అన్వేషించండి

Divya Khossla slams Jigra: థియేటర్లు ఖాళీ, అలియా టికెట్స్ కొని ఫేక్ కలెక్షన్స్ చెబుతోంది - 'జిగ్రా' బాగోతం బయటపెట్టిన నిర్మాత భార్య

Jigra Box Office Collection: 'జిగ్రా' కలెక్షన్స్ గురించి నిర్మాతలు చెబుతున్నవి అన్నీ అబద్ధాలు యేనా? ఆలియా భట్ టికెట్లు కొని ఫేక్ కలెక్షన్స్ అనౌన్స్ చేస్తుందా? తన సినిమా హిట్ అని చెబుతోందా?

అభిమానుల మధ్య కలెక్షన్స్ గురించి మాటలు యుద్ధం జరుగుతూ ఉంటుంది. తమ అభిమాన హీరో సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని... అయితే ప్రత్యర్థి హీరో నిర్మాతలు ఫేక్ కలెక్షన్స్ ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో జరిగే వార్స్ అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. అయితే ఓ సినిమా మీద మరొక నటి, అగ్ర నిర్మాత భార్య ఫేక్ కలెక్షన్స్ అనే విమర్శ చేస్తే? అది పెద్ద విషయమే. ఇప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీలో అటువంటి విమర్శ చేశారొకరు.

'జిగ్రా' థియేటర్లలో జనాలు లేరు... కలెక్షన్ అంతా ఫేక్!
'జిగ్రా' (Jigra) థియేటర్లలో జనాలు లేరు అని, అలియా భట్ (Alia Bhatt) దగ్గర నిజంగా ధైర్యం ఎక్కువ అని సొంత డబ్బులు పెట్టి టికెట్లు కొని ఫేక్ కలెక్షన్స్ ప్రచారం చేస్తుందని దివ్య ఖోస్లా కుమార్ (Divya Khossla Kumar) సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

దివ్య ఖోస్లా కుమార్... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు.‌ కానీ, ఆవిడ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భార్య. భూషణ్ భార్యగా మాత్రమే కాదు, నటిగా కూడా దివ్య పాపులర్. దాంతో ఇంస్టాగ్రామ్ స్టోరీలో 'జిగ్రా' సినిమా మీద ఆవిడ చేసిన విమర్శలు హిందీ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

Divya Khossla slams Jigra: థియేటర్లు ఖాళీ, అలియా టికెట్స్ కొని ఫేక్ కలెక్షన్స్ చెబుతోంది - 'జిగ్రా' బాగోతం బయటపెట్టిన నిర్మాత భార్య

Divya Khossla Kumar Instagram Story: ఇంతకీ దివ్య ఖోస్లా కుమార్ అసలు ఏమన్నారు? అనే విషయంలోకి వెళ్తే... ''నేను జిగ్రా సినిమా చూడడం కోసం సిటీ మాల్ లో గల పివిఆర్ స్క్రీన్ కు వెళ్లా. థియేటర్ అంతా ఖాళీగా ఉంది.‌ ఈ థియేటర్ ఒక్కటే కాదు... ప్రతి చోట 'జిగ్రా' థియేటర్లలో జనాలు లేరు. అలియా భట్ కు నిజంగా ధైర్యం ఎక్కువ. ఆ అమ్మాయి టికెట్లు కొని ఫేక్ కలెక్షన్స్ అనౌన్స్ చేస్తుంది. ఈ విషయంలో పెయిడ్ మీడియా ఎందుకు మౌనంగా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు'' అని ఆవిడ పేర్కొన్నారు.

Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?


దివ్య నటించిన 'సావి' సినిమాకు 'జిగ్రా' కాపీనా?
హాలీవుడ్ సినిమా 'ఎనీ థింగ్ ఫర్ హర్' ఆధారంగా హిందీలో 'సావి' అని ఓ సినిమా రూపొందింది. ఈ ఏడాది మే 31 విడుదల అయిన ఆ సినిమా ఇంచు మించు 17 కోట్ల రూపాయలు వసూలు చేసిందని బాలీవుడ్ టాక్. ఆ సినిమా కథను కాపీ చేసి అలియా భట్ 'జిగ్రా' సినిమా తీశారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కలెక్షన్స్ గురించి దివ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విచిత్రం ఏమిటంటే... దివ్య ప్రధాన పాత్రలో నటించిన 'సావి' సినిమా నిర్మాతలలో ఆలియా భట్ బాబాయ్ ముఖేష్ భట్ ఒకరు. 'జిగ్రా' సినిమా నిర్మాతలలో అలియా ఒకరు.‌

Also Read: మహేష్ దర్శకత్వంలో రామ్ 22వ సినిమా... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన మైత్రి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tragedy Incidents: పండుగ పూట తీవ్ర విషాదాలు - వేర్వేరు ఘటనల్లో 14 మంది మృతి
పండుగ పూట తీవ్ర విషాదాలు - వేర్వేరు ఘటనల్లో 14 మంది మృతి
Revanth Reddy : సొంత ఊరు దశ మార్చేసిన రేవంత్ రెడ్డి - ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారంటే ?
సొంత ఊరు దశ మార్చేసిన రేవంత్ రెడ్డి - ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారంటే ?
Harihara Veeramallu: స్పెషల్ పోస్టర్‌తో ‘హరిహర వీరమల్లు’ ట్రీట్ - ఫస్ట్ సింగిల్ పాడింది ఎవరో మైండ్ బ్లాకే!
స్పెషల్ పోస్టర్‌తో ‘హరిహర వీరమల్లు’ ట్రీట్ - ఫస్ట్ సింగిల్ పాడింది ఎవరో మైండ్ బ్లాకే!
Vijayawada News: రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజువల్ వండర్‌గా విశ్వంభర, టీజర్‌లో ఇవి గమనించారా?Chakrasnanam in Tirumala: తిరుమల శ్రీవారికి చక్రస్నానం, చూసి తరించండిGame Changer Movie: రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగంచెల్లాచెదురైన భాగమతి ఎక్స్‌ప్రెస్, భయంకరంగా డ్రోన్ విజువల్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy Incidents: పండుగ పూట తీవ్ర విషాదాలు - వేర్వేరు ఘటనల్లో 14 మంది మృతి
పండుగ పూట తీవ్ర విషాదాలు - వేర్వేరు ఘటనల్లో 14 మంది మృతి
Revanth Reddy : సొంత ఊరు దశ మార్చేసిన రేవంత్ రెడ్డి - ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారంటే ?
సొంత ఊరు దశ మార్చేసిన రేవంత్ రెడ్డి - ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టారంటే ?
Harihara Veeramallu: స్పెషల్ పోస్టర్‌తో ‘హరిహర వీరమల్లు’ ట్రీట్ - ఫస్ట్ సింగిల్ పాడింది ఎవరో మైండ్ బ్లాకే!
స్పెషల్ పోస్టర్‌తో ‘హరిహర వీరమల్లు’ ట్రీట్ - ఫస్ట్ సింగిల్ పాడింది ఎవరో మైండ్ బ్లాకే!
Vijayawada News: రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
Uttar Pradesh Maha Kumbh Mela : మహా కుంభమేళాకు సిద్దమవుతున్న ప్రయాగరాజ్‌ - భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న యూపీ ప్రభుత్వం
మహా కుంభమేళాకు సిద్దమవుతున్న ప్రయాగరాజ్‌ - భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న యూపీ ప్రభుత్వం
Unstoppable With NBK Season 4: ‘అన్‌స్టాపబుల్‌’తో పండుగ తెస్తున్న బాలయ్య - ఎప్పట్నుంచి స్టార్ట్ అవుతుంది?
‘అన్‌స్టాపబుల్‌’తో పండుగ తెస్తున్న బాలయ్య - ఎప్పట్నుంచి స్టార్ట్ అవుతుంది?
Train Accident: సిగ్నల్, మార్గం మధ్య మిస్‌మ్యాచ్ వల్లే! - తమిళనాడు రైలు ప్రమాదానికి అదే కారణమా?, విచారణకు రైల్వే శాఖ ఆదేశం
సిగ్నల్, మార్గం మధ్య మిస్‌మ్యాచ్ వల్లే! - తమిళనాడు రైలు ప్రమాదానికి అదే కారణమా?, విచారణకు రైల్వే శాఖ ఆదేశం
Rishabh Pant: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్
Embed widget