Game Changer - Sarangapani Jathakam: 'గేమ్ చేంజర్' రిలీజ్ డేట్‌కు 'సారంగపాణి జాతకం' - ముందుగా కర్చీఫ్ వేసిన ప్రియదర్శి
Sarangapani Jathakam Release Date: క్రిస్మస్ బరిలో వస్తుందనుకున్న 'గేమ్ చేంజర్' సంక్రాంతికి వెళ్లింది. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ సినిమా విడుదల తేదీకి ప్రియదర్శి తన సినిమాను తీసుకొస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేయం చేంజర్ సినిమా సంక్రాంతికి వెళ్ళింది. దాంతో క్రిస్మస్ సీజన్ ఖాళీ అయ్యింది. ఆ ఫెస్టివల్ హాలిడేస్ యుటిలైజ్ చేసుకోవాలని కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. అయితే... అందరి కంటే ముందుగా 'గేమ్ చేంజర్' రిలీజ్ డేట్ మీద 'సారంగపాణి జాతకం' కర్చీఫ్ వేసింది.
డిసెంబర్ 20న 'సారంగపాణి జాతకం' విడుదల
Sarangapani Jathakam Release Date: 'గేమ్ చేంజర్' సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు సంక్రాంతికి వాయిదా వేశారు. ఆ ప్రకటన వచ్చిన కొన్ని గంటలకు 'డిసెంబర్ 20న తమ సినిమాను విడుదల చేస్తున్నాం' అని 'సారంగపాణి జాతకం' నిర్మాత నుంచి ప్రకటన వచ్చింది. దీంతో పాటు నితిన్ 'రాబిన్ హుడ్' సినిమా రిలీజ్ డేట్ కూడా సేమ్.
The date is set to decide his fate 🖐
— Sridevi Movies (@SrideviMovieOff) October 12, 2024
A Killer Comedy #SarangapaniJathakam releasing Worldwide on December 20th 💥#MohanaKrishnaIndraganti @krishnasivalenk@PriyadarshiPN @RoopaKoduvayur @ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore #AvasaralaSrinivas @harshachemudu… pic.twitter.com/rEKHoGNJqA
'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' వంటి రెండు సూపర్ హిట్స్ తర్వాత దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా 'సారంగపాణి జాతకం'. ఇందులో ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda) హీరో. ఆయనకు జంటగా తెలుగు అమ్మాయి రూప కొడువాయూర్ నటించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రజెంట్ డబ్బింగ్ వర్క్స్ ఫైనల్ స్టేజిలో ఉందని, ఫస్ట్ కాపీ కూడా త్వరలో రెడీ అవుతుందని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.
విడుదల తేదీని వెల్లడించిన సందర్భంగా చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... ''మా 'సారంగపాణి జాతకం' చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేస్తున్నాం. అతి త్వరలో సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసి క్రిస్మస్ సెలవుల్లో ప్రేక్షకులకు వినోదం అందించడానికి వస్తున్నాం. ఇటీవల ఫుల్ రష్ చూశా. నేను సినిమా పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఓ మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా? లేదంటే అతను చేసే చేతల్లో ఉంటుందా? అనేది చెప్పే చిత్రమిది. జంధ్యాల గారి తరహాలో మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమా తీశారు'' అని చెప్పారు.
Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?
ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన 'సారంగపాణి జాతకం'లో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష (హర్ష చెముడు), తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్, ఛాయాగ్రహణం: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన - దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.