News
News
వీడియోలు ఆటలు
X

Sarath Babu Health: కోలుకోవడానికి కొంచెం టైమ్ పడుతుంది - శరత్ బాబు లేటెస్ట్ హెల్త్ అప్డేట్

Sarath Babu Health Condition, Latest Update : సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన సోదరుని కుమారుడు ఆయుష్ తేజస్ అప్డేట్ ఇచ్చారు.

FOLLOW US: 
Share:

సీనియర్ నటుడు శరత్ బాబు (Sarath Babu)కు ఇప్పుడు ఎలా ఉంది? ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటి? కోలుకుంటున్నారా? లేదా? ప్రజల్లో ఎన్నో సందేహాలు! వీటికి కారణం బుధవారం రాత్రి సోషల్ మీడియాలో నడిచిన అసత్య ప్రచారాలే! శరత్ బాబు మరణించారని చాలా మంది ట్వీట్లు చేసి, ఆ తర్వాత డిలీట్ చేశారు. దాంతో ఆయన ఆరోగ్యం గురించి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. వాళ్ళకు ఓ గుడ్ న్యూస్!

కోలుకోవడానికి కొంచెం టైమ్ పడుతుంది
''శరత్ బాబు గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన బావున్నారు. దయచేసి ఎలాంటి పుకార్లనూ నమ్మవద్దు. ఫేక్ రూమర్స్‌ను ఫాలో అవ్వకండి. శరత్ బాబు గారు కోలుకోవడానికి కొంచెం సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేసిన, ఆశీర్వదించిన అభిమానులు అందరికీ థాంక్స్'' అని శరత్ బాబు సోదరుని కుమారుడు ఆయుష్ తేజస్ గురువారం ఉదయం మీడియాకు తెలిపారు. శరత్ బాబును రూముకు షిఫ్ట్ చేశారని బుధవారం రాత్రి ఆయన సోదరి పేర్కొన్న సంగతి తెలిసిందే.  

బెంగళూరులో ఉన్న శరత్ బాబు అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాదులోని ఏఐజీ (Asian Institute Of Gastroenterology Hyderabad)లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. అయితే, అనూహ్యంగా బుధవారం రాత్రి ఆయన చనిపోయారనే ప్రచారం మొదలైంది.

Also Read : 'పలాస' దర్శకుడితో వరుణ్ తేజ్ సినిమా - పీరియడ్ క్రైమ్ డ్రామా!

View this post on Instagram
 
A post shared by ABP Desam (@abpdesam)

శరత్ బాబును చంపేసిన కమల్ హాసన్, ఖుష్భు
నిజంగా శరత్ బాబు మరణించారని కాసేపు ప్రేక్షకులు సైతం సంతాపం వ్యక్తం చేశారు. అందుకు కారణం... సెలబ్రిటీలే! ''శరత్ బాబు గారి మరణం అత్యంత బాధాకరమైనది'' అంటూ భారతీయ జనతా పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) బుధవారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం కూడా ప్రకటించారు. 

Kamal Haasan pays tribute to Sarath Babu : శరత్ బాబు మరణించలేదని, జీవించి ఉన్నారనే అసలు నిజం తెలుసుకుని ట్వీట్ డిలీట్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. సీనియర్ హీరోయిన్, నటి ఖుష్భు కూడా అంతే! లోక నాయకుడు కమల్ హాసన్ సైతం శరత్ బాబు మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తర్వాత తమ తప్పు తెలుసుకున్న స్టార్లు ట్వీట్స్ డిలీట్ చేశారు. ఈ విధంగా చేసిన నెటిజనులు కూడా కొందరు ఉన్నారు. 

వ్యూస్ కోసం ఒక సెక్షన్ ఆఫ్ యూట్యూబ్ ఛానళ్లు గతంలో బతికున్న సినిమా స్టార్లు, సెలబ్రిటీలను చంపేశాయి. ఇప్పుడు అరకొర సమాచారం, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లు చూసి, అది నిజమని నమ్మి సెలబ్రిటీలు సైతం ట్వీట్లు చేస్తున్నారు. దాంతో ప్రేక్షకులు గందరగోళానికి గురి అవుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న సెలబ్రిటీ కుటుంబ సభ్యులు, బంధువులు బాధ పడుతున్నారు. ఏమీ కాలేదంటూ ఖండన ప్రకటనలు ఇస్తున్నారు. 

Also Read డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!

శరత్ బాబు మరణించారని పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఆయన సోదరి స్పందించారు. ''సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పే! అన్నయ్య కొంచెం రికవరీ అయ్యారు. ఆయన్ను రూమ్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకుంటారు. మీడియాతో మాట్లాడుతారని ఆశిస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని పేర్కొన్నారు.

Published at : 04 May 2023 01:17 PM (IST) Tags: Sarath Babu Sarath Babu Health Update Sarath Babu health condition Aayush Tejas

సంబంధిత కథనాలు

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా

Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా

Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?

Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్

Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్

Filmfare Awards: ఆ అవార్డులను వాష్ రూమ్ హ్యాండిల్‌గా వాడతా - ‘ఫిల్మ్‌ఫేర్’పై నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు

Filmfare Awards: ఆ అవార్డులను వాష్ రూమ్ హ్యాండిల్‌గా వాడతా - ‘ఫిల్మ్‌ఫేర్’పై నటుడు నసీరుద్దీన్ షా వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్