Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి విడుదల చేసిన టీజర్ - సీత లేని గుడిని మూసేయండి
Seetha Kalyana Vaibhogame Movie Teaser: తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేతుల మీదుగా 'సీతా కళ్యాణ వైభోగమే' టీజర్ విడుదల అయ్యింది.
సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా నటించిన సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే' (Seetha Kalyana Vaibhogame Movie). ఈ చిత్రానికి సతీష్ పరమవేద దర్శకుడు. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ప్రొడ్యూస్ చేశారు. ఈ నెల (ఏప్రిల్) 26న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా సినిమా టీజర్ విడుదల చేశారు.
సినిమా విజయం సాధించాలి: కోమటిరెడ్డి
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) చేతుల మీదుగా 'సీతా కళ్యాణ వైభోగమే' టీజర్ విడుదల అయ్యింది. ఈ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించడంతో పాటు టీజర్ చక్కగా ఉందని తమను కోమటిరెడ్డి ఆశీర్వదించినట్టు చిత్రబృందం తెలిపింది. ''టీజర్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకున్నారు'' అని కోమటిరెడ్డి వెంకట రెడ్డి చెప్పారు.
Also Read: కాండ్రకోట మిస్టరీపై సినిమా - 'నింద' ఎవరిది? ఎవరిపై?
సీత కోసం మోడ్రన్ రామ రావణ యుద్ధం!
Seetha Kalyana Vaibhogame Teaser Review: 'సీతా కళ్యాణ వైభోగమే'లో సీత పాత్రలో హీరోయిన్ గరీమా చౌహన్ నటించారు. ఆమె కోసం రావణుడి లాంటి ప్రతినాయకుడితో పోరాటం చేసే యువకుడిగా, మోడ్రన్ రాముడిగా హీరో సుమన్ తేజ్ కనిపించారు.
టీజర్ ప్రారంభంలో 'నల్ల నల్ల నీళ్లలోనా తెల్లని చేప...' అంటూ నేపథ్యంలో ఓ గీతం వినిపించింది. అప్పుడు గుడిలో హీరో హీరోయిన్లను చూపించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య లిప్ లాక్, గోవాలో పాట చూపించి మోడ్రన్ పెయిర్ అని హింట్ ఇచ్చారు. ఆ తర్వాత విలన్ రోల్ చేసిన గగన్ విహారి ఎంట్రీ. తాంబూలాలు మార్చుకున్న సీన్లు వచ్చాయి.
Also Rea: సన్నీ లియోన్ హారర్ సినిమా - ప్రేక్షకుల్ని భయపెట్టేలా 'మందిర'
'సీతకు ఆ రావణుడు అంటే ఇష్టం లేదు. మా రాముడు అంటేనే ఇష్టం' అని నటుడు శివాజీ రాజా చెప్పే డైలాగ్ వింటే... ఆయన హీరో తండ్రి క్యారెక్టర్ చేసినట్టు అర్థం అవుతోంది. 'నా పెళ్లాం లేచిపోయింది... సీత నాది' అంటూ విలన్ చెప్పిన డైలాగ్ వింటే... అతడినితో పెళ్లికి ముందు హీరోతో కలిసి హీరోయిన్ లేచిపోయినట్టు అర్థం అవుతోంది. 'సీతమ్మ లేని గుడి రాముడి గుడే కాదు... గుడిని మూసేయండి', 'సీత ఎప్పటికీ రాముడిదే' వంటి డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి.
Also Read: 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవానికి అతిథిగా 'టిల్లు స్క్వేర్' - సేమ్ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ...
సుమన్ తేజ్, గరీమా చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సీతా కళ్యాణ వైభోగమే' సినిమాలో గగన్ విహారి విలన్ రోల్ చేశారు. ఇంకా నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమెరా: పరుశురామ్, ఎడిటింగ్: డి. వెంకట ప్రభు, నృత్య దర్శకత్వం: భాను మాస్టర్ - పోలకి విజయ్, నిర్మాణం: రాచాల యుగంధర్, దర్శకత్వం: సతీష్ పరమవేద.