అన్వేషించండి

Pawan Kalyan: పవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?

Pawan Kalyan Upcoming Movies: పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది థియేటర్లలోకి రెండు సినిమాలు రానున్నాయి. ఆ రెండిటికీ సోలో రిలీజ్ దక్కడం లేదు. ఈ విషయంలో ఛాంబర్ ఎందుకు మౌనంగా ఉంటుందనేది పవన్ ఫ్యాన్స్ ప్రశ్న.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ కావడం గ్యారెంటీ. వచ్చే నెలలో 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) విడుదలకు రెడీ అవుతోంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.‌‌ ఆ‌ తర్వాత 'ఓజీ' (OG Movie) రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ 25న ఆ సినిమా థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉంది. ఈ రెండు సినిమాలకు సోలో రిలీజ్ దక్కడం లేదు. ఆయా సినిమాలతో పాటు వేరే సినిమాలు కూడా సేమ్ రిలీజ్ డేట్‌కి థియేటర్లలోకి వస్తున్నాయి. మరి, ఈ విషయంలో ఛాంబర్ ఎందుకు మౌనంగా ఉంటుందనేది పవన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కొంత మంది సంధిస్తున్న ప్రశ్న. 

వీరమల్లుతో కింగ్‌డమ్...
ఓజీతో అఖండ తాండవం!
Hari Hara Veera Mallu New Release Date: జూలై 25న 'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. కానీ ఆ రోజు థియేటర్లలోకి రావడం గ్యారెంటీ. అందులో మరో సందేహం లేదు. జూలై 25న విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూస్ చేసిన 'కింగ్‌డమ్' విడుదలకు రెడీ అవుతోంది.

Hari Hara Veera Mallu Vs Kingdom: ప్రస్తుతానికి 'కింగ్‌డమ్' విడుదల జూలై 4న! అయితే ఇంకా సినిమా షూటింగ్ కొంత పెండింగ్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ కావడానికి కొంత సమయం అవసరం. అందుకని విడుదల వాయిదా వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఓటీటీ రైట్స్ తీసుకున్న నెట్‌ఫ్లిక్స్ జూలై 4న కాకపోతే జూలై 25న విడుదల చేయమని కండిషన్ పెడుతోంది. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. దానికి పోటీగా విజయ్ దేవరకొండ సినిమా విడుదల చేయించాలనేది వాళ్ల ప్లాన్.

OG Movie Vs Akhanda 2: విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 25న 'ఓజీ' విడుదల కానుంది. అదే రోజున గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ‌ హీరోగా నటించిన 'అఖండ 2 తాండవం' కూడా విడుదలకు రెడీ అవుతుంది. సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు వచ్చినప్పటికీ... బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌లో సెప్టెంబర్ 25న రిలీజ్ అని కన్ఫర్మ్ చేశారు. 

రెండు భారీ సినిమాలు వస్తుంటే...
ఛాంబర్ ఎందుకు మౌనంగా ఉంటోంది?
ఫెస్టివల్ సీజన్ ఉన్నప్పుడు రెండేసి భారీ సినిమాలో థియేటర్లలో రావడం ఇటీవల మొదలు అయ్యింది. సంక్రాంతికి లేదంటే క్రిస్మస్ సమయంలో మాత్రమే అది సహజంగా జరుగుతుంది. మిగతా రోజుల్లో రెండు భారీ సినిమాలు ఒకే రోజు రావడం వల్ల డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఎగ్జిబిటర్లు లాస్ అవుతారని, అందుకని మినిమం ఒక్క వారం అయినా సరే గ్యాప్ ఉండేలా చూసుకోవాలని గతంలో ఛాంబర్ చెప్పింది. మరి, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటోంది? అని ఇండస్ట్రీలో కొందరు ఆఫ్ ది రికార్డ్ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి, క్రిస్మస్ సీజన్లలోనూ రిలీజ్ డేట్స్ మధ్య రెండు మూడు రోజులు గ్యాప్ ఉండేలా చూస్తున్నారు. ఇక్కడ సేమ్ డే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దాంతో క్లాష్ తప్పడం లేదు. 

Also Readమహేష్ బాబు కుర్చీ మడత పెడితే... ప్రభాస్ జాతిని?

ఫిలిం ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ సెక్టార్లలో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు ఛాంబర్ పదవుల్లో ఉన్నారు. వాళ్ల సినిమాలు వచ్చినప్పుడు తమకు అనుకూలంగా అటువంటి (వారం గ్యాప్) రూల్స్ తీసుకు వస్తున్నారని, మిగతా సినిమాలు వచ్చినప్పుడు తమకు పట్టనట్టు మౌనంగా ఉంటున్నారని గుసగుసలు వినపడుతున్నాయి.

డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వాట్సాప్ గ్రూపులో వీరమల్లకు వ్యతిరేకంగా కొందరు చేసిన మెసేజ్‌లు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లాయని 'బన్నీ' వాసు చెప్పారు. ఆ వివాదంలో పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ తర్వాత వీరమలకు వ్యతిరేకంగా పావులు కలిపిన వ్యక్తులు సైలెంట్ కావడం తెలిసిన విషయాలే. ఇప్పుడు సోలో రిలీజ్ దక్కకుండా చేయడం వెనకాల వాళ్ల హస్తం ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీకి సాయం అందించాలని పవన్ చూస్తుంటే ఆయన సినిమాలకు వ్యతిరేకంగా కొందరు పావులు కలపడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం.

Also Readసీక్రెట్‌గా ఉంచాల్సిన విషయాన్ని చెప్పేసిన నాగార్జున - రజనీకాంత్ 'కూలీ' టీమ్ ఏం చేస్తుందో?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
Embed widget