By: ABP Desam | Updated at : 04 May 2023 12:29 PM (IST)
వరుణ్ తేజ్, దర్శకుడు కరుణ్ కుమార్
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) రూటే సపరేటు! కంటెంట్ బేస్డ్ కథల కోసం ఆయన చూస్తూ ఉంటారు. తనను తాను ఓ ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా చూసుకునే కథానాయకుడు. ఇప్పుడు ఆయన మరో కొత్త కథకు ఓకే చెప్పారని తెలిసింది. పీరియడ్ క్రైమ్ డ్రామా చేయనున్నారు.
'పలాస' కరుణ కుమార్ దర్శకత్వంలో...
'పలాస 1978' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar). తొలి చిత్రంతో చిత్రసీమతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. అవకాశం రావాలే గానీ మన మట్టి కథలను తెరకెక్కించే దర్శకులు తెలుగులో కూడా ఉన్నారని నిరూపించారు. హార్డ్ హిట్టింగ్ రియాలిటీ సినిమాగా 'పలాస' పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సుధీర్ బాబు హీరోగా 'శ్రీదేవి సోడా సెంటర్' తీశారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కథానాయకుడిగా సినిమా చేసే అవకాశాన్ని కరుణ కుమార్ అందుకున్నారని తెలిసింది.
విశాఖ నేపథ్యం...
జూదం ప్రధానాంశం!
Varun Tej Karuna Kumar Movie Backdrop : విశాఖ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, కరుణ కుమార్ సినిమా ఉంటుందని తెలిసింది. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో... 80, 90ల కాలంలో సాగే కథను కరుణ కుమార్ రెడీ చేశారట. స్క్రిప్ట్ కోసం ఆయన చాలా రీసెర్చ్ చేశారని తెలిసింది. ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. క్యారెక్టర్ కోసం ఆయన మేకోవర్ కూడా కానున్నారట. కథ విన్న తర్వాత చాలా ఎగ్జైట్ అయ్యారని కూడా తెలిసింది.
నిర్మాతలు ఎవరంటే?
వరుణ్ తేజ్, కరుణ కుమార్ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది. ప్రస్తుతం నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నది ఈ సంస్థే. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాధారణంగా కరుణ కుమార్ సినిమాల్లో తెలుగు నటీనటులకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఈ సినిమాలోనూ వీలైనంత మంది తెలుగు తారలను తీసుకోనున్నారు.
Also Read : శరత్ బాబును చంపేసిన సెలబ్రిటీలు - సోషల్ మీడియాలో అంతే!
ప్రస్తుతం వరుణ్ తేజ్ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవదారి అర్జున'. మరొకటి... ఏవియేషన్ థ్రిల్లర్. దానిని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం బుడాపెస్ట్ సిటీలో ప్రవీణ్ సత్తారు యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ చేస్తున్నారు వరుణ్ తేజ్. జూన్ నెలాఖరుకు హైదరాబాద్ వస్తారట.
జీవీ ప్రకాష్ సంగీతం?
రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా టైమ్ ఉండటంతో ప్రస్తుతం కరుణ కుమార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద దృష్టి పెట్టారని తెలిసింది. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆయనతో చర్చలు సాగిస్తున్నారు. 'శ్రీదేవి సోడా సెంటర్' తర్వాత ఆహా ఓటీటీలో విడుదలైన 'మెట్రో కథలు' యాంథాలజీ, 'కళాపురం' సినిమా తీశారు కరుణ కుమార్.
Also Read : డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!
Navya Swamy: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి
Rangabali Teaser: ‘మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ - నాగశౌర్య ‘రంగబలి’ టీజర్ అదిరిపోయిందిగా
మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
Dhoomam Telugu Trailer : ధూమం - నా పేరు ముఖేష్ యాడ్ అందరూ చూసేలా చేస్తే?
Tamanna: చేతిలో మందు గ్లాస్, బీచ్‌లో డ్యాన్స్ - బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్న తమన్నా, వీడియో వైరల్
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం
Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు
YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్