Shakuntalam: అట్లుంటది గుణశేఖర్‌తో - 'శాకుంతలం' కోసం ఎన్ని కేజీల బంగారం వాడారో తెలుసా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. తాజాగా ఈ మూవీలో సమంత లుక్ కు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్లను విడుదల చేశారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వలన విడుదల తేదీలో మార్పులు జరిగాయి. అయితే ఎట్టకేలకు మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీలో సమంత లుక్ కు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్లను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫోటోలలో సమంత ఒంటినిండా బంగారంతో దగదగా మెరుస్తూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమంత ధరించిన బంగారం గురించి ఇంట్రస్టింగ్ విషయాలను వెల్లడించారు దర్శకుడు గుణశేఖర్.
ఈ ‘శాకుంతలం’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను దర్శకుడు గుణశేఖర్ మీడియాతో పంచుకున్నారు. మైథలాజికల్ స్టోరీ నేపథ్యంలో వస్తోన్నఈ మూవీ శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా సాగుతుందని ఇప్పటికే వెల్లడించారు. ఇలాంటి పురాణాలకు సంబంధించిన చిత్రాలలో వేషధారణలు, ఆభరణాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో నకిలీ నగలనే వాడుతూ ఉంటారు. కానీ ‘శాకుంతలం’ సినిమాలో అన్నీ ఒరిజినల్ నగలనే వాడామని చెప్పారు గుణశేఖర్. వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించారాయన. ఈ లెక్కలు విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మూవీలో శకుంతల, దుష్యంతుల పాత్రలు చాలా కీలకమని అందుకే ఆ పాత్రలను రూపుదిద్దడానికి ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు దర్శకుడు గుణశేఖర్. అందుకోసం కేజీల కొద్దీ ఒరిజినల్ బంగారాన్ని ఉపయోగించినట్లు చెప్పారు. వాటి విలువ సుమారు 14 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ఓ ప్రముఖ బంగారు నగల షోరూమ్ వారితో మాట్లాడి.. వాటిని చేయించామని చెప్పారు. వాళ్లు దాదాపు ఆరేడు నెలలు శ్రమించి 14 కేజీల బంగారాన్ని వాడి వీటిని తయారు చేశారని తెలిపారు. అన్నీ ఒరిజినల్ బంగారం, వజ్రాలను వాడినట్టు చెప్పారు.
ఇంకా దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. తాను సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమాను స్పూర్తిగా తీసుకొని ఈ ఆభరణాలను తయారు చేయించినట్టు చెప్పారు. అందుకే ఈ సినిమాలో బంగారు ఆభరణాలు, కిరీటాలు అన్నీ నిజమైన బంగారంతో చేయించినట్టు చెప్పారు. తాము ఈ సినిమాలో వాడిన బంగారం, దుస్తులు అన్నీ తాము టైయ్యప్ అయిన బంగారు షో రూమ్ వాళ్లే తయారు చేశారని చెప్పారు. ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా, నేహ ఈ ఆభరణాలను డిజైన్ చేశారని తెలిపారు. శకుంతల పాత్రకి 15కేజీల బంగారంతో 14 రకాల ఆభరణాలు చేశామని, దుష్యంతుడి పాత్ర కోసం దాదాపు పది కేజీల బంగారు ఆభరణాలు, మేనక పాత్రలో మధుబాల కోసం ఆరు కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులు, బంగారు ఆభరణాలను తయారు చేయించామని తెలిపారు గుణశేఖర్. ఇలా తయారు చేసిన బంగారంతో చేయడం వలన ఆ పాత్రలకు మరింత అందం వచ్చిందని చెప్పారు. ఇక ఈ మూవీలో శకుంతల పాత్రలో సమంత నటించగా.. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. మోహన్‌బాబు, అల్లు అర్హ, అనన్య నాగళ్ల, కబీర్ బేడి తదితరులు నటించారు. గుణాటీమ్ వర్క్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.
Read Also: ఇండస్ట్రీలో నానికి పోటీనిచ్చే హీరో లేడట! ‘దసరా’ బాగా తీయలేదంటూ నేచురల్ స్టార్ వ్యాఖ్యలు