Sarangapani Jathakam Movie: జంధ్యాల... 'సారంగపాణి జాతకం'... ఇంద్రగంటి... ఆ లోటు భర్తీ!
Priyadarshi New Movie: ప్రియదర్శి కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకం మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న 'సారంగపాణి జాతకం' చిత్రీకరణ పూర్తయింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జంధ్యాల ఓ చరిత్ర. ఆయన రచనకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) భావించారు. కానీ, కుదరలేదు. ఇప్పుడు ఆ లోటు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'సారంగపాణి జాతకం' సినిమా (Sarangapani Jathakam Movie)తో తీరుతుందని చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
సారంగపాణి జాతకం... గుమ్మడికాయ కొట్టేశారు
ప్రియదర్శి (Priyadarshi Pulikonda) కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా సినిమా 'సారంగపాణి జాతకం'. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహన కృష్ణ ఇంద్రగంటి (Mohana Krishna Indraganti), శివలెంక కృష్ణ ప్రసాద్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఇందులో రూప కొడువాయూర్ (Roopa Koduvayur) కథానాయిక. ఈ రోజుతో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు.
ఆ విధంగా... షూటింగ్ సంపూర్ణం ✨
— Sridevi Movies (@SrideviMovieOff) September 9, 2024
It's a Wrap for the shoot of #SarangapaniJathakam 🖐🔍#MohanKrishnaIndraganti @krishnasivalenk @PriyadarshiPN @RoopaKoduvayur @ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore #AvasaralaSrinivas @harshachemudu @pgvinda #VivekSagar… pic.twitter.com/QJOgOTEvvc
ఈ నెల 12 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు
'సారంగపాణి జాతకం' గురించి చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... ''మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా? లేదంటే సదరు వ్యక్తి చేసే పనుల్లో ఉంటుందా? - ఈ ప్రశ్నకు జవాబు ఇచ్చే చక్కటి వినోదాత్మక చిత్రం మా 'సారంగపాణి జాతకం'. చిత్రీకరణ పూర్తి చేశాం. ఈ నెల 12 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెడతాం. మా సంస్థలో జంధ్యాల గారి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నా కుదరలేదు. 'చిన్నోడు - పెద్దోడు', 'ఆదిత్య 369'కు ఆయనతో మాటలు రాయించుకున్నాను. కానీ, ఆయన దర్శకత్వంలో సినిమా చేయించుకోలేకపోయా. ఆ లోటు మోహనకృష్ణ ఇంద్రగంటితో చేస్తున్న ఈ సినిమాతో భర్తీ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. కుటుంబమంతా చూసే చక్కటి హాస్యభరిత చిత్రమిది. నిర్మాణ పరంగా, సాంకేతిక విలువల్లో ఎక్కడా రాజీ పడటం లేదు'' అని చెప్పారు.
Also Read: 'దేవర' ముంగిట కార్తీ, అరవింద్ స్వామి - సేమ్ రిలీజ్ డేట్‌కు తమిళ సినిమా 'సత్యం సుందరం'
ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటిస్తున్న 'సారంగపాణి జాతకం'లో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, హర్ష చెముడు, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, 'ఐమ్యాక్స్' వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్, ఛాయాగ్రహణం: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన - దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
Also Read: నయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!