఇచ్చారు. నాపై ఒక నమ్మకాన్ని ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నాను. ఇదే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. నా సినిమాల్ని ఆదరించి, అప్రిషియేట్ చేసి ఆడియన్స్ నాకో స్థాయిని ఇచ్చారు. ఇంతకంటే నేను ఏం కోరుకోను. వారికెప్పుడూ నేను రుణపడి ఉంటాను’’ అని చెప్పుకొచ్చారు.

Also Readపవన్ సన్నిహితులే టార్గెట్... జగన్ కోసం సినిమా ఇండస్ట్రీనీ వదల్లేదు..‌. ఆ సెలబ్రిటీలు ఫోన్ ట్యాపింగ్ బాధితులే!?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?

వీడియోలు

Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్
పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra 22 A Lands : ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
ఏపీ ప్రజలకు నూతన సంవత్సర కానుక - 22A నిషేధిత జాబితా నుండి 5 రకాల భూముల తొలగింపు
Cigarette Price: ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్ ధరలు ఎంత పెరుగుతాయి? రూ.75 నిజమేనా?
Telangana Student Died: జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
జర్మనీలో తెలంగాణ విద్యార్థి హృతిక్ రెడ్డి మృతి- న్యూ ఇయర్ రోజున కుటుంబంలో విషాదం!
Iran Crisis : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్ - ఇరాన్‌లో రోడ్డెక్కిన ప్రజలు - ఆయిల్ రిచ్ కంట్రీలో ఏం జరుగుతోంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
Haq OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
నెట్‌ఫ్లిక్స్‌లో 'హక్' స్ట్రీమింగ్... మహిళల హక్కులపై కోర్ట్ రూమ్ డ్రామా... దీని స్పెషాలిటీ ఏమిటంటే?
New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
Eluru Crime News: ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
ఏలూరులో ప్రేమిస్తే సీన్‌ రిపీట్‌- ఇంటి ఆడపిల్లలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై దాడి!
Embed widget