Allu Arjun Released - Siddharth: 50 షోలు వేస్తే 5000 టికెట్లు కూడా తెగలేదు... సిద్ధూను దెబ్బ కొట్టిన అల్లు అర్జున్ అరెస్ట్
Allu Arjun effect on Siddharth: తమిళ కథానాయకుడు సిద్ధార్థ్ మీద అల్లు అర్జున్ ఎఫెక్ట్ బలంగా పడింది. దెబ్బకు ఆయన సినిమా ఊసెత్తి మాట్లాడేవారు లేకుండా పోయారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు గురించే చర్చ. ఇటు అభిమానులు, అలాగే సినిమా ప్రేక్షకులలో మాత్రమే కాదు... అటు సామాన్య ప్రజలతో పాటు రాజకీయాల్లోనూ బన్నీ అరెస్టు హాట్ టాపిక్ అయ్యింది. సాధారణంగా శుక్రవారం వస్తే కొత్త సినిమాల గురించి ప్రేక్షకులు చర్చించుకోవడం సహజం కానీ... ఈ శుక్రవారం అల్లు అర్జున్ అరెస్టు గురించి తప్ప మరో ఊసులేదు. బన్నీ దెబ్బకు తమిళ కథానాయకుడు సిద్ధార్థ్ నటించిన 'మిస్ యు' జనాల దృష్టిలో లేకుండా మిస్ అయిపోయింది.
సిద్ధూను మళ్ళీ దెబ్బ కొట్టిన బన్నీ!?
సిద్ధార్థ్ తమిళ కథానాయకుడు. అయితే అతడిని తెలుగు హీరోలతో పాటు సమానంగా చూశారు ఏపీ తెలంగాణ ప్రజలు. 'బొమ్మరిల్లు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటనా' సినిమాల టైంలో తెలుగు హీరోలతో పాటు సరి సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్‌డమ్ చూశాడు. కానీ, ఇప్పుడు తెలుగులో అతడు డబ్బింగ్ హీరోగా మాత్రమే మిగిలాడు. ఇటువంటి సమయంలో 'మిస్ యు' ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు సిద్ధార్థ్ కొత్త కార్డు ప్లే చేశాడు. తాను ఇప్పుడు తెలంగాణ అల్లుడిని అని కూడా చెప్పారు.
ఇప్పుడు తెలంగాణ అల్లుడా? తమిళ హీరోనా? అని ప్రేక్షకులు వివక్ష చూపడం లేదు. సినిమా బాగుంటే చూస్తున్నారు. లేదంటే లైట్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్ మీద ఎఫెక్ట్ చేసే డైలాగులు వేస్తే పక్కన పెడుతున్నారు. అల్లు అర్జున్ 'పుష్ప 2' ట్రైలర్ లంచ్ పాట్నాలో జరిగినప్పుడు వచ్చిన జనాలు గురించి తమిళ ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు ఊరిలో జెసిబిలు వస్తే జనాలు వస్తారని కామెంట్స్ చేశాడు సిద్ధు. అహంకారపూరితంగా అతను అలా మాట్లాడాలని తెలుగు ప్రజలు నోచుకున్నారు.
'మిస్ యు' విడుదలకు ముందు రోజు ఆ సినిమా విడుదల అయ్యే థియేటర్ల దగ్గర జెసిబిలు పెట్టాలని (అప్పుడైనా సిద్ధార్థ సినిమాకు జనాలు వస్తారని వెటకారంగా) కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేశారంటే సిద్ధార్థ మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. మామూలుగా అయితే మినిమం ఆక్యుపెన్సి ఉండేదేమో!? 'పుష్ప 2' మీద చేసిన ఎఫెక్ట్స్ వల్ల జనాలు వస్తారా? రారా? అని కొంత మంది ఆలోచించారు.
Also Read: మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?
'పుష్ప 2' సినిమా మీద సిద్ధార్థ చేసిన కామెంట్స్ ఎఫెక్ట్ కాదు... అల్లు అర్జున్ అరెస్ట్ ఎఫెక్ట్ 'మిస్ యు' సినిమా మీద ఎక్కువ పడింది. శుక్రవారం కొత్త సినిమాలు ఏం వచ్చాయా? అని ఆడియన్స్ ఆలోచించడం మానేశారు. నిన్నంతా అల్లు అర్జున్ అరెస్టు గురించి ఎక్కువ డిస్కషన్ నడిచింది. మినిట్ టు మినిట్ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో థియేటర్ల దగ్గరకు జనాలు ఎవరూ వెళ్లలేదు. హైదరాబాద్ అంతా ఆల్మోస్ట్ 50 వరకు 'మిస్ యు' షోలు పడితే పట్టుమని 5000 టికెట్లు కూడా తెగలేదని సమాచారం అందుతుంది. ఒక్కో థియేటర్లో 100 మంది కూడా లేరట. దాంతో సిద్ధూని మరోసారి అల్లు అర్జున్ కోలుకోలేని గట్టి దెబ్బ కొట్టారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
Also Read: ఫిల్మ్ ఇండస్ట్రీకి చీకటి రోజు... అల్లు అర్జున్ అరెస్టుపై ఘాటుగా స్పందించిన బీజేపీ ఎంపీ