Nagarjuna: సీక్రెట్‌గా ఉంచాల్సిన విషయాన్ని చెప్పేసిన నాగార్జున - రజనీకాంత్ 'కూలీ' టీమ్ ఏం చేస్తుందో?
Coolie Update: సినిమా రిలీజ్ వరకు కొన్ని విషయాలను సీక్రెట్‌గా ఉంచడం అవసరం. అయితే కింగ్ నాగార్జున ప్రతిదీ ఓపెన్‌గా చెబుతారు. కూలి విషయంలోనూ అలా ఒక అప్డేట్ బయట పెట్టారు.

కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) దగ్గర అందర్ బహర్ లాంటి వ్యవహారాలు ఉండవు. లోపల ఒకటి బయట ఒకటి చెప్పడం వంటివి అసలు ఉండదు. ప్రతిదీ ఓపెన్. అయితే సినిమా రిలీజ్ వరకు కొన్ని విషయాలను సీక్రెట్‌గా ఉంచడం అవసరం. అటువంటి విషయాలను సైతం నాగార్జున బయట పెట్టేస్తున్నారు. ఇప్పుడు కూలీ టీం ఏం చేస్తుందో మరి?
అవును... కూలీలో విలన్ నేనే
'కూలి' సినిమాలో తాను విలన్ క్యారెక్టర్ చేసినట్టు నాగార్జున కన్ఫర్మ్ చేశారు. దర్శకుడు లోకేష్ కనకరాజు ఒక రోజు తన దగ్గరకు వచ్చాడని, విలన్ క్యారెక్టర్ చేయడానికి మీకు ఏమైనా అభ్యంతరమా? అని అడిగాడని, ఒకవేళ చేసే ఉద్దేశం లేకపోతే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగి వెళ్ళిపోతానని చెప్పాడని నాగార్జున వివరించారు.
విలన్ క్యారెక్టర్ కోసం తనను లోకేష్ కనకరాజ్ సంప్రదించినప్పుడు 'నో' చెప్పలేదని, విలన్ క్యారెక్టర్లు చేయడానికి తనకు అభ్యంతరం ఏమీ లేదని, ముందు కథ ఏమిటో చెప్పమని అడిగానని నాగార్జున పేర్కొన్నారు. లోకేష్ కనకరాజ్ కథ చెప్పడం సగం పూర్తి అయ్యేసరికి తనకు నచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఆ తరువాత ఆరేడు సార్లు మళ్లీ మళ్లీ లోకేష్ కనకరాజ్ కథ వివరించాడని తెలిపారు. 'కూలీ' సినిమాలో తాను పోషించిన సైమన్ క్యారెక్టర్ కొన్నేళ్ల పాటు గుర్తుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read: ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' నచ్చింది... గ్యాంగ్‌స్టర్ కామెడీని రీమేక్ చేయాలనుకున్న విష్ణు మంచు! కానీ...
#LokeshKanagaraj: Do you mind playing antagonist role in #Coolie, if not we can have cup of tea & I'll leave😀#Nagarjuna: Tell me the script, I'm not against negative role. Halfway through the script i got hooked🤯. 6-7 times done Re-Narration & liked🔥pic.twitter.com/W5VP73Zhr3
— AmuthaBharathi (@CinemaWithAB) June 16, 2025
"I asked #Lokesh do people behave like it, he said 'Yes, People are Evil'😂. The way i treat women changed in #Coolie. Even it's antagonist role, all said I'm charming by Lokesh presentation🛐. From #Kubera & #Coolie, i became better actor🥰"
— AmuthaBharathi (@CinemaWithAB) June 16, 2025
- #Nagarjunapic.twitter.com/mwtPlhE24i
రికార్డుల కోసం ఆలోచించడం లేదు!
తాను రికార్డుల కోసం ఆలోచించడం లేదని నాగార్జున స్పష్టం చేశారు. బాక్సాఫీస్ నెంబర్స్ ఆటలో తాను ఎప్పుడూ ఇరుక్కోలేదని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వెయ్యి కోట్ల క్లబ్ గురించి మాట్లాడుతున్నారని, ఇంకో రెండు మూడేళ్లు ఆగితే 2000 క్లబ్ వస్తుందని నాగార్జున పేర్కొన్నారు. గతంలో తన పేరు మీద బోలెడు రికార్డులు ఉండేవని, ఆ తర్వాత వాటిని కొందరు బ్రేక్ చేశారని, ఇప్పుడు తాను రికార్డుల కోసం ఆలోచించడం లేదని, నెక్స్ట్ డిఫరెంట్‌గా ఏం చేయబోతున్నామనేది ఆలోచిస్తానని తెలిపారు.





















