Kandrakota Mystery: కాండ్రకోట మిస్టరీపై సినిమా - 'నింద' ఎవరిది? ఎవరిపై?
Ninda is Varun Sandesh's new movie as the main lead: వరుణ్ సందేశ్ హీరోగా వాస్తవ సంఘటనల ఆధారంగా, కాండ్రకోట మిస్టరీ నేపథ్యంలో 'నింద' సినిమా రూపొందుతోంది.
Telugu Movie Based On Kandrakota Mystery: కాండ్రకోటలో ఏం జరుగుతోంది? గోదావరి జిల్లాలోని పెద్దాపురం మండలంలో గల ఊరిలో నిజంగా దెయ్యం ఉందా? అక్కడి ప్రజలను ఆత్మలు భయపెట్టాయా? తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన సంఘటన ప్రజలకు తెలిసే ఉంటుంది. కాండ్రకోటలో దెయ్యం మిస్టరీగా మిగిలింది. ఏబీపీ దేశం అక్కడి గ్రౌండ్ రిపోర్ట్ ప్రజలకు అందించింది. ఇప్పుడు ఆ మిస్టరీ మీద తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది.
వరుణ్ సందేశ్ హీరోగా కాండ్రకోట మిస్టరీపై సినిమా!
'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలతో ఒకప్పుడు హీరోగా వరుస విజయాలు తన ఖాతాలో వేసుకున్న వరుణ్ సందేశ్ (Varun Sandesh), ఇప్పుడు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నారు. 'మైఖేల్', 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' సినిమాల్లో కీలక పాత్రలు చేశారు. కొంత విరామం తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న సినిమా 'నింద'. ఏ కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక.
Also Read: సన్నీ లియోన్ హారర్ సినిమా - ప్రేక్షకుల్ని భయపెట్టేలా 'మందిర'
రాజేష్ జగన్నాథం స్వీయ దర్శకనిర్మాణంలో...
'నింద' చిత్రానికి రాజేష్ జగన్నాథం (Rajesh Jagannadham) దర్శకుడు. కథ, కథనం అందించడంతో పాటు దర్శకత్వం వహించడం కాదు... ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. అది చూస్తే... పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా ఉంది. రాత్రి వేళలో గుడిసెను చూపించడంతో పాటు కత్తి పట్టుకుని దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి న్యాయదేవత విగ్రహాన్ని చూపించారు. ఈ టైటిల్ పోస్టర్ క్యూరియాసిటీ కలిగించింది.
Also Read: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
ఇటీవల సినిమా ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులకు 'నింద' చిత్రాన్ని ప్రత్యేకంగా చూపించారు. మంచి కాన్సెప్టుతో చిత్రాన్ని తెరకెక్కించారని దర్శక నిర్మాతలను ప్రశంసించారు. త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు రాజేష్ జగన్నాథం తెలిపారు.
Also Read: 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవానికి అతిథిగా 'టిల్లు స్క్వేర్' - సేమ్ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ...
Ninda Movie Cast And Crew: వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న 'నింద' సినిమాలో 'బేబీ' ఆనీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, 'ఛత్రపతి' శేఖర్, 'మైమ్' మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: అనిల్ కుమార్, ఛాయాగ్రహణం: రమీజ్ నవీత్, సంగీతం: సంతు ఓంకార్, నిర్మాణ సంస్థ: ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్, రచన - నిర్మాణం - దర్శకత్వం: రాజేష్ జగన్నాథం.
మై డియర్ దొంగ రివ్యూ....@ahavideoINలో కొత్త సినిమా...
— ABP Desam (@ABPDesam) April 19, 2024
అభినవ్ గోమఠం, శాలినీ కొండెపూడి సినిమా ఎలా ఉందంటే?#AnAhaOriginalFilm #MyDearDongaOnAha #AnAhaOriginalFilm @AbhinavGomatam#shalinikondepudi #DivyaSripada #MyDearDongaOnAha #nikhilgajula #MovieReviewhttps://t.co/SlSfcrkiEN