అన్వేషించండి

Mega Family: అల్లు ఇంటిలో టాలీవుడ్... మరి మెగా ఫ్యామిలీ ఎక్కడ? ఇవాళ ఎవరూ రాలేదే?

Allu Arjun Released From Jail: జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. ఆయన ఇంటి దగ్గరకు సినిమా ప్రముఖులు వస్తున్నారు. చిరు వైఫ్ సురేఖ తప్ప మెగా ఫ్యామిలీలో ఎవరూ కనిపించలేదు. ఎందుకు?

అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest ) తెలుగు రాష్ట్రాలలో సంచలనమైంది. జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగింది. సినిమా ప్రముఖులు మాత్రమే కాదు...‌ ఈ అరెస్టు పట్ల రాజకీయ నాయకులు సైతం స్పందించారు. ఒక రాత్రి జైలులో గడిపిన అల్లు అర్జున్... ఇవాళ ఉదయం విడుదలయ్యారు. ఆయనను పరామర్శించేందుకు టాలీవుడ్ సినిమా ప్రముఖులు అల్లు ఇంటికి క్యూ కట్టారు. మరి మెగా ఫ్యామిలీ ఎక్కడ? 

అల్లు ఇంటిలో కనిపించని మెగా హీరోలు!
రానా దగ్గుబాటి, నాగ‌ చైతన్య అక్కినేని, విజయ్ దేవరకొండ, కన్నడ స్టార్ ఉపేంద్ర నుంచి మొదలు పెడితే... సీనియర్ దర్శకులు రాఘవేంద్రరావు, యంగ్ దర్శకులు సుకుమార్, హరీష్ శంకర్ వరకు... పలువురు యువ హీరోలు దర్శక నిర్మాతలు అల్లు ఇంటికి వచ్చారు. 'పుష్ప 2' దర్శక నిర్మాతలు సైతం బన్నీని కలిశారు. అయితే... రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నది మాత్రం మెగా కుటుంబ సభ్యుల రాక కోసం!

అర్జున్ అరెస్టు వార్త తెలిసిన వెంటనే తన తాజా సినిమా 'విశ్వంభర' చిత్రీకరణ క్యాన్సిల్ చేసి మరి అల్లు ఇంటికి చేరుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.‌ ఆయనతో పాటు భార్య సురేఖ ఉన్నారు. చిరంజీవి తమ్ముడు నాగబాబు కూడా అరవింద్ దగ్గరకు వెళ్లారు. అది నిన్న రాత్రి!‌‌ బన్నీ జైల్లో ఉన్నప్పుడు! ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. బన్నీని చూడడానికి మేనత్త సురేఖ వచ్చారు తప్ప అల్లు ఇంటిలో మిగతా మెగా కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. అల్లు ఇంట నిన్న కనిపించిన చిరంజీవి, నాగబాబు కూడా ఇవాళ వెళ్లలేదు. 

రానాకు బర్త్ డే విషెస్... బన్నీకి నో రెస్పాన్స్!?
మెగా కుటుంబంలో యంగ్ హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గా తేజ్, వైష్ణవ్ తేజ్ అయితే అసలు స్పందించలేదు. కనీసం ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. తన స్నేహితుడు రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా ఒక ట్వీట్ వేసిన రామ్ చరణ్... అల్లు అర్జున్ అరెస్టు గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.‌ పోనీ ట్వీట్ చేశారా అంటే అది లేదు. దాంతో అల్లు ఇంట మెగా ఫ్యామిలీ ఎందుకు కనిపించడం లేదు అనే చర్చ సోషల్ మీడియాలో అభిమానుల మధ్య మొదలు అయ్యింది. 

చిరంజీవి, పవన్ స్పందించకపోవడమే మంచిది!?
మెగాస్టార్ చిరంజీవి గానీ, ఆయన తమ్ముడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గానీ అల్లు అర్జున్ అరెస్టు పట్ల స్పందించకపోవడం మంచిదని ఇండస్ట్రీలో పెద్దల నుంచి కూడా వినిపిస్తున్న మాట. 

అల్లు అర్జున్ అరెస్టు జరిగిన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక రాజకీయపరమైన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆయనకు చంద్రబాబు అరెస్టు సంగతి చెప్పారు. అరెస్టు జరిగినది తెలంగాణలో! పైగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసి వెళుతుందని చెప్పారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గానీ చిరంజీవి గానీ స్పందిస్తే... ఒక రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా స్పందించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్లు మాట్లాడకుండా ఉండటమే మంచిది అని అభిప్రాయం మెజారిటీ జనాలలో వ్యక్తం అవుతుంది.

Also Read: నేను ఎక్కడికీ పారిపోలేదు... పుకార్లకు మోహన్ బాబు చెక్ - ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారంటే?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్టు మీద ఆయన స్పందిస్తే... ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో స్పందించినట్లు అవుతుంది.‌ అప్పుడు అది రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణకు, లేనిపోని మనస్పర్థలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నేతలతోనూ, రేవంత్ రెడ్డితోనూ చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏమైనా అంటే మేనల్లుడి కోసం ముఖ్యమంత్రికి ఎదురు తిరిగినట్లు అవుతుంది. మరొకవైపు అల్లు అర్జున్ చట్టానికి పూర్తిగా సహకరిస్తానని చెబుతూ వస్తున్నారు. అందుకని చిరు పవన్ స్పందించాలని అనుకోవడం అత్యాశే అవుతుంది. అయితే... యంగ్ హీరోలు కూడా వెళ్లకపోవడం ఇక్కడ డిస్కషన్ పాయింట్. ఈ హడావిడి అంతా ముగిసిన తర్వాత మెగా ఇంటికి అల్లు అర్జున్ వెళతారా? మేనమామను కలిసి వస్తారా? లేదా? అనేది చూడాలి.

Also Read50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget