అన్వేషించండి

Operation Valentine: ‘ఆపరేషన్ వాలెంటైన్’ కోసం భారీ ప్లాన్ - బరిలోకి దిగనున్న టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు

Operation Valentine Trailer: వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ ట్రైలర్ లాంచ్ కోసం ఇద్దరు స్టార్ హీరోలు బరిలోకి దిగనున్నట్టు సమాచారం

Operation Valentine Trailer: 2024 సంక్రాంతికి విడుదల కావాలని ఎన్నో సినిమాలు ఆశపడినా.. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాగలిగాయి. మిగతా సినిమాలు ఇప్పటికీ పోస్ట్‌పోన్ అవుతూనే ఉన్నాయి. అలా రెండుసార్లు పోస్ట్‌పోన్ అయిన తర్వాత ఫైనల్‌గా మార్చి 1న థియేటర్లలో సందడి చేయడానికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ సిద్ధమయ్యింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను భారీ ఎత్తులో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ విడుదల చేయడానికి ఇద్దరు స్టార్ హీరోలను బరిలోకి దించుతున్నాడు వరుణ్ తేజ్.

ఫైనల్ స్ట్రైక్ వచ్చేస్తుంది..

ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ నుండి ఫస్ట్ స్ట్రైక్ అనే పేరుతో టీజర్‌ను విడుదల చేసింది టీమ్. ఈ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. టీజర్‌తో పాటు ఈ సినిమా నుండి రెండు పాటలు కూడా విడుదల అయ్యాయి. అందులో ఒకటి దేశభక్తి గీతం కాగా.. మరొకటి హీరోహీరోయిన్ మధ్య సాగే రొమాంటిక్ సాంగ్. ఇలా ఇప్పటివరకు ‘ఆపరేషన్ వాలెంటైన్’ నుండి విడుదలయిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ‘ఫైనల్ స్ట్రైక్’ అనే పేరుతో ఫిబ్రవరీ 20న ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్టుగా మూవీ టీమ్ ప్రకటించింది. ఇక ఈ ట్రైలర్‌‌ను విడుదల చేయడానికి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోలు ముందుకు రానున్నారు. రామ్ చరణ్, సల్మాన్ ఖాన్‌లతో ట్రైలర్ రిలీజ్ చేయించనున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

ప్రమోషన్స్‌లో బిజీ..

తెలుగులో ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేయగా.. హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ కష్టపడుతున్నారు. ఇక సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో ట్రైలర్‌ను విడుదల చేయిస్తే.. బాలీవుడ్ మూవీ లవర్స్‌లో కూడా కాస్త ఆసక్తి పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తున్నాడు వరుణ్ తేజ్. మార్చి 1న మూవీ విడుదల కానుండగా.. ఉన్న సమయాన్ని ప్రమోషన్స్‌కే కేటాయించాలని ఇతర షూటింగ్స్‌ను కూడా పక్కన పెట్టాడు ఈ మెగా హీరో.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ..

ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్‌కు సంబంధించిన స్టోరీతో పాన్‌ ఇండియా రేంజ్‌లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ తెరకెక్కింది. వైమానిక దాడులు, దేశభక్తి.. ఇవి సినిమాలో హైలెట్‌గా నిలుస్తాయని మూవీ టీమ్ చెప్తోంది. ఇక హిందీలో కూడా ఈ సినిమా తెరకెక్కడంతో.. వరుణ్ తేజ్ దీంతో మొదటిసారి నేరుగా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ మూవీ ద్వారా మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. మిస్ వరల్డ్‌గా కిరీటం దక్కించుకున్న తర్వాత బాలీవుడ్‌లో తనకు హీరోయిన్‌గా అవకాశాలు దక్కాయి. ఇక తెలుగులో మాత్రం తనకు ఇదే మొదటి సినిమా. బాలీవుడ్‌ డైరెక్టర్‌ శక్తి ప్రతాప్ సింగ్  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ నిర్మిస్తుంది. 

Also Read: బడ్జెట్ సమస్యలు, సినిమా ఆగిపోయిందంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget