Kannappa : పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిపించిన ఆటవిక కిరాత... 'కన్నప్ప' నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్
Mohanlal Look : ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు ఇంకా సద్దుమణగలేదు. మరోవైపు మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్ట్ ను 'కన్నప్ప' నుంచి నుంచి మోహన్ లాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Mohan Lal Kannappa Look : మంచు కుటుంబం నిర్మిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు మంచు మోహన్ బాబు నిర్మాత కాగా, మంచు విష్ణు ఇందులో హీరోగా నటిస్తున్నాడు. హిస్టారికల్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అగ్రతారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
'కిరాత'గా లాలెట్టన్
ఇప్పటికే ఈ సినిమా నుంచి మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు పలువురు ప్రముఖుల ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేశారు. తాజాగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది 'కన్నప్ప' టీం. ఈ సినిమాలో లాలెట్టన్ 'కిరాత' అనే పవర్ ఫుల్ పాత్రను పోషించబోతున్నట్టుగా తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో వెల్లడించారు. ఆ పోస్టర్ పై "పాశుపతాస్త్ర ప్రదాత ! విజయుడిని గెలిచిన ఆటవిక కిరాత" అని రాసి, మోహన్ లాల్ పాత్ర ఇందులో ఎలా ఉండబోతుందో వెల్లడించారు. భయంకరమైన గిరిజన అవతారంలో మోహన్ లాల్ కనిపిస్తుండగా, ఆయన పాత్రలో దైవత్వం, గొప్పతనం రెండూ ఉంటాయని మేకర్స్ రాసుకొచ్చారు. ఇక ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
The wait is over! 🌟 Behold the stunning full look of Lalettan, The Legend, Shri @Mohanlal, as 'Kirata' in #Kannappa🏹. ✨ His dedication and brilliance illuminate this sacred tale of valor and devotion to life.
— Kannappa The Movie (@kannappamovie) December 16, 2024
Feel the divinity and grandeur unfold! #HarHarMahadevॐ… pic.twitter.com/hysfoIuwYw
ప్రభాస్ లుక్ లీక్... 'కన్నప్ప' టీం హెచ్చరిక
రీసెంట్ గా ఈ సినిమా సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన 'కన్నప్ప' టీం ప్రభాస్ లుక్ ను లీక్ చేసిన వారిని పట్టిస్తే రూ.5 లక్షలు బహుమతిగా ఇస్తామని మంచు విష్ణు టీం ప్రకటించింది. ఇందులో ప్రభాస్ నంది పాత్రలో కనిపిస్తున్నారు. ఇక 'కన్నప్ప' సినిమాను 2025 ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించారు.
మంచు ఫ్యామిలీలో గొడవలు...
మరోవైపు మంచు ఫ్యామిలీలో గొడవలు ఇంకా సద్దుమణగలేదు. రీసెంట్ గా మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ మధ్య వివాదం జరగగా, పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మూడు రోజులపాటు ఈ వివాదంలో నెలకొన్న హైడ్రామా తర్వాత, మోహన్ బాబు దంపతులు అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం, అంతకంటే ముందు మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం, పోలీస్ అధికారులు అటు మనోజ్, ఇటు మంచు విష్ణు చేత బాండ్ రాయించుకోవడంతో వివాదం సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. కానీ మనోజ్ విష్ణుపై మరోసారి కంప్లైంట్ నమోదు చేయడంతో వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
Also Read: అల్లు ఇంటిలో టాలీవుడ్... మరి మెగా ఫ్యామిలీ ఎక్కడ? ఇవాళ ఎవరూ రాలేదే?